బీట్‌రూట్‌లోని ఏ పోషకం క్యాన్సర్‌ను నివారిస్తుంది?

2 Mar, 2021 00:24 IST|Sakshi

చూడటానికి బీట్‌రూట్‌ ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటుంది. బీట్‌రూట్‌లోని ఆ ఎరుపు రంగుకు బిటాలెయిన్స్‌ అనే పోషకమే కారణం. ఇది ఒక చాలా శక్తిమంతమైన  యాంటీ ఆక్సిడెంట్‌. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అలాగే విటమిన్‌–సి కూడా ఎక్కువే. ఇది కూడా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కాబట్టి క్యాన్సర్ల నివారణకు తోడ్పడటంతో పాటు కొలాజెన్‌ ఉత్పాదనకు తోడ్పడి... దీర్ఘకాలం చర్మంతో పాటు శరీరం యౌవనంగా ఉండటానికి దోహదం చేస్తుంది. పైగా బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకునేవారిలో దానివల్ల అలసిపోకుండా చాలాసేపు ఉండగలిగే సామర్థ్యం (స్టామినా) పెంపొందుతుంది. దాంతో ఎంతసేపైనా అలసట లేకుండా వ్యాయామం చేయగలరు. వ్యాయామం క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా పరోక్షంగానూ బీట్‌రూట్‌ స్టామినాను పెంచడం ద్వారా కూడా క్యాన్సర్‌ను నివారిస్తుందన్నమాట.

మరిన్ని వార్తలు