ఫంగల్‌ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి!

19 Feb, 2023 01:59 IST|Sakshi

తరచూ ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ వస్తున్నాయా? ఆలస్యం వద్దు తెల్లముల్లంగితో వండిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే... ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. అంతేకాదు తేలిగ్గా నివారితమవుతాయి. దీనికి ఓ కారణం ఉంది. రెఫానస్‌ సెటైవస్‌ యాంటీఫంగల్‌ పెటైడ్ డ్‌–2  (సంక్షిప్తంగా ఆర్‌ఎస్‌ఏఎఫ్‌పీ–2) అనే ఓ ప్రోటీన్‌ కారణంగా తెల్లముల్లంగి ఫంగల్‌ వ్యాధుల్ని తేలిగ్గా నివారించగలుగుతుంది. 

అంతేకాదు... ఇది మంచి డీ–టాక్సిఫైయర్‌ కావడంతో దేహంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపుతుంది. తద్వారా కాలేయం ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. కామెర్లతో బాధపడిన వాళ్లలో ఎర్రరక్తకణాలు నాశనం కాకుండా కా పాడుతుంది. వాటిని కా పాడటమంటే పోషకాలు, ఆక్సిజన్‌ అందేలా చూసి ప్రతి కణాన్నీ కా పాడినట్టే. మామూలుగానైతే డయాబెటిస్‌తో బాధపడేవారు దుంపకూరల్ని తినకూడదంటారు. కానీ ముల్లంగిలోని పీచు చక్కెరను చాలా నెమ్మదిగా వెలువడేలా చేస్తుంది కాబట్టి ఇది డయాబెటిస్‌ ఉన్నవారికీ మేలు చేసే దుంపగా పేరుతెచ్చుకుంది. 
 

మరిన్ని వార్తలు