Interesting Facts About Toothbrush: మొట్టమొదటి టూత్‌ బ్రష్‌ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్‌!! పంది శరీరంపై...!

26 Nov, 2021 12:34 IST|Sakshi

Do You Know World's First Toothbrush Was Made By Pig Hair? మొదట పెరుగు తయారు చేసినప్పుడు తోడు ఎలా వచ్చింది..? విత్తనం ముందా, చెట్టు ముందా..? లాంటి అనుమానాలు మీ కెప్పుడైనా వచ్చాయా! అలాగే మనం రోజూ ఉదయానే పళ్లు తోమే బ్రష్‌ ఎలావచ్చింది.. ఎప్పుడు వచ్చింది? మొదట ఎవరు తయారు చేశారు, అది ఎలా ఉండేది? ఆ విశేషాలు తెలుసుకుందామా..

మన పూర్వులు వేపపుల్లలతో పళ్లు తోమేవారని అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పళ్లు తోముకోడానికి పుల్లలను వినియోగిస్తున్నారు కూడా! క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు ముందే టూత్‌ బ్రష్‌ వినియోగం ఉందట! ప్రస్తుతం వినియోగంలో ఉ​న్న బ్రష్‌ను మొదట వినియోగించింది మాత్రం చైనా దేశం. 600 యేళ్లకు ముందే మన ప్రపంచానికి బ్రష్‌లను పరిచయం చేసింది ఈ దేశమే.

చదవండి: Viral: 460 కోట్ల యేళ్లనాటి అరుదైన ఉల్క.. బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైనది!!

జూన్ 26, 1498న మొదటిసారిగా ఒక చైనీస్ రాజు టూత్ బ్రష్‌పై పేటెంట్ పొందాడు. ప్రపంచంలో మొట్టమొదటి టూత్ బ్రష్‌ను పంది వెంట్రుకలతో తయారు చేశారట. ఈ టూత్ బ్రష్‌పై ఉండే బ్రస్సెల్స్‌ చాలా గట్టిగా ఉండేవి. వీటిని పందుల మెడ వెనుక ఉండే మందపాటి జుట్టుతో తయారు చేయబడ్డాయి. ఈ వెంట్రుకలను వెదురు కర్రకు కట్టి టూత్ బ్రష్ లు తయారు చేశారు. 20వ శతాబ్ధం వరకు ఈ బ్రష్‌లను యూరప్‌, ఇంగ్లాండ్‌ దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకునేవి. 

1780లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియమ్‌ ఈడిస్‌ అనే ఖైదీ కనుగొనేంతవరకూ ఈ బ్రష్‌లనే వాడేవారు. ఆ కాలంలో విలియమ్‌ కూడా పంది వెంట్రుకలతోనే టూత్‌ బ్రష్‌ను తయారు చేసేవాడట. జైలు నుండి విడుదలయ్యాక 'విజ్‌డమ్‌ టూత్ బ్రష్' అనే కంపెనీని ప్రారంభించి, ఇంగ్లాండ్‌లో టూత్ బ్రష్‌ల ఉత్పత్తిని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఏటా 70 మిలియన్ టూత్ బ్రష్‌లు తయారు చేయబడుతున్నాయి.

1950లో డుపాంట్‌ డె నెమోర్స్‌ అనే వ్యక్తి నైలన్‌ బ్రిస్టల్‌ టూత్‌ బ్రష్‌లను ప్రపంచానికి పరిచయం చేశాడు. నవంబర్‌ 7, 1857లో హెచ్‌ఎన్‌ వడ్స్‌వర్త్‌ అనే వ్యక్తి టూత్‌ బ్రష్‌లపై పేటెంట్‌ పొందిన మొదటి అమెరికన్‌గా పేరుగాంచాడు. ఆ తర్వాత 1885లో అమెరికా దేశంలో పెద్ద ఎత్తున టూత్‌ బ్రష్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇలా వచ్చిందన్నమాట!! ప్రస్తుతం మనందరం వాడుతున్న టుత్‌ బ్రష్‌..!

చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్‌ వెనుక అసలు కారణం ఏమిటీ?

మరిన్ని వార్తలు