Meghana Pandit: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ హాస్పిటల్స్‌ సీయివోగా మేఘన.. ఆమెనే ఎందుకు?

21 Feb, 2023 15:50 IST|Sakshi
PC: Twitter

భారతీయ మూలాలు ఉన్న ప్రొఫెసర్‌ మేఘనా పండిత్‌ బ్రిటన్‌లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ హాస్పిటల్స్‌ సీయివోగా నియమితురాలై ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది.

గత సంవత్సరం జులై నుంచి బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ హాస్పిటల్స్‌(వోయుహెచ్‌), నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ట్రస్ట్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)కు తాత్కాలిక సీయివోగా బాధ్యతలు నిర్వహించిన మేఘన ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఆ బాధ్యత లు చేపట్టబోతోంది.

‘సీయివోగా మేఘన నియామకం సంతోషం కలిగిస్తుంది. విషయం మీద ఆసక్తి, అనురక్తి మాత్రమే కాదు అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని చెప్పడానికి ఆమె ఉదాహరణ. ఉద్యోగులతో కలిసి పనిచేసే తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతుంది.

ట్రస్ట్‌కు సంబంధించిన విలువలు కాపాడడంలో, ట్రస్ట్‌ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె నాయకత్వ బలం ఉపయోగపడుతుంది’ అంటున్నారు ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ జోనాథన్‌.

‘ఎన్‌హెచ్‌ఎస్‌’కు బ్రిటన్‌లో ఎన్నో టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఉన్నాయి. యూరప్‌లో అత్యధిక సంఖ్యలో హాస్పిటల్స్‌ ఉన్నాయి. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో ‘ఎన్‌హెచ్‌ఎస్‌’కు సంబంధించి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సిఎంవో)గా విధులు నిర్వహించింది మేఘన.

వార్‌విక్‌ యూనివర్శిటీ హానరరీ ప్రొఫెసర్‌గా నియామకం అయింది. ముంబైలో ఎంబీబీఎస్‌ చేసిన మేఘనా పండిత్‌ బోధన నుంచి నిర్వహణ వరకు తనదైన ప్రతిభతో ముందుకు దూసుకువెళ్తోంది.

చదవండి: మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..!

మరిన్ని వార్తలు