ఆలూని వేయిస్తే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఎందుకు అవుతుంది?.. కారణమిదే..

31 May, 2023 13:26 IST|Sakshi

ఆలూ అనేది ఎంతటి గొప్ప దుంపకూర అంటే దీనిని ఏ వంటకంలోనైనా వినియోగించవచ్చు. అలాగే దీనితో ప్రత్యేకమైన వంటకాలు కూడా చేయవచ్చు. పైగా దీనిని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే ఆలూ అనగానే ముందుగా చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ గుర్తుకువస్తాయి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా వీటిని తయారు చేయడం కూడా ఎంతో సులభం. అయితే ఆలూతో చేసే ఈ వంటకాన్ని ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అనే పేరు వినగానే మనకు ఫ్రాన్స్‌ గుర్తుకువస్తుంది. అయితే దీనికి ఫ్రాన్స్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ మొదట అమెరికాలో పుట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 17వ శతాబ్ధపు చివరిలో వేయించిన ఆలూని స్పెయిన్‌కు చెందిన కొందరు నిపుణులు దక్షిణ అమెరికా తీసుకువచ్చారట. తరువాత అది యూరప్‌ చేరిందట. దీని తరువాత ఆలూ ఫ్రాన్స్‌లో ఫేమస్‌ అయ్యిందట. వీటిని తొలుత ‘పోమ్‌ దె తెరె ఫ్రిట్‌’ లేదా ‘ఫ్రయిడ్‌ పొటాటో’ అని అనేవాట.

మొదటి ప్రపంచ యుద్ధంలో బెల్జియం సేన అధికారిక భాష ఫ్రాన్సీన్సీ. ఆ సమయంలో అమెరికా సైనికులు వాటిని ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అని పిలిచేవారట. ఈ పదం అమెరికాలో ఎంతో ఫేమస్‌ అయ్యింది. అదే పేరు ఈ వంటకానికి స్థిరపడిపోయింది. ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో వీటిని పోమ్‌ ఫ్రిట్‌ లేదా ఫ్రిట్‌ అని పిలుస్తుంటారు. కెనడాలో ఫ​్రెంచ్‌ ఫ్రెస్‌ను మసాలా గ్రేవీ, వెన్నతో కూడిన పెరుగులో వేసుకుని ఇష్టంగా తింటారట. 

మరిన్ని వార్తలు