బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!!

15 Oct, 2021 11:10 IST|Sakshi

ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో చాలామంది అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం.. శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం.

ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల ప్రతి రోజూ అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఏవైనా ఇతర కారణాల వల్ల ఇడ్లీ, చపాతీ, పూరీ, దోసె వంటి వాటిని తీçసుకోవడం ఇష్టం లేకపోతే లేదా సమయం సరిపోకపోతే మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె లేకుండా చపాతీలు, పండ్ల రసాలేకాక... ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలగలిపిన సలాడ్‌లు వంటివి తీసుకోవడం మంచిది. కనీసం ఇలా చేసినా కూడా అనారోగ్యాన్ని కలిగించే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లు దాదాపు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.

వీటితో పాటు.. అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధిగమించడమే కాకుండా, జ్ఞాపకశక్తి పెంచుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే డైటింగ్‌ చేసే వారు నిర్లక్ష్యం చేయకుండా.. అల్పాహారం తీసుకోవడం మరువకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

చదవండి: Mental Health: మంచి మ్యూజిక్‌, యోగా, డాన్స్, స్విమ్మింగ్‌.. వీటితో ఒత్తిడి హుష్‌!!

మరిన్ని వార్తలు