పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ అవార్డు..!!

14 Oct, 2021 13:00 IST|Sakshi

బెంగళూరుకు చెందిన 10 యేళ్ల విద్యున్‌ ఆర్‌ హెబ్బర్‌ అనే బాలుడు 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ అందుకున్నాడు. ఈ బాలుడు తీసిన తలకిందులుగా ఉన్న సాలెగూడు ఫొటోకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఫొటో బ్యాక్‌ గ్రౌండ్‌లో ప్రకృతి రంగులు అందంగా అద్దినట్టు అద్భుతంగా తీశాడు. దీనిని డోమ్‌ హోమ్‌ అని అంటారు.

తన ఇంటి సమీపంలో ఉన్న వీధుల్లో, పార్కుల్లో నివసించే  జీవులను ఫోటో తీయడం ఇష్టమని, ఎనిమిదేళ్ల వయసులో ఈ పోటీలో మొదటిసారి పాల్గొన్నానని హెబ్బర్‌ మీడియాకు తెలిపాడు.

కాగా లండన్‌కి చెందిన మ్యూజియం ఆఫ్‌ న్యాచురల్‌ హిస్టరీ 1965 నుంచి ఈ కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేచర్‌ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌గా పేర్కొంటారు. ఈ ఈవెంట్‌కి 95 దేశాల నుంచి దాదాపుగా 50,000ల ఎంట్రీలు అందాయి. 19 కేటగిరీల్లో నిర్వహించిన పోటీలో విజేతల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. విజేతల్లో మన దేశం తరపున విద్యున్‌ ఆర్‌ హెబ్బర్‌ అవార్డు అందుకోవడం దేశానికే గర్వకారణం.

చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు..

మరిన్ని వార్తలు