Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే..

14 Nov, 2022 12:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Winter Skin Care Tips In Telugu: చలికాలంలో ఇంచుమించు అందరినీ వేధించే సమస్యలలో ప్రధానమైనది చర్మం పొడిగా మారడం. చలి ముదిరేకొద్దీ ఇది సహజమైనదే అయినా, తెలిసీ తెలియక మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం మరింత త్వరగా పొడిబారిపోతుంది. అవేమిటో తెలుసుకుని, వాటికి దూరంగా ఉందాం.

వేడి నీటి స్నానం
సాధారణంగా చలికాలంలో అందరూ వేడినీటి స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. నిజానికి బడలికగా ఉన్నప్పుడు వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర అలసట తొలగిపోతుందనేది చాలామందికి అనుభవమే. అయితే స్నానానికి ఉపయోగించే నీరు తగుమోతాదు వేడిలో మాత్రమే ఉండాలి.

బాగా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది. వేడి నీరు చర్మంలో ఉన్న ఆయిల్‌ను, తేమను తొలగిస్తుంది. అందుకే వేడి నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

చర్మానికి అది మంచిది కాదు
చాలా మంది మేకప్‌ వేసుకొని అలాగే నిద్రపోతారు. ఇది చర్మానికి మంచిది కాదు. నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని కడుక్కుని, మాయిశ్చరైజర్‌ రాసుకొని పడుకోవాలి. రాత్రి చర్మ సంరక్షణ దినచర్య చాలా ముఖ్యం ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

చల్లబడిన ఆహారం తింటే
చల్లబడిన ఆహారం తీసుకోవడం చలికాంలో ఆహారం తొందరగా చల్లారి పోతుంది. అలా చల్లారిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తొందరగా అరగదు. ఫలితంగా చర్మం డ్రైగా అవుతుంది. అందువల్ల వీలయినంత వరకు వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

నీరు ఎక్కువగా తాగితేనే
తక్కువ నీరు తాగడం చలికాలంలో దాహం ఎక్కువగా వేయదు. అందువల్ల చాలామంది మంచినీళ్లు తాగరు. అయితే దాహం వేసినా, వేయకపోయినా అరగంటకోసారి రెండు మూడు గుక్కలు నీటితో గొంతు తడుపుకుంటూ ఉండటం మంచి అలవాటు. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల చర్మం త్వరగా పొడిబారిపోకుండా ఉంటుంది.

చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే..
Athiya Shetty: బొప్పాయి గుజ్జు, రోజ్‌ వాటర్‌.. పార్టీకి వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా! నా బ్యూటీ సీక్రెట్‌
Diabetes: షుగర్‌ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్‌ తాగితే 15 నిమిషాల్లో..

మరిన్ని వార్తలు