Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ తొలగించేందుకు.. ఆనప ఫేస్‌ ప్యాక్‌!

20 Nov, 2021 12:51 IST|Sakshi

Winter Skin Care Tips In Telugu: వాతావరణం మారినప్పుడల్లా ఆ ప్రభావం సున్నితమైన చర్మంపై పడుతుంది. ఫలితంగా ముఖం మీద ట్యాన్‌ పేరుకు పోవడం, కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ ఏర్పడటం.. వెరసి ముఖం పొడిబారి గ్లో తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, పోషణ అందించే ప్యాక్‌లు వాడటం ద్వారా పోయిన గ్లోను తిరిగి తెస్తాయి.  

►సొరకాయ (ఆనప కాయ) గుజ్జులో పావు టీస్పూను తేనె, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను రోజ్‌ వాటర్, విటమిన్‌ ఈ క్యాప్సూల్‌ వేసి పేస్టులా కలుపుకోవాలి.


►ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదినిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి.  
►ముఖాన్ని శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల నల్లని మచ్చలు, ట్యాన్‌ తొలిగి ముఖం నిగారింపును సంతరించుకుంటుంది.

చదవండి: Weight Loss Diet: ఆ హార్మోన్‌ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ..

మరిన్ని వార్తలు