సెల్యూట్‌ టు కల్నల్‌ స్వప్న రాణా

18 Feb, 2024 06:16 IST|Sakshi

వైరల్‌

‘ఉమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌’ సిరీస్‌లో భాగంగా కల్నల్‌ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌పై ఆన్‌లైన్‌ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్‌లాంటి బాలీవుడ్‌ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది.

‘హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న  ఆ తరువాత సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేరవుతూనే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్‌ కార్ప్స్‌ బెటాలియన్‌కు కమాండింగ్‌ ఆఫీ సర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్‌లు ఎన్నో అందుకుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు