ఐదేళ్లుగా శవం పక్కనే : పోలీసులే షాక్‌ అయిన దృశ్యాలు

24 Feb, 2024 12:51 IST|Sakshi

ఇంటినిండా చెత్తా. చెదారం..ఎలుకలు, మానవ వ్యర్థాల గుట్టలు, కుళ్లిపోయిన అస్తి పంజరం, ఎముకలు ఇదంతా.. ఇదేదో హారర్‌ హౌస్ దృశ్యాలు అనుకుంటున్నారా? కానే కాదు శవంతో ఐదేళ్ల పాటు జీవించిన జీవించిన మహిళ దుర్భర స్థితి. వివరాలు..

ఆస్ట్రేలియాకు చెందిన వృద్ధురాలు (70) తన సోదరుడి కుళ్ళిన శవం పక్కన ఐదు సంవత్సరాలుగా ఉండి పోయింది. మెట్రో ప్రకారం జీలాంగ్‌లోని సంపన్న శివారు ప్రాంతంలోని ఇల్లు అది.  దీంతో ఇల్లంతా చచ్చిపడిన ఎలుకల మయం. ఎక్కడ చూసినా మానవ వ్యర్థాలు, ఎలుకల విసర్జాలతో భరించలేని వాసన. అయినా  ఇంట్లోంచి బయటికి రాకుండా  లోపలే ఉండిపోయింది. 

ఒక వ్యక్తి అదృశ్యం కేసులో పోలీసులు నిందితురాలుగా 2022లో  ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత పోలీసులు ఆమెను వదిలివేశారు. టాప్ డిటెక్టివ్ సీనియర్ సార్జెంట్ మార్క్ గుత్రీ సమగ్ర దర్యాప్తులో తాజా విషయాలు వెల్లడైనాయి. విచారణ నిమిత్తం వెళ్లినపుడు అక్కడి పరిస్థితి చూసి పోలీసులే ఖంగుతిన్నారు. విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు కూడా వణికిపోయారు. బయోహజార్డ్ సూట్లు ధరించి మరీ ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి వెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

కొంతమంది వ్యక్తులు 2018లో చివరిసారిగా ఆ వ్యక్తిని సజీవంగా చూశారట.  ఈ మహిళ మానసిక అనారోగ్యంపై అనేక ఫిర్యాదులొచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి ఆరోపలు నమోదు కాలేదని, సోదరుడి మరణానికి గల  కారణాన్ని  విచారిస్తున్నారు పోలీసు అధికారులు

whatsapp channel

మరిన్ని వార్తలు