Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!

28 Oct, 2021 16:52 IST|Sakshi

ఎన్నో అద్భుత, మర్మగర్భ దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. వాటిల్లో యోగిని దేవాలయాలు కూడా చెప్పుకోదగ్గవే. మన దేశంలో మొత్తం 64 యోగిని దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో రెండు దేవాలయాలు ఒడిస్సాలో, రెండు మధ్యప్రదేశ్‌లో ఉ‍న్నాయి. 

మధ్యప్రదేశ్‌లోని మితావాలి గ్రామంలో ఉన్న 64 యోగిని దేవాలయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇది గుండ్రని ఆకారంలో, 64 గదుల్తో ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిని దేవత విగ్రహం ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయానికి 64 యోగిని దేవాలయం అనేపేరు వచ్చింది. ఐతే వీటిల్లో కొన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి. మిగిలినవాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు.

చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్‌.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..

సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో కొండపైన వృత్తాకారంలో ఉంటుంది ఈ దేవాలయం. చూపరులకు పళ్లెం ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఆలయం మధ్యలో బహిరంగ మంటపం నిర్మించబడి ఉంటుంది. భారత పార్లమెంట్‌ను నిర్మించిన బ్రిటీష్‌ ఆర్కిటెక్చర్‌ సర్‌ ఎడ్విన్ లుటియెన్స్ ఈ  64 యోగిని దేవాలయం ఆధారంగానే నిర్మించాడని నానుడి. పార్లమెంటు స్తంభాలు కూడా ఇక్కడి స్తంభాలమాదిరిగానే ఉంటాయి.

చదవండి: ఈ విటమిన్‌ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..

తాబేలు రాజు దేవ్‌పాల్‌ 1323లో ఈ దేవాలయాన్నినిర్మించాడు. ఇక్కడ జ్యోతిష్యం, గణితం బోధించేవారట. తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు ప్రజలు ఈ శివాలయానికి తరలివచ్చేవారట. ఈ దేవాలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడివుందని అక్కడి స్థానికుల నమ్మకం​. అందుకే రాత్రి వేళ ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కాళీమాత 64వ అవతారమే యోగిని అని, ఘోర అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఈ అవతారాన్ని ధరించిందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఇంకా ఎన్నో అంతుచిక్కని మర్మగర్భిత రహస్యాలు ఈ 64 యోగిని దేవాలయంలో దాగివున్నాయి.

చదవండి: 'నీ అఫైర్ గురించి సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’

మరిన్ని వార్తలు