World Heart Day: పెరుగుతున్న గుండెపోటు..

29 Sep, 2021 10:21 IST|Sakshi

అలవాట్లు అదుపు చేసుకుంటేనే గుండెకు రక్ష

జీవనశైలే ప్రధాన కారణం

నేడు ‘వరల్డ్‌ హార్ట్‌ డే’

మారుతున్న జీవనశైలి, స్తబ్దమైన యాంత్రిక జీవనం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, సమయ పాల నలేని ఆహారం, రక్తపోటు, షుగర్‌ వ్యాధితో పాటు శరీర బరువుపై అదుపుకోల్పోవడం, వైద్య పరీక్షలకు నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. దీంతో పాటు మధుమేహం అధిక ముప్పుగా మారింది. అధిక రక్తపోటు, ఊబకాయ సమస్యలూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

రెండేళ్లుగా సహజంగా గుండెపోటు మరణాలు పెరిగాయి. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల రెట్టింపు అయ్యాయి. ప్రమాదవశాత్తు కాకుండా వయసుతో సంబంధం లేకుండా చోటుచేసుకునే మరణాల్లో ఎక్కువగా గుండె పోటుతోనే అనేది చేదునిజం. బుధవారం వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం. 
జిల్లాలో 35శాతం బాధితులు ఉమ్మడి జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు 35శాతం ఉన్నట్లు అంచనా. వీరిలో మగవారు 22శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం, పట్టణాల్లో వీరి 56శాతం ఉంటుందని వైద్యాధికారుల తేల్చారు. ఆకస్మిక సమస్య ఎదురైన వారిలో 10శాతం మాత్రమే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. 

20ఏళ్ల లోపు వారికి..  
గుండె పోటు చాలా తక్కువగా 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం 20ఏళ్ల వయసు యువకుల దగ్గర నుంచి 70ఏళ్ల వరకు వస్తుంది. ప్రధాన కారణంగా అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, చిన్న వయస్సులో షుగర్‌ రావడం, బీపీ, ఫాస్ట్‌ఫుడ్, లావు పెరగడం, చెడు కొలాస్ట్రాల్‌ వల్ల దారితీస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే 100రోగులలో 70శాతం మంది గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. 

50 నుంచి 60శాతం పెరిగాయి 
జిల్లాలో కోవిడ్‌ వల్ల 50నుంచి 60శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు పెరిగాయి. కరోనా సోకిన 7నుంచి 10రోజుల మధ్య కాలంలో ఈ సమస్య బాగా వేధిస్తుంది. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, మద్యం, సిగరెట్‌ వల్ల సమస్య ఉండేది. అధిక ఆయాసం, గుండె నొప్పి ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ దగ్గర సరైన చికిత్స తీసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. 
– మహేష్‌ బాబు, కార్డియాలజిస్ట్, మహబూబ్‌నగర్‌  

వ్యాయామం లేకపోవడం వల్లే.. 
చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడంతో పాటు ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల అధికంగా ఊబకాయం పెరిగి చిన్న వయస్సులో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఉద్యోగులు పనులు పూర్తి చేసుకొని ఎలాంటి వ్యాయామం లేకుండా నిద్రపోవడం. తెలియకుండానే కొవ్వు పెరిగి రక్తంలో బ్లాక్స్‌ ఏర్పాటు అవుతాయి. దీంతో గుండె, మెదడు స్ట్రోక్‌ వస్తోంది. రోజు 45నిమిషాల పాటు వ్యాయామం చేసి, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకుంటే మంచిది. మాంసం వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. 
– బాలశ్రీనివాస్, జనరల్‌ ఫిజీషియన్, మహబూబ్‌నగర్‌  

చదవండి: Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్‌ మాస్క్‌..


  

మరిన్ని వార్తలు