World IVF Day 2023: నేడు ప్రపంచ ఐవీఎఫ్‌ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య

25 Jul, 2023 13:15 IST|Sakshi

నేడు ప్రపంచ ఐవీఎఫ్‌ దినోత్సవం.ఈ సందర్భంగా ఎన్నో జంటలను వేధించే వంధ్యత్వ సమస్య గురించి తెలుసుకుందాం. వంధ్యత్వం అనేది పిల్లలు కనలేని స్థితి. కొన్ని జంటలు ఈ సమస్య కారణంగా శారీరకంగా మానసికంగా చాలా క్షోభని అనుభవిస్తారు. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది. దీని నుంచి ఎలా బయపడొచ్చో చూద్దాం.

నిజానికి నూటికి 50 శాతం జంటలు ఈ సమస్యను అనుభవిస్తున్నావారే. దీనికి ఇద్దరిలో ఒకరి వల్ల కావచ్చు లేదా ఇద్దరిలోనూ సమస్య ఉండవచ్చు. ముందుగా మగవారిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో చూద్దాం. 

మగవారిలో ఈ సమస్య ఎలా తలెత్తుతుందంటే..

 • వారిలో స్పెర్మ​ కౌంట్‌ సరిగా లేకపోవడం. 
 • వృషణాలలో సమస్య
 • గవదబిళ్లలు వంటి ఇన్ఫెక్షన్లు
 • అకాల స్ఖలనం
 • సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ వంటి జన్యుపరమైన రుగ్మత
 • పునరుత్పత్త అవయవాలకుగాయలు
 • ఎక్కువగా ఆవిరి పట్టడం, వేడి నీటి స్నానాలు కారణంగా స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం ఏర్పడుతుంది
 • స్మోకింగ్‌, మద్యపానం, డ్రగ్స్‌ వంటివి వాడినా
 • క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్స రేడియోషన్‌ లేదా కీమోథెరఫీ వంటి వాటివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఇక స్త్రీలలో ఎలా ఎదురవుతందంటే..

 • పీసీఓఎస్‌, హైపర్‌ప్రోలాక్టినిమియా లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత
 • గర్భాశయ అసాధారణతలు, గర్భాశయ పాలిప్స్‌, ఫైబ్రాయిడ్లు తదితర కారణాలు
 • ఫెలోపియన్‌ ట్యూబ్‌ దెబ్బతినడం, అండాలు ప్రయాణానికి ఆటంకం కలిగంచే సంశ్లేషణలు
 • ఎండోమెట్రియోసిస్‌, టర్నర్‌ సిండ్రోమ్‌, పెల్విక్‌ సర్జరీలు, క్యాన్సర్‌ చికిత్సలు సంతానోత్సత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ఇగ మగవారిలోనూ, స్త్రీలలోనూ కామన్‌గా ఎదురయ్యే సమస్యలు
30వ దశకం దాటిని స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది
అలాగే పురుషులలో 40 ఏళ్లు పైబడిన వారికి సంతాన సామర్థ్యం తగ్గుతుంది
పురుషులకు మద్యం, సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే గర్భస్రావం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఇద్దరిలో ఎవరు అధిక బరువు ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది. 

ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుషులకు దీనిపై అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే దీన్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ్ల ఇరువురికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒక చక్కని మార్గంలా ఈ కార్యక్రమాలు  ఉపయోగపడతాయి. అదేవిధంగా జంటలు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యను సానుకూల దృష్టితో చూసే అవకాశం, అవగాహన ఏర్పడుతుంది. ఇక చక్కటి కుటుంబం కోసం ఆరాటపడే జంటలు పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్‌ పెట్టడమేగాక ఆనందమయ జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. 

(చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్‌ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!)

మరిన్ని వార్తలు