-

ఇంట్లోనే ఈజీగా మసాజ్‌ చేయించుకోవచ్చు ఇలా..!

26 Nov, 2023 13:11 IST|Sakshi

శారీరకంగా బాగా అలసిపోయినప్పుడు చాలామంది మర్దనతో సేదదీరాలని కోరుకుంటారు. ఒంట్లోని కండరాలు సేదదీరేలా మర్దన చేయడం ఒక కళ. ఈ కళలో నిపుణులైన వాళ్లు స్పాలు, మసాజ్‌ సెంటర్లలో సేవలందిస్తుండటం తెలిసిందే. ‘కరోనా’ కాలంలో మనిషి పొడ సోకితేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. మనిషిని మనిషి తాకకుండా మర్దన చేయడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే, మనిషితో ప్రమేయం లేకుండానే చక్కగా మర్దన చేయగల రోబోను అమెరికన్‌ కంపెనీ ‘ఫిలాన్‌ ల్యాబ్స్‌’ రూపొందించింది.

ఈ మసాజర్‌ రోబో పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. మనిషి శరీరాకృతి, కండరాల పనితీరు ఆధారంగా తగిన రీతిలో మర్దన చేస్తుంది. ఈ రోబోకు అమర్చిన 35 సెంటీమీటర్ల భుజం మంచం మీద పడుకున్న మనిషి శరీరం అంతటా సంచరిస్తూ, గరిష్ఠంగా 6.8 కిలోల ఒత్తిడి కలిగిస్తూ మర్దన చేస్తుంది. సున్నితంగా మర్దన చేయాల్సిన చోట సున్నితంగా, ఎక్కువగా ఒత్తిడి కలిగించాల్సిన చోట ఎక్కువగా ఒత్తిడి కలిస్తూ నిమిషాల్లోనే కండరాలు సేదదీరేలా చేస్తుంది. దీని ధర 3,499 డాలర్లు (రూ.2.91 లక్షలు) మాత్రమే!

(చదవండి: చాయ్‌ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!)

మరిన్ని వార్తలు