లాక్‌డౌన్‌లో బ‌రువు పెరిగారా? ఇలా చేయండి

17 Aug, 2020 12:35 IST|Sakshi

లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోలను చూసి  ప్రొఫెష‌న‌ల్  షెఫ్ అవ‌తార‌మెత్తారు.  వంట‌లన్నీ ప్ర‌యోగాలు చేస్తూ హ‌ల్‌చ‌ల్ చేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఫిట్‌నెస్ ప్రీక్‌గా ఉన్న‌వారు సైతం బ‌రువు పెరిగారు. దీంతో స‌హ‌జంగానే కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అయితే దీని గురించి ఏమాత్రం ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. కేవ‌లం కొన్ని జాగ్ర‌త్త‌లు, నియ‌మాల‌తో మ‌ళ్లీ ఫిట్‌గా ఉండొచ్చు. పెరిగిన బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. దీనికి బొప్పాయి పండే ప‌రిష్కార‌మంటున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌న దిన‌చ‌ర్య‌లో అల్పాహారం తీసుకోవ‌డం అతి ముఖ్య‌మైన‌ది. అయితే కొంద‌రు స‌మ‌యం లేద‌నో, ఒకేసారి మ‌ధ్యాహ్నం తినొచ్చ‌నో ఏవేవో కార‌ణాలు చెప్పి బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. ఇలా త‌రుచూ అల్పాహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల తొంద‌ర‌గా బ‌రువు పెరుగుతారు. కాబ‌ట్టి ఫిట్‌గా ఉండాల‌నుకునేవారు మొద‌ట క్ర‌మ‌ం త‌ప్పకుండా అల్పాహారం చేయాలి. దీని వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటుంద‌ట‌. (అదృష్టం అంటే నీదిరా బాబు!)

ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి ఉత్త‌మ‌మైన అల్పాహారం బొప్పాయి పండు.దీనిలోని ఫైబ‌ర్, ప్రోటీన్, విట‌మిన్లు లాంటి ముఖ్య‌మైన పోష‌కాలు అంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శ‌రీరానికి ఎంతో శ‌క్తినిచ్చే బొప్పాయిని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌కుండా చేస్తుంద‌ట‌. ఆఫీసుకు లేట్ అవుతుంద‌ని బ్రేక్‌ఫాస్ట్‌ని మానేసేవాళ్ల‌కి ఇదో చ‌క్క‌ని ప‌రిష్కారం. కేవ‌లం కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే బొప్పాయితో మంచి బ్రేక్‌ఫాస్ట్ త‌యారు చేయ‌వ‌చ్చు. ఇందులోని ఫైబ‌ర్‌, ప్రోటీన్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని క‌లిగిస్తుంది. త‌ద్వారా మ‌ధ్యాహ్న స‌మ‌యం వ‌ర‌కు మీ ఆక‌లిని అరిక‌ట్టేందుకు బెస్ట్ ఛాయిస్ అంటున్నారు నిపుణులు. బొప్పాయి గుజ్జు, క‌ప్పు పెరుగు, పావుక‌ప్పు పాలు క‌లిపి మిక్సీ ప‌ట్టాలి. త‌ర్వాత దీనికి రెండు టేబుల్ స్పూన్ల తేనెను క‌లిపి ప్ర‌తీరోజూ ఉద‌యం అల్పాహారంలా తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యంతో పాటు అంద‌మూ మెరుగుప‌డుతుంది. సో  లాక్‌డౌన్‌లో కార‌ణంగా బ‌రువు పెరిగిన వారికి ఇదో చ‌క్క‌టి పరిష్కారమంటున్నారు వైద్య నిపుణులు. ఈ లిస్ట్‌లో మీరూ ఉంటే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేసేయండి. (నానమ్మ పిజ్జా సూపర్‌హిట్‌)


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు