పిల్లల గొంతుల్లో ఏదైనా ఇరుక్కుంటే...

24 Mar, 2021 10:52 IST|Sakshi

చిన్నపిల్లలు ఏదైనా తినేటప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఆహారపదార్థాలు గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుంటే మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టినప్పుడు తల కిందికి ఉండేలా చూడాలి.  వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి తేవాలి. మన కాళ్ల ఒత్తిడి పిల్లల పొట్ట మీద పడి... అది పైకి ఎగబాకి, అడ్డుపడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను పై వైపునకు... అంటే నడుము నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలిస్తే, గొంతులో ఇరుకున్న పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సూచనలు ఫలించకపోతే చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ కొన్ని లారింగోస్కోపీ అనే పరికరం ద్వారా గొంతును పరీక్ష చేసి, అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు. 

మరిన్ని వార్తలు