ప్రతి దృశ్యం అంతులేని కవిత్వం!

13 Jan, 2021 08:55 IST|Sakshi

ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీలో తాజా కెరటం లౌకిక్‌దాస్‌. కోల్‌కతాకు  చెందిన దాస్‌ న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో డిప్లొమా చేశాడు. న్యూయార్క్‌ ఫ్యాషన్ ‌వీక్‌ 2020లో ఇతడికి ఎనిమిది షోలు కవర్‌ చేసే ఛాన్స్‌ దొరికింది. ప్రస్తుతం కోల్‌కతా కేంద్రంగా తన పాషన్‌ కొనసాగిస్తున్న లౌకిక్‌దాస్‌ మాటలు కొన్ని... ∙నేను ఎప్పుడూ ఫాలో అయ్యే ఏకైక రూల్‌... ఏ రూల్‌ ఫాలో కావద్దని! ఎందుకంటే ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మకమైనది. దానికి హద్దులు, పరిమితులు లేవు ∙ఫొటోగ్రఫీలోని రకరకాల జానర్స్‌లో ఎన్నో గొప్ప అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా మన కోసం ఎదురుచూస్తున్నాయి ∙ఏ పుస్తకమో ఎందుకు? ‘ప్రకృతి’ అనే అందమైన పుస్తకాన్ని చదివితే ఎంతో జ్ఞానం మన సొంతమవుతుంది. అది మన వృత్తికి ఇరుసుగా పనిచేస్తుంది ∙‘ఈ దృశ్యంలో ఏదో మ్యాజిక్‌ ఉంది’ అని పసిగట్టే నైపుణ్యాన్ని మన కంటికి నేర్పాలి.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా