ప్రేమ పెళ్లి అంత వీజీ కాదు

18 Jan, 2021 09:02 IST|Sakshi

కాజోల్‌ తాజా సినిమా ‘త్రిభంగ’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఫ్యామిలీ అనుబంధాలలోని సవాళ్లను ఈ సినిమా చర్చిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ‘త్రిభంగ’ అనేది ఒడిస్సీ నృత్యంలో ఒక భంగమ. దానిని కచ్చితంగా ఎవరూ పెట్టలేరు.. అయినా ఒక అందం ఉంటుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ఫ్రమోషన్‌లో కాజోల్‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో అనుబంధాలన్నీ అందరి ఇష్టాల కచ్చితత్వంతో ఉండవని అంది. ‘1999లో అజయ్‌ దేవగన్‌ను నేను పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు మా నాన్న షోము ముఖర్జీ అందుకు సముఖంగా లేరు. అప్పుడు నా వయసు 23 ఏళ్లు. ఇంకా కొన్నాళ్లు పెళ్లిని వాయిదా వేసి కెరీర్‌ మీద దృష్టి పెట్టాలని ఆయన ప్రతిపాదన.

నాకేమో పెళ్లి చేసుకోవాలని. మరోవైపు అజయ్‌ తల్లిదండ్రులు మా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. మా నాన్న మాత్రం నాతో నాలుగురోజులు మాట్లాడలేదు కూడ. అప్పుడు మా అమ్మ (తనూజ) నాకు సపోర్ట్‌గా నిలిచింది. నీ మనసుకు నచ్చినట్టు చెయ్‌ అని చెప్పింది. మా అమ్మ నా ప్రతి కష్టకాలంలో నాకు తోడు ఉంది. ఆమె అన్నీ నాకు వివరించి చెప్పేది. మా నాన్నంటే మాకు ఎంత ఇష్టమైనా ఆమె వివరించిన దానిని బట్టి వారి విడాకులను పిల్లలం మేము అర్థం చేసుకున్నాం. కుటుంబంలో సవాళ్లు వస్తూనే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి’ అంది కాజోల్‌. అజయ్‌–కాజోల్‌ల జంట బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ వివాహిత జంటగా గుర్తింపు పొందింది. వారికి ఇద్దరు పిల్లలు. అజయ్, కాజోల్‌ నటనను కొనసాగిస్తున్నారు.. సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు