కొత్తకొత్తగా: ఇంటెలిజెంట్‌ ఫుడ్‌ మేకర్‌.. స్మాల్‌ స్మార్ట్‌ కుక్కర్‌

23 May, 2021 13:51 IST|Sakshi

చకచకా పనులయిపోవడానికి ఎలక్ట్రానిక్‌ యంత్రాలే సరైన సాధనాలు. వంటా దీనికి మినహాయింపేమీ కాదు. వంటింట్లో ఆ యంత్ర పరికరమే ఈ ఆయిల్‌ ఫ్రీ ఎయిర్‌ ఫ్రయింగ్‌ మేకర్‌. హై-స్పీడ్‌ ఎయిర్‌ సర్క్యులేషన్‌ సూత్రాన్ని అనుసరించి, అతి తక్కువ నూనెతో మహారుచికరమైన ఆహారాన్ని వండిపెడుతుంది నిమిషాల్లో.  హై టెక్నాలజీతో రూపొందిన ఈ హై టెంపరేచర్‌ హాట్‌ ఎయిర్‌ ఫ్రయర్‌.. 80 శాతం నూనె వాడకాన్ని తగ్గిస్తుంది. వేపుడు కూరలే కాదు ఆవిరి మీద ఉడికే వంటకాలనూ వండుకోవచ్చు.  మేకర్‌ కింద ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తున్న భాగంలో నీళ్లు నింపుకునే వీలుంటుంది. 

ఆ భాగాన్ని సొరుగు మాదిరిగా ముందుకు లాగాల్సి ఉంటుంది. దీని కెపాసిటీ 2 లీటర్లు. ఇందులోని  స్టీమ్‌ గ్రిల్లింగ్‌ మోడ్‌.. లోపలి భాగంలో తేమని లాక్‌ చేసి పై లేయర్‌లోని ఆహారాన్ని బేక్‌ చేస్తుంది. దాంతో ఈ వంటకం యమ్మీ యమ్మీగా చవులూరిస్తుంది.  దీనిలోని వార్మ్‌ హీటింగ్‌ డిజైన్.. హోల్‌ చికెన్‌ వంటి పెద్ద పెద్ద వంటకాలనూ ఇట్టే సిద్ధం చేస్తుంది. ఆప్షన్ లు అన్నీ మూతపై భాగంలో డిస్‌ ప్లే అవుతుంటాయి. దేనికి ఎంత ఉష్ణోగ్రత  అవసరమో కూడా తెలియజేస్తుంది ఈ మేకర్‌. ఇక దీనిలోని పాన్‌ బౌల్‌ 5 లీటర్ల కెపాసిటీతో.. కుకింగ్‌కి, క్లీనింగ్‌కి సులభంగా ఉంటుంది. దీని ధర 129 డాలర్లు(రూ.9,471). 

స్మాల్‌ స్మార్ట్‌ కుక్కర్‌
వంటింటి గాడ్జెట్స్‌కున్న డిమాండ్‌ అంతాఇంతా కాదు.  ఈ మేకర్‌ కూడా అలాంటిదే. ఇందులో ఒకే సమయంలో ఒకరికి లేదా ఇద్దరికి సరిపడా రెండు రకాల వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు. నాన్‌-స్టిక్‌ కోటింగ్‌ కలిగిన ఇన్నర్‌ పాట్‌లో కూరలు, సూప్స్‌ ఇలా.. నిమిషాల్లో చాలానే తయారు చేసుకోవచ్చు. మెకానికల్‌ టైమర్‌ కంట్రోల్‌ కలిగిన ఈ మేకర్‌లో చికెన్, మటన్  వంటి నాన్ వెజ్‌ వంటకాలతో పాటు తక్కువ పరిమాణంలో ఎన్నో రైస్‌ ఐటమ్స్‌నూ వండుకోవచ్చు. మేకర్‌ నుంచి మూతను  ఈజీగా వేరు చేసుకోవచ్చు. బాగా ఉడకవలసిన ఆహారం కోసం మూతను లాక్‌ చేసుకోవడానికి మేకర్‌కి ఇరువైపులా ప్రత్యేకమైన లింక్స్‌ ఉంటాయి. వాటిని ప్రెస్‌ చేసుకుంటే మూత లాక్‌ అవుతుంది. దీనిలో స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో రూపొందిన ఒక మినీ స్టీమింగ్‌ బాస్కెట్‌(ట్రే) కూడా ఉంటుంది. అందులో కూరగాయలు, గుడ్లు, జొన్నకండెలు.. ఇలా చాలానే ఉడికించుకోవచ్చు. ఇదే మోడల్‌లో చాలా రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర 23 డాలర్లు(రూ.1,688). 

ఎలక్ట్రిక్‌ బేకింగ్‌ పాన్‌
వర్క్‌ మేడ్‌ ఈజీయే టెక్నాలజీ సూత్రం. అలాంటి సౌకర్యమే ఈ గాడ్జెట్‌. ఇందులో ఒకవైపు గ్రిల్‌ చేసుకోవచ్చు. మరోవైపు పాన్‌లా వాడుకోవచ్చు. దీనిపై సిద్ధం చేసుకునే వెరైటీల కోసం మేకర్‌ ముందు భాగంలో ఒక్కోదానికి ఒక్కో బటన్‌ అమర్చి ఉంటుంది. దాంతో పిజ్జా, పాన్‌ కేక్స్, కబాబ్స్, ఆమ్లెట్స్‌.. వంటివెన్నో తయారు చేసుకోవచ్చు.  గ్రిల్‌ అండ్‌ పాన్‌ లను ఒకేసారి ఉపయోగించుకోవచ్చు లేదా అవసరాన్ని బట్టి ఒకటి ఆన్  చేసుకుని మరొకటి ఆఫ్‌ చేసుకునే వీలూ ఉంటుంది. ఒకవైపు చేస్తున్న వంటకం త్వరగా అయిపోవాలనుకుంటే  మరోవైపు భాగాన్ని మూతలా ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. పైగా దీంట్లోని గ్రిల్, పాన్‌ రెండూ సులభంగా వేరు చేసుకుని  క్లీన్‌ చేసుకోవచ్చు. చెక్క గరిటె, ఆయిల్‌ బ్రష్, మెను బుక్‌ వంటివన్నీ గాడ్జెట్‌తో పాటు లభిస్తాయి. దీని ధర 73 డాలర్లు(రూ.5,322). 
 


 

మరిన్ని వార్తలు