ఇందులో కూర్చొని..ఎక్కడికంటే అక్కడికి పక్షిలా ఎగిరిపోవచ్చు!

21 Aug, 2022 12:01 IST|Sakshi

పురాణాల్లో ఆకాశంలో ఎగిరే చిత్ర విచిత్ర రథాల గురించిన వర్ణనలు తెలిసినవే! ఇంచుమించు అలాంటి విచిత్ర వాహనాన్నే తయారు చేశాడు ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త ఫ్రాంకీ జపాట. హోవర్‌బోర్డుకు జెట్‌ ఇంజన్‌ను అమర్చి, దీనికి రూపకల్పన చేశాడు. దీని పనితీరును పరీక్షించడానికి ఇటీవలే దీనిలో కులాసాగా కూర్చుని, హాయిగా ఎగురుతూ ఇంగ్లిష్‌ చానెల్‌ను దాటి వచ్చాడు.

 దీనిని మరింత మెరుగుపరచి, పరీక్షలు జరపాలని భావిస్తున్నానని, ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు పాతికమంది ఔత్సాహిక వాలంటీర్లు కావాలని జపాట ప్రకటించాడు. ప్రస్తుతం జపాట రూపొందించిన ఈ హోవర్‌బోర్డు నేల మీద నుంచి పదివేల అడుగుల ఎత్తు వరకు చేరుకోగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 250 కిలోమీటర్లు. 

మరిన్ని వార్తలు