స్టార్స్‌ చెప్పే దాంట్లో నిజం ఉండదు

6 Sep, 2020 08:16 IST|Sakshi

శ్రేయ ధన్వంతరి.. తెలుగు అమ్మాయి. ఇంకా చెప్పాలంటే అచ్చంగా మనింట్లోని అల్లరి పిల్లలా అనిపిస్తుంది. కాని తెలుగు వాళ్ల కన్నా హిందీ వాళ్లకే ఆమె ఎక్కువ తెలుసు. ఆమె గురించి.. 

  • పుట్టింది హైదరాబాద్‌లో. ఆమె తండ్రిది  ఏవియేషన్‌  కొలువు కావడంతో శ్రేయ పశ్చిమాసియాలో పెరిగింది. తనపదిహేడో యేట ఆమె కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. వరంగల్‌లోని నిట్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది.
  • భరతనాట్యం, కూచిపూడి, కథక్‌ నేర్చుకుంది. నటన మీదున్న కాంక్షతో బాలీవుడ్‌ కథానాయిక భూమి పడ్నేకర్‌ సలహాతో థియేటర్‌లోనూ శిక్షణ పొందింది. 
  • 2008లో పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ ఇండియా సౌత్‌లో పాల్గొంది. ఫస్ట్‌ రన్నరప్‌గా ఎంపికైంది. 
  • నటి కావాలనే లక్ష్యంతో ముంబై చేరింది. సినిమాల్లో  ప్రయత్నిస్తూనే పార్ట్‌టైమ్‌ మోడలింగ్‌ చేసేది. ఇబ్బడిముబ్బడి అవకాశాలతో పార్ట్‌టైమ్‌ కాస్త ఫుల్‌టైమ్‌ వర్క్‌ అయింది శ్రేయకు. అయినా సినిమాను నిర్లక్ష్యం చేయలేదు.
  • అయితే ముందు ఆమెను గుర్తించింది తెలుగు చిత్ర పరిశ్రమే. ‘స్నేహ గీతం’లో చాన్స్‌ ఇచ్చి. తర్వాత తొమ్మిదేళ్లకు 2019లో బాలీవుడ్‌లో ఎంట్రీ దొరికింది. ఇమ్రాన్‌ హష్మీ పక్కన ‘వై చీట్‌ ఇండియా’ సినిమాతో. 
  • కాని ‘స్నేహ గీతం’, ‘వై చీట్‌ ఇండియా’ మధ్య కాలంలో ఆమె వెబ్‌ సంచలనంగా మారింది. ‘ది రీయూనియన్‌’ అనే సిరీస్‌లో ‘దేవాంశి టైలర్‌’ పాత్రతో. ఆమె నటించిన మరో వెబ్‌ సిరీస్‌ ‘లేడీస్‌ రూమ్‌’. 
  • ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం పెడ్తుంది శ్రేయ. ఆమె దినచర్యలో వ్యాయామం కచ్చితంగా ఉంటుంది. ఆటలన్నా ఆసక్తే. స్విమ్మింగ్‌ చేస్తుంది. చెస్, క్యారమ్స్, బాస్కెట్‌ బాల్‌ ఆడుతుంది. పుస్తకాలు చదవడం, ఫొటోగ్రఫీ, ట్రెక్కింగ్‌ ఆమె అభిరుచులు. 
  • శ్రేయ.. రచయిత్రి కూడా. ‘ఫేడ్‌ టు వైట్‌’  ఆమె మొదటి నవల. 2016లో అచ్చయింది.
  • నిర్మొహమాటం, న్యాయం వైపు నిలబడ్డం శ్రేయ నైజం. ఆమె బాలీవుడ్‌ డెబ్యూ ‘వై చీట్‌ ఇండియా’ దర్శకుడు సౌమిక్‌ సేన్‌ ‘మీ టూ’వివాదంలో చిక్కుకున్నాడు. అతనికి వ్యతిరేకంగా, బాధితుల పక్షాన నిలబడింది శ్రేయ.
  • ఎంత కష్టమైనా మీరెంచుకున్న దారి వదలకండి అంటూ అవార్డుల ఫంక్షన్స్‌లో స్టార్స్‌ చెప్పేదాంట్లో నిజం ఉండదని నా అభిప్రాయం. చెప్పినంత ఈజీగా ఉండదు ప్రాక్టికాలిటీ. నేను సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించడానికి తొమ్మిదేళ్లు స్ట్రగుల్‌ చేయాల్సి వచ్చింది. నా వాళ్ల సపోర్ట్‌ లేకపోతే సాధ్యమయ్యేది కాదు. ఈ రంగంలో ఒంటరి పోరాటం చేస్తున్న వాళ్లకు  కుడోస్‌. 
Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా