వారికి ఎంత రిస్క్‌?

2 Aug, 2020 07:22 IST|Sakshi

 సందేహం

మా అమ్మ, పిన్ని ఇద్దరికీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకింది. నాకొక కూతురు, మా చెల్లికి ఒక కూతురు ఉన్నారు. భవిష్యత్‌లో మా పిల్లలకు ఈ క్యాన్సర్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందా? ఉంటే నా కూతురికి ఎంత రిస్క్‌ , మా చెల్లి కూతురికి ఎంత రిస్క్‌ ఉందో చెప్పగలరా?
– శ్రీకంఠి, సారంగపూర్‌

కొన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌లు జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి. వీటిలో ఆఖఇఅ, ఆఖఇఅ2 అనే జన్యువుల్లో మార్పుల వల్ల వస్తాయి. కొన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌లు వేరే కారణాల వల్ల రావచ్చు. మీ అమ్మకి, పిన్నికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌లు వచ్చాయి అంటున్నారు. వాళ్లకి చేసిన చికిత్సలో క్యాన్సర్‌ కారణాలను బయాప్సీ చేశారా, అవి ఎలాంటివి ఎందువల్ల వచ్చాయి అనేది నిర్ధారణ అయ్యిందా? ఈ క్యాన్సర్‌ ఏ రకానికి చెందింది అనేది తెలిస్తే దాన్ని బట్టి అది మళ్లీ మీకు, మీ చెల్లికి, మీ పిల్లలకు వచ్చే అవకాశాలు, రిస్క్‌ ఎంత ఉండవచ్చు అనేది అంచనా వేయవచ్చు. మీరు, మీ చెల్లెలు ఆఖఇఅ, ఆఖఇఅ2 జన్యువుల పరీక్ష చేయించు కోవడం మంచింది. ఒక వేళ అది పాజిటివ్‌ వస్తే ప్రతి సంవత్సరం రొమ్ము పరీక్ష, రొమ్ము స్కానింగ్, మమోగ్రామ్, అల్ట్రాసౌండ్‌ లాంటి పరీక్షలు చెయ్యించుకుంటూ వాటితో ఏదైనా సందేహం ఉంటే, ఊNఅఇ, బయాప్సీలాంటివి చేయించుకొని దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి. ఒకసారి మీ వాళ్లకి చికిత్స చేసిన డాక్టర్‌ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచింది.

నాకు ఇప్పుడు  43 ఏళ్లు. ఆర్నెల్ల కిందట ఒకసారి స్నానం చేస్తూ ఒళ్లు రుద్దుకుంటూండగా కుడి బ్రెస్ట్‌ నుంచి పాలలాంటి తెల్లటి, చిక్కటి ద్రవం డిశ్చార్జ్‌ అయింది. ఎడమ బ్రెస్ట్‌ కూడా నొక్క చూస్తే అందులోంచీ అలాంటి ద్రవమే బయటకు వచ్చింది. భయమేసి వెంటనే గైనకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లాను. క్యాన్సర్‌ కాదు అన్నారు. కాని ఇప్పటికీ బ్రెస్ట్‌ నొక్కి చూస్తే  పాలలాంటి ద్రవం వస్తోంది. కారణం, పరిష్కారం చెప్పగలరు.
– దుర్గ, నేరెడ్‌మెట్, హైదరాబాద్‌
అనేక కారణాల వల్ల బ్రెస్ట్‌ నుంచి నీరులాంటి లేదా పాలలాంటి ద్రవం ఏ వయసులోని ఆడవారికైనా రావచ్చు. దీనినే గ్యాలాక్టోరియా అంటారు. ఎక్కువ మటుకు హార్మోన్లలో తేడా వల్ల ఇలా వస్తుంది. కొందరిలో అనేక కారణాల వల్ల మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువ విడుదలవుతుంది. 
ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల గ్యాలాక్టోరియా వస్తుంది. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, బాగా బిగుతుగా ఉన్న దుస్తులు వేసుకోవడం, నిపుల్‌ని (రొమ్ము మొనని) ఎక్కువగా ప్రేరేపించడం, ఏమైనా ఇన్‌ఫెక్షన్స్‌ ఉంటే, మెదడులో కంతులు, తలకి దెబ్బతగలడం, యాంటాసిడ్‌ మాత్రలు, యాంటీ డిప్రెసెంట్‌ మందులు, ఇంకా కొన్ని మందులు దీర్ఘకాలం వాడటం వల్ల, దీర్ఘకాల వ్యాధులైన కిడ్నీ, లివర్, థైరాయిడ్‌ సమస్యలు ఉన్నప్పుడు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నవారిలో కొందరిలో, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల రొమ్ము నుంచి పాలలాంటి ద్రవం వస్తుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా ఇఆ్క,  ట.ఖీ ఏ.  ట. pటౌ ్చఛ్టిజీn లాంటి పరీక్షలు, రొమ్ము పరీక్ష, ఏమైనా మందులు వాడుతుంటే వాటిని ఆపించడం, మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడం, ప్రొలాక్టిన్‌ మరీ ఎక్కువగా ఉంటే మెదడుకి స్కానింగ్‌లాంటి పరీక్షలు చేసుకొని, కారణాన్నిబట్టి చికిత్స తీసుకోవచ్చు.  

మేం నలుగురం అక్కచెల్లెళ్లం. నేనే చివర. నా పెళ్లి కుదిరింది. కరోనా వల్ల పోస్ట్‌పోన్‌ అయింది. విషయం ఏంటంటే మా ముగ్గురి అక్కలకూ పిల్లల్లేరు. నాకూ అలాంటి సమస్య ఎదురవుతోందేమోనని టెన్షన్‌గా ఉంది. దానికి ముందస్తు టెస్ట్‌లు, ట్రీట్‌మెంట్‌ ఏమైనా ఉంటే ఈ పోస్ట్‌పోన్‌ టైమ్‌ను వినియోగించుకోవచ్చా?
– చందన, సిద్ధిపేట
 నీ వయసు ఎంత, బరువు ఎంత ఉన్నావు, పీరియడ్స్‌ నెలనెలా సక్రమంగా వస్తున్నాయా లేదా, థైరాయిడ్‌ సమస్య ఏమైనా ఉందా అనే అనేక విషయాలను బట్టి నీకు పిల్లలు కలగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది అంచనా వేయడం జరుగుతుంది.  మీ ముగ్గురు అక్కలకు పిల్లలు కలగకపోవడానికి సమస్య ఎక్కడ ఉంది అని పరీక్షలు చేశారా? వాళ్లు పిల్లలు కలగడానికి చికిత్సలు ఏమైనా తీసుకున్నారా అనే విషయాలను బట్టి కూడా, నీకూ అదే సమస్య ఉందా అనే పరీక్షలు చేసి చూడవచ్చు. వాళ్లకి పిల్లలు పుట్టనంత మాత్రానా, నీకు అదే సమస్య రావాలని ఏమీ లేదు. నీ సందేహం తీరడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ఇఆ్క,  ట. ఖీ ఏ,  ట pటౌ ్చఛ్టిజీn లాంటి రక్తపరీక్షలు చేసి థైరాయిడ్‌లాంటి హార్మోన్ల సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని, ఒక వేళ ఉంటే చికిత్స తీసుకోవాలి. అల్ట్రాసౌండ్‌ పెల్విస్‌ చేయించుకొని గర్భాశయం, అండాశయాలు, వాటి పరిమాణం ఎంతలో ఉన్నాయి, వాటిలో గడ్డలు, సిస్ట్‌లులాంటి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం మంచింది. సమస్యలు ఏమైనా ఉంటే ఈ పోస్ట్‌పోన్‌ టైమ్‌లో వాటికి తగ్గ చికిత్సలు తీసుకుంటూ బరువు ఎక్కువగా ఉంటే, కొద్దిగా డైటింగ్, నడక లాంటివి చేస్తూ, ఈ లోపల బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి.
డా.వేనాటి శోభ
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు