వారఫలాలు (2 ఆగస్టు నుంచి 8 ఆగస్టు 2020)

2 Aug, 2020 07:05 IST|Sakshi

 వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని పనులు కుదించుకుంటారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని విషయాలలో కుటుంబసభ్యులతో రాజీపడక తప్పదు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి అందిన సమాచారం కాస్త ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కేందుకు యత్నిస్తారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతాయి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకర సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆశ్చర్యకర సమాచారం అందుతుంది. పెద్దల సలహాలు పాటించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుగా శత్రువులను కూడా ఆకర్షిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ చూరగొంటారు. పెండింగ్‌లో ఉన్న ఆస్తుల వ్యవహారాలలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థికంగా బలపడతారు. అయితే ఖర్చులు కూడా ఎదురవుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే లాభిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్టమైన పరిస్థితులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిళ్ల నుంచి విముక్తి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. తెలుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. మనోధైర్యం మరింత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని వివాదాలను సమర్థతతో పరిష్కరించుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన కష్టాల నుంచి గట్టెక్కుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంటì  నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. నిరుద్యోగుల శ్రమ కొంత ఫలిస్తుంది. వివాహాది శుభకార్యాలు చివరి క్షణంలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో  కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సోదరులు,సోదరీలతో స్వల్ప వివాదాలు. బంధువుల నుంచి ఉపయుక్తమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుకుంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో అనారోగ్యం. దూరప్రయాణాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుని సంతోషంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు భాగస్వాములతో సఖ్యత. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు