బాబు కుట్ర పర్యవసానం ‘నాట్‌ బిఫోర్‌’

25 Aug, 2020 01:14 IST|Sakshi

రెండో మాట 

‘‘న్యాయమూర్తులు సైతం తమ ఇతర సమకాలీనుల మాదిరే కోరికలకు, భావావేశా లకు, ఉద్రిక్తతలకు, భయాందోళనలకు లోన వుతూ ఉంటారు. మీరు మరీ గట్టిగా విమర్శిస్తే వారు బాధపడతారు. వారి వృత్తిలో వారి ప్రతిభాప్రమాణాలు ఎంత ఉన్నతమైనవైనా, వారిలో కూడా మానవ బలహీనతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి’’
– డేవిడ్‌ పానిక్, బ్రిటన్‌ క్వీన్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు, సుప్రసిద్ధ బారిస్టర్, పులిట్జర్‌ గ్రహీత, ‘జడ్జిస్‌’ గ్రంథకర్త (ఆక్స్‌ఫర్డ్‌ ప్రచురణ –1987) పేజీ. 172.
న్యాయమూర్తుల ఫోన్లను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రహస్యంగా ట్రాప్‌ చేస్తోందంటూ ఒక దినపత్రికలో వచ్చిన తప్పుడు కథనం ఆధా రంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారించడంపై రాష్ట్రప్రభుత్వం అభ్యంతరం తెలిపింది... తప్పుడు ఆరో పణలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్న ఆ పత్రికను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చి తీరాలని ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఆ పత్రికను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేయబోమని తొలుత చెప్పిన హైకోర్టు ఆ తర్వాత సందర్భాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.  – పత్రికా వార్త (19–08–2020)

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల ట్యాపింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందన్న తీవ్ర ఆరోపణను నిస్సందేహంగా నిగ్గుదేల్చాల్సిందే. కానీ ఈ కథనం వెనుక నడిచిన అసలు రాజకీయ కథ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సంబంధించి పరి పాలన వికేంద్రీకరణపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయ మూర్తి జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ తప్పుకున్నారు. అయితే నారిమన్‌ కన్నా ముందు ఈ వ్యాజ్యాల విచారణ నుంచి అత్యున్నత న్యాయ స్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.ఎ. బాబ్డే తప్పు కున్నారు. ఈ తాజా పరిణామానికి లోతైన కారణాలను పరిశీలించ డానికి ముందు, చంద్రబాబు ప్రోద్బలంతో ఏర్పడిన రాజధాని రైతుల పరిరక్షణ సమితి తాలూకు ప్రతివాదుల తరపున అడ్వొకేట్‌ ఆన్‌ ది రికార్డ్‌ పేరిట పరమాత్మ సింగ్‌ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ పిటిషన్‌ తాలూకు అంశాలను ప్రస్తుత న్యాయమూర్తి నారిమన్‌ తండ్రి అయిన సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌. నారిమన్‌కు వినిపించి వచ్చామని, కాబట్టి ఎలాంటి అసౌకర్యం కోర్టువారికి కలగకుండా ఉండేందుకు ఇప్పుడీ లేఖను అందజేస్తున్నామని ప్రతివాదుల న్యాయ వాది పరమాత్మ సింగ్‌ తెలిపారు.

ఇందులో ఏం మతలబు దాగి ఉందోనని బహుశా గౌరవ న్యాయమూర్తి జస్టిస్‌ నారిమన్‌ గ్రహించ బట్టే ‘నేను సభ్యుడిగా లేని ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాల’ని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించి, ఉత్తర్వులు చూపి ఉంటారు. ఇలా ప్రసి ద్ధులైన ప్రధాన న్యాయమూర్తులు, మరికొందరు ఇతర న్యాయ మూర్తులు కేసు విచారణ నుంచి తప్పుకోవడం సర్వసాధారణంగా కాకుండా బహు అరుదుగా మాత్రమే జరిగింది. కానీ ఆ అరుదైన దృశ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్య మంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబుతోనే ఆవిష్కృతమైంది. ఈ వెన్నుపోటు దృశ్యం అంతటితోనే అదృశ్యం కాకుండా వెన్నుపోటుకు ఆసరాగా కొందరు న్యాయవాదులను ‘సాకుతూ’ వారి ద్వారా కొందరు న్యాయమూర్తులనూ ఇబ్బందులలోకి నెట్టారని ప్రతీతి. ఈ ప్రహసనాల్లో భాగంగానే ‘నాట్‌ బిఫోర్‌ మి’ అన్న ‘తెర’ను న్యాయ మూర్తులు కొందరు ప్రయోగించాల్సి వచ్చింది. అలా నేరుగా ఉండ వలసిన న్యాయమూర్తులు కొందరిని, తన న్యాయవాదులు కొందరి ద్వారా ఇబ్బందులలోకి నెట్టడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబు ఆవి ష్కరించిన సరికొత్త ‘సంస్కృతి’! ఇప్పుడు కూడా ఈ విలక్షణ ప్రవ ర్తనకు ఆటవిడుపు లేదు.

ఈసారి మరో విశేషం– సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే కుమార్తె జస్టిస్‌ రుక్మిణీ బాబ్డే పేరును బాబు వర్గీయులు దుర్వినియోగం చేయబూనటం. ఎలాంటి దుర్వినియోగానికి బాబు వర్గీయులు పాల్పడ్డారు? నిజానికి రుక్మిణీ బాబ్డే రాజధాని రైతుల తరఫున హాజరైనట్టు ఎక్కడా రికార్డులో నమోదే కాలేదు. అలాగే హైకోర్టు విచారణను ఈనెల 27కి వాయిదా వేస్తూ జారీ అయిన ఉత్తర్వులో కూడా రుక్మిణీ బాబ్డే హాజరైనట్టు పేర్కొననే లేదు. అయినా సుప్రీం ముందు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కూతురు హోదాలో రుక్మిణీ బాబ్డే రైతుల తరఫున వాదనలు వినిపించినట్టు బాబు వర్గం బొంకేశారు. ఈ కుట్ర తెలియని జస్టిస్‌ బాబ్డే తన కూతురు రుక్మిణి హాజరైన కేసును తాను ‘విచారించడం నైతిక విలువలకు విరుద్ధమని’ రాష్ట్ర ప్రభుత్వం(జగన్‌) పిటిషన్‌ను జస్టిస్‌ నారిమన్‌ బెంచికి పంపగా, తన తండ్రి ఫాలీ నారిమాన్‌కు ఈ కేసు గురించి ముందుగానే వివరించామన్న ‘హింట్‌’ బాబు వర్గీ యులు చెప్పడంతో జస్టిస్‌ నారిమన్‌ తాను విచారణ నుంచి తప్పు కున్నారు. అంటే నైతిక విలువలు గల జస్టిస్‌గా రోహింటన్‌ నారి మన్‌ను ఈ రూపేణా విచారణ నుంచి తప్పించే కుట్రకు పాల్పడ్డారని దాచినా దాగని సత్యంగా బయటపడింది.

ఇలా ‘నాట్‌ బిఫోర్‌ మి’ (ఈ కేసును నా ముందుకు తీసుకు రావద్దు) అని పలువురు రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు కేసుల విచారణ నుంచి తప్పుకొనే ప్రక్రియ ప్రధానంగా బాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన హయాంనుంచే తరచుగా మొద లైందని మరవరాదు. వైఎస్సార్‌ సీపీ యువనేత జగన్‌మోహన్‌రెడ్డిపై బాబు నాడు పెట్టిన కేసు విచారణ నుంచి కూడా నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లోకుర్‌ పక్కకు తప్పుకోవలసి వచ్చింది. తమ వ్యాపార ప్రయోజనాల కోసం అంబానీలు పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ‘చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌’ (సీఈఓ) అని ‘మెచ్చి మేకతోలు’ కప్పడంతో రెచ్చిపోయిన బాబు రాష్ట్రాన్ని ఉమ్మడిగా దోచు కోవడానికి ప్లాను వేశారు. ఈ ప్రహసనంలో భాగమే కృష్ణా–గోదావరి బేసిన్‌ చమురు సంపదను గుజరాత్‌కు దోచుకు పోవడానికి అంబానీ లకు రాయితీలిచ్చి ఆంధ్రప్రదేశ్‌ అవసరాలను తుంగలో తొక్కడం. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి కేంద్ర కాంగ్రెస్‌ నాయకత్వం సంతకం పెట్టమన్న కాగితంపైన రహస్యంగా సంతకం చేసివచ్చి తెలుగు జాతిని చీల్చడంలో భాగస్తుడైన చంద్రబాబు– అదే కాంగ్రెస్‌తో మిలాఖత్‌ అయి రుజువులు, పత్రాలు లేని కేసులలో జగన్‌ను 16 మాసాలపాటు జైలులో నిర్బంధించడానికి తప్పుడు ఆరో పణలకు తెరతీశాడు. అంతేగాదు, నేడు అమరావతి భూముల గురించి, రైతాంగం గురించి గగ్గోలు పెడుతున్న ఇదే బాబు వర్గం, రాజధాని అభివృద్ధికి ఏర్పాటు చేసిన ప్రాధికార సంస్థ సీఆర్‌డీఏ ఉనికిని హైకోర్టులో అమరావతి రైతాంగమే నిలదీసి ప్రశ్నించినప్పుడు నోరెత్తలేదు. చిన్న, మధ్యతరగతి రైతుల భూముల్ని రాజధాని పేరిట బాబు బలవంతంగా సేకరించినప్పుడు వందలాదిమంది రైతులు ఉమ్మడి హైకోర్టులో ఎన్నో రిట్లు వేశారు. కానీ గత ఆరేళ్లకు పైగా ఆ భూముల అతీగతీ తేలలేదు, రిట్లు అలాగే ఉండిపోయాయి. కానీ అవి పరిష్కారం కాకుండానే రాజధాని నాటకాన్ని రక్తి కట్టించుకోవాలని బాబు చూశాడు గాని ‘అట్టర్‌ ఫ్లాప్‌’ అయింది. 

కానీ అభాసుపాలైన రాజధాని ప్రహసనానికి జగన్‌ ప్రభుత్వం శాశ్వత ముగింపు పలకడానికి, శాసన రాజధానిగా అమరావతిని స్థిరపరుస్తూనే మిగతా రెండు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి విశాఖను, కర్నూలును కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థా రాజధాను లుగా వృద్ధి చేయాలని తలపెట్టింది. అమరావతి సమగ్రాభివృద్ధి కోసం ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తే దానికి బాబు వర్గం మోకాలడ్డుపెట్టింది. అంతేగాదు.. నేనూ, మరి ఇద్దరు పాత్రి కేయ మిత్రులు (శ్రావణ్‌ కుమార్, రమణమూర్తి) అమరావతి రైతాంగం తరఫున సుప్రీంలో రిట్‌ దాఖలు చేయగా, ఆ రిట్‌ను చూడకుండానే చాకచక్యంగా ఆనాటి ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్‌ పక్కన పడేయడానికి కారణం–రిట్‌ విషయం తెలిసి ఠాకూర్‌పై అన్య మార్గంలో బాబు ఒత్తిడి తేవడమే. అంతేగాదు, తొమ్మిదేళ్ల పాలనలో బాబు రకరకాల క్రీడల అభివృద్ధికి స్టేడియంలు నిర్మిస్తామన్న పేరిట ‘ఐ.ఎం.జి. భారత అకడమిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే బోగస్‌ కంపెనీకి వెయ్యి ఎకరాల స్థలాన్నిచ్చి ‘క్విడ్‌ప్రోకో’ కింద ప్రయోజనం పొందాడే గానీ, ఆ సంస్థ ఏ గంగలో కలిసిందో ఇంతవరకూ పత్తాలేదు. దీనిపై సీబీఐ విచారణ కోసం అడుగుతూ విజయమ్మ, విజయసాయిరెడ్డి, నేనూ హైకోర్టును ఆశ్రయిస్తే (రిట్‌ నం. 28951/2011) ఏదీ తేల్చకుం డానే ‘నానబెడుతూ’ వచ్చారు. అదేమంటే బాబు కుంభకోణాల్ని విచారించాల్సి వచ్చేసరికి సీబీఐకి ‘సిబ్బంది కొరత’ ఏర్పడుతుంది. 

ఇక అమరావతి రైతాంగానికి జరిగిన నష్టం గురించి, అన్యాయాల గురించి రైతాంగం తరఫున హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి (ప్రస్తుతం లోకాయుక్త), మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల్‌రావు, నేను, సీనియర్‌ న్యాయవాది సదాశివరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (2015 సంవత్సరం ఏప్రిల్‌) గత ఆరేళ్లు గానూ విచారణకు రాకుండానే పోయింది. ఇందుకు కారణం– అన్ని వ్యవస్థల్ని నర్మగర్భంగా బాబు వర్గం సాకుతూండటమేనన్నది ప్రజా వాక్కుగా మారిపోయింది. అతని ఇలాకాలో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా కొందరు తైనాతీ న్యాయవాదుల్ని సాకుతూ అభియోగా లను, తీర్పులనూ తారుమారు చేయించే ‘తాంత్రిక’ విద్యకు బాబు అలవాటుపడ్డాడు. ఈ సత్యాన్ని బాబు హయాంలో వరల్డ్‌ బ్యాంక్‌ అనుబంధ çఫండింగ్‌ సంస్థ  డీఎఫ్‌ఐడీ (2002–2003) నివేదికలో ఇతను న్యాయ వ్యవస్థను ఏ పద్ధతుల్లో సాకుతున్నాడో పూసగుచ్చినట్టు వివరించింది. అంతేగాదు, హైకోర్టులో ఒకరిద్దరు ‘బ్రోకర్‌’లను బాబు ఎలా ఏ స్థానాల్లో ఉంచి సాకుతూ వచ్చాడో ఎవరో కాదు– స్వయానా సీనియర్‌ జస్టిస్‌ బీఎస్‌ఏ స్వామి న్యాయమూర్తులకు, బార్‌ సభ్యులకూ బహిరంగ లేఖ రాశారు. అన్నింటికంటే పరాకాష్ట– రాష్ట్రంలో దీపం పెట్టలేక మూలుగుతున్న దేవాలయాలకు నిధులు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు,  కోర్టులలో తన స్వార్థ ప్రయోజనాల కోసం లోగడ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ లక్ష్మణన్‌కు తమిళ నాడులోని తన స్వగ్రామమైన దేవకొట్టయ్‌లోని శ్రీరంగనాథ పెరు మాళ్‌ దేవళానికి రెండు కిస్తీలలో, ప్రభుత్వం నిషేధించిన ‘కామన్‌ గుడ్‌ ఫండ్‌’ నిబంధనలను రహ స్యంగా సడలించి మరీ దానంగా విడుదల చేశారు (ఆర్‌సీఎం పీ1/ 18763/2002 ముఖ్యమంత్రి ఉత్తర్వు 2002 ఏప్రిల్‌ 27) లాభ లబ్ధి  అన్నా, నాట్‌ బిఫోర్‌ మి అనిపించినా వీటి వెనుక మతలబు ఇదే! ఇప్పటికైనా న్యాయవ్యవస్థలు అప్రమత్తం కావడం ప్రజలకు, సమాజా నికి శ్రేయస్కరం.
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు