విశ్వ పరిణామానికి ఓ నవీన కోణం?!

29 Sep, 2020 01:00 IST|Sakshi

రెండో మాట

మనం చెప్పుకునే వర్త మానం అనేది గతానికీ భవి ష్యత్తుకూ మధ్య ఊగిసలా టలో ఉన్న ఓ పచ్చి వాస్తవం. గతం అనేది మొత్తం మానవాళి ఉమ్మడి జ్ఞాపకాల సమాహార సంపుటి. కాలజ్ఞానమనే ఈ జ్ఞాపకశక్తి చరిత్రకు ఒన గూడిన ఓ రూపకాలంకారం. యువ శాస్త్రవేత్త డాక్టర్‌ పిడికిటి వెంకట చరిత్‌ (గ్రంథకర్త) కథల రూపంలో లిఖించిన విశిష్ట వైజ్ఞానిక సంపుటే ప్రకృతి పరిణా మపు తూగుటుయ్యాల (ఇవల్యూషన్‌ క్రాడిల్‌). వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, చరిత్రకు సంబంధించిన మన అధ్యయనాలు పలు మార్పులు చెందాయి. కానీ ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా ఆ పరిణామ వాదపు ఊయల మాత్రం తన అలంకారాన్ని రూపాన్ని మార్చుకోలేదు.
– డాక్టర్‌ చరిత్‌ గ్రంథానికి ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాత, గౌతమ్‌ ఘోష్‌ పరిచయ వాక్యాలు

చెట్టుపై ఉన్న పండు రాలిపోదలిచినప్పుడు పైకి ఎగిరిపోకుండా కింది భూమ్మీద పడిపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకున్న ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త న్యూటన్‌ గురుత్వాకర్షణ శక్తి నిరూపణకు సిద్ధమయ్యాడు. అలాగే ఈ విశ్వం నిరంతర పరిభ్ర మణంలో ఉన్న ఏకైక శ్రమజీవి ప్రకృతి (ఎ సర్వైవల్‌ సర్క్యులేటరీ వర్కర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌.) అలాగే మానవ విజయాలకు మార్గం వ్యక్తి జన్మ కాదు. అతని మేథస్సు, తెలివితేటలు, అవి ప్రజాస్వామిక విద్యా విధానం ద్వారా మాత్రమే సాధ్యమని డార్విన్‌ ప్రవ చించాడు. పరిణామపు ఊయల గురించిన వైజ్ఞా నిక శాస్త్ర కథా సంపుటిలలో రచయిత చరిత్‌ ఈ ఊయలకు మూలం ఆర్యుల పుట్టుపూర్వోత్తరాలన్న ఉపశీర్షిక పెట్టారు. ఈ సైన్స్‌ కథలను 400 పేజీల్లో 17 వ్యాసాల ద్వారా నడిపాడు. ఈ రచనలో మాన వుల ప్రగతి, దాన్ని అదుపు చేయజూసే మానవుడి లోని కానరాని రాక్షస స్వరూపాన్నీ ఆవిష్కరించడా నికి ప్రయత్నించాడు.

విశ్వపరిణామ క్రమాన్ని కొత్త కోణాలనుంచి ఆవిష్కరించాలన్న తాపత్రయానికి ముందు ఆర్యుల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునే జిజ్ఞా సను ప్రదర్శిస్తున్న డాక్టర్‌ చరిత్‌ పట్టుమని 35 ఏళ్ల వయస్సు కూడా దాటని జీవ వైద్యశాస్త్ర ఇంజనీర్‌. ‘ఫార్చ్యూన్‌ 500’ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సర్వ విషయాలపై సాధికారత సాధించాలన్న తపన ఉన్నవాడు. కనుకనే, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా, ఒక డాక్టరేట్‌గా, ఒక రచయితగా, వాద్య కారుడిగా, పలు రంగాలలో పరిచయం ఉన్న యువకుడు చరిత్‌. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం చేరి పట్టభద్రుడై అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అభ్యసించేం దుకు జర్మనీ వెళ్లాడు. మహా పండితుడు రాహుల్‌ సాంకృ త్యాయన్‌లా లోక సంచారం చేస్తూ, ప్రపంచ దేశాల సంప్రదాయాలను, సంస్కృతు లను, మత    విశ్వాసాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటూ నూతన అను భవాల కోసం మోసులెత్తినవాడు చరిత్‌. ఆయన గమ్యాన్ని తీర్చిదిద్దడానికి తోడునీడైన జర్మన్‌ సతీ ]lుణి చరణీ చరిత్‌. జనన మరణాలకు తేడాలేదని, పుట్టిన ప్రతిదీ చస్తుందనీ బోధించిన బుద్ధుడిలా గానే నమ్ముతాడు చరిత్‌.

అయితే సత్యం ఉపరిత లాన్ని మాత్రమే తడుముతున్నందున, విశ్వపరి ణామం లోతుపాతుల్ని పూర్తిగా తెలుసుకోలేకపోతు న్నామన్న బాధను వ్యక్తం చేస్తాడు. అందుకే మనిషి వేల సంవత్సరాలలో గడించిన వైజ్ఞానిక సంపదను కోల్పోకుండా సంస్కృతీపరుడుగా మెలగాలంటే యుద్ధాలు ఉండకూడదనీ భావిస్తాడు చరిత్‌.  అనేక బడా విదేశీ గ్రంథాలయాల్లోకి క్రీపూ. 14,000 సంవ త్సరాల నాటివిగా చెబుతున్న వైదిక ప్రాచీన సాహిత్యం నకళ్లు ఎలా చేరాయన్న ప్రశ్నను చరిత్‌ తన గ్రంథంలో సంధించాడు. అక్కడ రక్షణ లేకుండా ఎలా, ఎందుకు నిరాధారంగా పడి ఉన్నా యని ప్రశ్నించాడు. అంతేగాదు, ఆనాడు ఎదుగూ బొదుగూ లేని పిట్టల్లాంటి పొట్టివాళ్లు, ‘అంటుకట్టే’ (క్లోనింగ్‌) కృత్రిమ ప్రయోగాల ద్వారా ప్రాచీనులు మరుగుజ్జుల ద్వారా భీషణ యుద్ధాలు నిర్వచిం చారా అని ప్రశ్నిస్తాడు. ఇందుకు ఉదాహరణగా చరిత్, ప్రాచీన భారతీయులు ‘అంటుకట్టే రసా యన ప్రక్రియ’ ద్వారా, ఇతర జీవుల జీవ కణాలతో అనుసంధానం చేసి యుద్ధ పిపాసుల్ని ప్రాచీనులు సృష్టించి ఉంటారని, లేకపోతే ఒకే వయస్సులో, ఒకే ముఖ కవళికలున్న 100 మంది కౌరవుల్ని మాన వాతీతుౖలైన సూపర్‌ హ్యూమన్‌ సైనికులుగా చూపడం– సాధ్యపడదని, కేవలం ఈ అసాధారణ లక్షణం ‘క్లోనింగ్‌’ ప్రక్రియ ద్వారానే సాధ్యపడి ఉంటుందని చరిత్‌ గ్రంథంలోని ఒక పాత్ర ద్వారా చెప్పిస్తాడు.

ఒకే పిండాన్ని గర్భ విచ్ఛిత్తి ద్వారా వంద భాగాలు చేసి, ఏ భాగానికి ఆ భాగాన్ని వేర్వేరు కుండల్లో పెంచడం ద్వారా కౌరవుల్ని సృష్టించారనీ, ఇదే ‘అంటు కట్టడమ’నీ మానవ పరి ణామ చరిత్ర పూర్వాపరాల చర్చ ద్వారా నిరూపిం చడానికి ఒక ప్రయత్నం జరిగింది. భారతంలో గాంధారికి సహజంగా సంతానం కలగనప్పుడు కృత్రిమ సంతానాన్ని ఈ ‘క్లోనింగ్‌’ ద్వారానే సాధ్యం చేశారనీ, కాబట్టి ప్రాచీనులకు ఈ టెక్నిక్‌ తెలుసుననీ, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలను పిండ విచ్ఛిత్తి ద్వారా కృత్రిమంగా సృష్టించడం తెలుసుననీ, అదే క్లోనింగ్‌ అనీ చరిత్‌ తన ‘ఆర్యుల పుట్టు పూర్వాల’ రచనలో చెప్పించాడు. అందువల్ల ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఈ రహస్యం పూర్తిగా తెలిసినట్టుగా భావించరాదని కూడా ఒక ‘ఊహ’ను ఈ గ్రంథంలో ప్రతిపాదించడం జరిగింది. మతం, మాతృభూమి, కుటుంబ వ్యవస్థ, జీవితం ప్రారంభం, ముగింపు దశల గురించిన ప్రశ్నోపనిషత్తు తనకు ఎదురైనప్పుడు ఈ సంశయా లన్నీ చుట్టుముట్టాయి.

బహుశా ఆలోచనాపరులం దరికీ నిద్రకు నిష్క్రమించేముందు ఈ సమస్యలు కళ్లముందు పరుచుకుంటాయి. అలాంటి ఘడి యల్లో అతడి చేతికి దొరికిన పుస్తకం ‘పరిణతి చెందిన ప్రాచీన భారత నాగరికత’ అనే గ్రంథం (అడ్వాన్స్‌డ్‌ ఏన్షియంట్‌ ఇండియన్‌ సివిలైజేషన్‌). ప్రాచీన భారతంలో కృత్రిమ పద్ధతుల్లో ‘అంటు కట్టడం’ ద్వారా పిండోత్పత్తి క్రమాన్ని జయప్ర దంగా నియంత్రించవచ్చని, ఇది వివాదాస్పదం గాని సాక్ష్యంగా ప్రాచీనులు భావించారని విశదీ కరించిన ౖవైజ్ఞానిక శాస్త్ర రచనను డాక్టర్‌ చరిత్‌ అధ్యయనం చేశాడట. రుజువైన ఈ కృత్రిమ గర్భో త్పత్తి (క్లోనింగ్‌) విధాన ప్రక్రియ జ్ఞాన పరంపరను తరువాతి తరాలు ఎందుకు భద్రపరచుకోకుండా అశ్రద్ధ వహించాయి? ప్రాచీన హైందవ నాగరికత లోని ఈ రహస్యాలు ఎలా కోల్పోయాం? అలాగే భారీ స్థాయిలో మానవ విధ్వంసాత్మక ఆయుధాలు 10,000–20,000 సంవత్సరాలుగా ఉన్నాయన్న వాదన నిజమైతే, ఆ వాదన కల్పితమా లేక అల్లిన ఒక సైన్స్‌ కథా? నాడు అసలింతకూ అలాంటి ఆయుధాలు ఉన్నాయనడానికి సాక్ష్యాధారం ఉందా?

ఆమాటకొస్తే ఎన్ని రకాల మొక్కల్ని, పూవుల్ని కృత్రిమంగా రంగంలోకి నేడు దించడం లేదు? మానవ ప్రకృతిలోనే కాదు, ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ప్రాచీన వృక్ష జాతులకు, పండ్ల ఉత్పత్తికి చెందిన కృత్రిమ వంగడాలు ఇప్పుడు మార్కెట్‌ను ముమ్మరించడం లేదు? వాదన కోసం చరిత్‌ ఎన్ని ఉప వాదాలు ప్రతిపాదించినా ‘గీత’ పాత్ర ద్వారా ఈ ‘పరిణామ చరిత్ర’ రహస్యాన్ని మరో రూపంలో చూపక తప్పలేదు: ‘ఆసక్తి కల్గించే ఒక విషయాన్ని మీకు చెప్పదలచాను. క్రీ.పూ 14,000 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రజలు దేవుళ్లను, మతాల్ని తమ తమ కళాఖండాల్లోనూ, వృత్తి చిహ్నాలలోనూ చిత్రించడం ప్రారంభించారు. కానీ, అంతకుముందుటి తరాలకు మాత్రం దేవుళ్ల నుగానీ, ఏ మతాన్నిగానీ నమ్మినట్టు, ఆరాధించి నట్టు దాఖలాలు లేవు’ (చరిత్‌ గ్రంథం: పే.54).

బహుశా అన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా 19–20 శతాబ్దికి చెందిన మహాకవి గురజాడ ‘మీ పేరేమిటి’ అన్న కథలో ‘దేవుడు చేసిన మను షుల్లారా/ మనుషులు చేసిన దేవుళ్లారా, మీపేరే మిటి?’ అని ప్రశ్నించాల్సి వచ్చింది. మహాపండిత రాహుల్జీ సింధూ నాగరికత గురించి, రుగ్వేద ఆర్యుల గురించి ప్రస్తావిస్తూ వారు నగర విధ్వం సకులనీ, భిన్నజాతుల్నీ, కష్టజీవులైన ప్రాచీన తెగల్ని హింస ద్వారా చెండుకుతిన్నారనీ సింధునదీ తీరవాసులైన హరప్పా–మొహంజదారో నాగరిక తకు నిజమైన వారసులు అనార్య తెగలేనని, మానవ నాగరికతా ప్రస్థానంలో ఓల్గానది నుంచి గంగానది వరకు సాగిన మానవ వలసలన్నీ ఈ మహాప్రస్థానంలో భాగమేనని, యుద్ధరంగంలో పురుషులకు ధీటుగా సమంగా సహకరించిన వారు.. కిరాత జాతులుగా ఆర్యులు వర్ణించే అతి పేదసాదలైన కష్టజీవులైన స్త్రీలేనని రాహుల్జీ ప్రశం సించారు. ఇందుకు తిరుగులేని సాక్ష్యం కిరాతజాతి (పర్వతవాసులు) నాయకుడైన శంబరుడి కూతురు ‘శంభు’.

కిరాత పేదల్ని హింసిస్తున్న ఆర్యులలో భాగమైన ఆనాటి వ్యాపారి (పణి)  కొడుకు ‘అమ్మా నన్ను రక్షించు’ అన్నప్పుడు ఆ శత్రువు బిడ్డను మాతృ భావనతో ఎత్తుకుని ముద్దాడి పెంచిన మాతృమూర్తి ‘శంభు’. అందుకే ప్రత్యక్ష జ్ఞానాన్ని మించిన దైవం లేదని, నీకు మెదడన్నది ఉంది కాబట్టి. దాన్ని నమ్ముకోమని బోధించిన వాడు బుద్ధుడు. చివరికి తాను చెప్పినా సరే నీ సొంత మనస్సుతో వాస్తవాలను దర్శించమన్న వాడు బుద్ధుడు. అందుకే గురజాడ మహాకవి జ్ఞాని అయిన బౌద్ధాన్ని భారతదేశ సరిహద్దులు దాటించి, దేశం ఆత్మహత్య చేసుకుందని మరీ హెచ్చరించి పోయాడు. అలాగే ప్రకృతిని స్వార్థ ప్రయోజనాల కోసం చేజేతులా ధ్వంసం చేసుకుంటున్న మనం చేతులారా ‘భస్మాసుర హస్తాల’ సృష్టికర్తలం కాకూ డదని, అలా కాదని అణ్వాయుధ సంపదను పెంచు కోవడం కోసం ప్రపంచవ్యాపిత సర్వ విధ్వంసానికి చేజేతులా మనం– సర్వ రంగాలలో ప్రగతి పథంలో ఉన్న మనం– దోహదకారులం కాకూడ దని తెలుగు యువమేధావి డాక్టర్‌ చరిత్‌ ఈ గ్రంథం ద్వారా అందిస్తున్న పిండితార్థం!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా