న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించిన బాబు

27 Oct, 2020 01:19 IST|Sakshi

రెండో మాట

‘‘పబ్లిక్‌ సర్వెంట్లుగా ఉండాల్సిన జడ్జీలు ప్రజలనుంచి వచ్చే విమర్శలను శిరసావహించా ల్సిందే. అది న్యాయమూర్తుల వృత్తి ధర్మంలో ఎదురయ్యే అనివార్యమైన చిక్కు కావచ్చు. అలాంటి విమర్శ ఏదైనప్పటికీ ఒకవేళ ఆ విమర్శలో న్యాయమూర్తుల ధర్మాసనంపై అవిశ్వాసం లేదా అవినీతికి సంబంధించిన ఆరోపణలున్నా సరే– న్యాయమూర్తులకు న్యాయసంబంధమైన రక్షణ అవసరం గానీ లేదా ప్రత్యేక లీగల్‌ ప్రొటెక్షన్‌గానీ ఉండనక్కర్లేదు. ఎందుకంటే, ఆరోప ణలు నిజమైతే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని బహిరంగ పర్చాల్సిందే, అలా గాకుండా ఆరోపణలు అబద్ధమని తేలినపక్షంలో ఇతరత్రా రక్షణలు ఉండనే ఉంటాయి. ఆరోపణలకు సమాధానం ఇవ్వడం సబబని జడ్జి భావిస్తే అందుకు సిద్ధపడవచ్చు. తన ప్రతిపత్తిని కాపాడుకోగోరే జడ్జికి లేదా అతని ధర్మాసనానికీ చట్టం రక్షణగానే ఉంటుంది. కానీ ఒక్క సత్యాన్ని మాత్రం మరవరాదు– రాజకీయ వేత్తలకు లేని పాలనా కాల పరిమితి రక్షణ న్యాయమూర్తులకు ఉంది. అందువల్ల న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జడ్జీలు స్వేచ్ఛగా, బాహాటంగా ప్రజలు చేసే విమర్శలను శిరసావహించా ల్సిందే. విమర్శను కూడా జ్యుడీషియరీ అదో రకమైన రాజకీయ ప్రసంగంగానే భావించుకోవాలి’’.
– ఎరిక్‌ బారెన్డ్‌

మన తెలుగువాళ్లలో ఓ సామెత ఉంది. ‘ముంజేతి కంకణానికి అద్దమెందు’కని. కానీ అదిప్పుడు మరో రూపంలో ప్రత్యక్షమవు తోంది: చేతి మరకలు చూసుకోవడానికి కూడా అద్దం ఎందుకు అని! 2019 ఎన్నికల్లో కేవలం ఒక మరుగుజ్జుగా, ‘లిల్లీపుట్‌’గా రాష్ట్ర శాసనసభలో తానూ, తన పార్టీలో మిగిలిన ‘సరుకు’ మిగిలిపోవలసి వచ్చి.. పేరుకు ప్రతిపక్ష నాయకుని హోదాలో కొనసాగుతున్న చంద్ర బాబు ఏ మార్గం ద్వారా అయినాసరే తిరిగి అధికారంలోకి రావాలన్న తాపత్రయంలో అనుసరించని ఎత్తుగడ అంటూ లేదు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ విశిష్ట ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం ఆ వెలితిని తీర్చడం కోసం కొత్తగా రంగంలోకి దూకవలసి వచ్చిన ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని.. అటు కాంగ్రెస్‌ అధిష్టానం, ఇటు అప్పటికే అడుగూడి పోయిన చంద్రబాబు ‘దేశం’ జమిలిగా కుట్రపన్ని, ఈ క్షణం దాకా రుజువులేని ‘అవినీతి’ ఆరోపణల పేరిట వైఎస్‌ జగన్‌ని అరెస్టు చేయించారు.  సీబీఐ, ఈడీ సంస్థల ద్వారా అభియోగాలు మోపి, దాదాపు 16 మాసాలపాటు ఎలాంటి అభియోగాలు రుజువు చేయకుండానే జైల్లో బంధించిన క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టు పదేపదే సీబీఐ అధికారుల్ని ‘ఏవి మీ రుజువులు, ఎక్కడ, ఎప్పటికి మీ సాక్ష్యాలు’ అని ప్రశ్నించ డంతో జగన్‌పై కేసు ‘కృత్రిమ వంటకం’ అని ప్రజలు నమ్మసాగారు. పర్యవసానంగా దేశంలో కాంగ్రెస్‌ అధికారానికి ఆంధ్రప్రదేశ్‌లో బాబు జమానాకు ‘అంత్యక్రియలు జరిగాయి. దేశంలో బీజేపీ పాలన ప్రారంభమైంది. పోనీ రెండు రాష్ట్రాలు విడి పోయిన తరువాత బాబు ‘తెదేపా’ పాలన అంతంతమాత్రంగా నిల బడ్డానికి చేదోడుగా నిలిచిన∙బీజేపీయే కారణం. అయినా ఆ సమయంలో జగన్‌ కేసుల విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా జగన్‌పైన ఆయన కుటుంబం పైన కృత్రిమ కేసులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. బాబు పంపాడో, లేదా ఈ ‘ఆదాన ప్రదానం’ బీజేపీకి అచ్చివచ్చిందని భావించారో ఏమో కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం తెదేపా అభినవ కోటీశ్వరులైన ఎంపీలను కాస్తా బీజేపీలోకి అప్పనంగా చేర్చుకుంది. ‘తెదేపా’ నాయకత్వానికీ, బీజేపీ నాయకత్వానికీ ఇదొక రకం ‘క్విడ్‌ప్రోకో’(ఇచ్చుకో–పుచ్చుకో వ్యూహం)గా మారింది. 

నర్మగర్భంగా సాగుతున్న ఈ ఒత్తిళ్లు, కుట్రలన్నింటినీ తట్టుకుని వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సొంత ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ముందుకు జయప్రదంగా దూసుకు పోతోంది. ఈ ప్రభంజనాన్ని తట్టుకోలేని ‘మరుగుజ్జు’ తెలుగుదేశం పార్టీ, జగన్‌ ప్రభుత్వాన్ని మధ్యలోనే తుంచడానికి çకుట్ర పన్నుతూ తన పాత పాలనాకాలంలో న్యాయవ్యవస్థను తన కుట్రలకు అనువుగా ఎలా వాడుకుందో అదే పద్ధతిని ఇప్పుడూ పాటిస్తోంది. తన హయాం లోనే మన రాష్ట్ర హైకోర్టులోనే బాబు తాను ప్రమోట్‌ చేసిన న్యాయ మూర్తిని సుప్రీంకోర్టుకి పంపి, ఈరోజుదాకా సాకుతూ వస్తున్నాడు.  

కానీ, ఎవరూ మరవరాని ఒక సత్యం ఉంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి జగన్‌ రాసిన లేఖలో న్యాయవ్యవస్థపట్ల, దాని ప్రతిపత్తిపట్ల కించిత్తు అగౌరవం లేదు, పైగా న్యాయవ్యవస్థపైన, పార్లమెంటరీ వ్యవస్థలపట్ల గౌరవం కారణంగానే.. రాష్ట్రంలో పరి పాలనను స్తంభింపజేసే ప్రతిపక్షం ఎత్తుగడలను, అఖండమైన స్థానా లతో ప్రజాబాహుళ్యం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి రాష్ట్ర న్యాయవ్యవస్థను వందలాది కేసులతో కృత్రిమంగా వినియోగిం చుకుంటున్న తీరును బహిర్గతం చేసి, న్యాయాన్ని అర్థించడానికి మాత్రమే జగన్‌ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వాస్తవాలను తీసుకువెళ్లారు. ఈ లేఖ తర్వాత దేశవ్యాప్తంగా న్యాయ నిపుణుల నుంచి, ప్రజాస్వామ్యవాదులనుంచి, పలువురు రాజ్యాంగ నిపుణుల నుంచి, సునిశిత పరిశీలకుడైన ప్రముఖ పత్రికాధిపతుల నుంచి ‘ఆలస్యం లేకుండా తక్షణ విచారణ ద్వారానే న్యాయం నిగ్గుతేలాలని పలు రకాలుగా అభిప్రాయాలు వెల్లువెత్తడం జగన్‌ లేఖలోని నిజా యితీకి నిలువెత్తు నీరాజనంగా భావించాలి.

ఎందుకంటే న్యాయస్థానాల ద్వారా, అందులోకి అనేక మార్గాల ద్వారా కోర్టులలో తాను చొప్పించిన కొందరు న్యాయవాదులు/ న్యాయమూర్తుల ద్వారా చంద్రబాబు తన ప్రాభవాన్ని నిలుపుకోవడా నికి ఇంతకాలం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇలాంటి నైతిక విరుద్ధమైన ప్రయత్నాలకు ఇప్పటికైనా న్యాయస్థానాలే అడ్డుకట్ట వేయక తప్పదు. జస్టిస్‌ ఫ్రాంక్‌ ఫర్టర్‌ అన్నట్టు జడ్జీలు కూడా మానవులేగానీ, రక్తమాంసాలు లేని మానవులు కారని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ వ్యాసం ముగింపు సందర్భంగా ఇంగ్లిష్‌ చదు వరుల కోసం చంద్రబాబు ‘మనోవృత్తి’ని వివరించే రెండు ప్రసిద్ధ ప్రకటనలను క్లుప్తంగా ఉటంకిస్తాను: 

బ్రిటన్‌ ప్రభుత్వ విభాగం అయిన డీఎఫ్‌ఐడీ ప్రొఫెసర్‌ జేమ్స్‌ మానర్‌ (ససెక్స్‌ యూనివర్సిటీ) ద్వారా చంద్రబాబు హయాంలో నిధుల వాడకం ఎలా జరుగుతుందో అధ్యయనం చేయించింది (2002–2003). దాని ప్రకారం, ‘పెక్కు భారత రాష్ట్రాల్లో మా సంస్థ సాధికారిక సంస్థలతో మాత్రమే చర్చలు జరుపుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అథికార సంస్థలను మినహాయించి కేవలం ఒకే ఒక వ్యక్తితో చంద్రబాబుతో మాత్రమే చర్చలు జరపాల్సి వస్తోంది. అధికారులతో ఇంటరాక్షన్‌ అసలు ఉండదు’.
"At the apex level major kickbacks are received for its award of govt contracts in hundreds of cases. Legislators have been permitted to divert the one third of the funds...  many takes bribes for favours and collaborate in extortion of criminal gangs. Chief minister after prefers the appearance of reform to the reality. This chief minister sometimes acquires substantial leverage with justice of the high court of AP.  he made intelligent use of a reasonable advocate general who sets the tone for institutionals relations with the court అని ఆ నివేదికలో వ్యాఖ్యానించింది అంతేగాక, ‘అడ్వకేట్‌ జనరల్‌.. న్యాయమూర్తులతో చక్కటి సంబంధాలను నెరిపేవారు. అలాగే చంద్రబాబు నాయుడికి కూడా న్యాయమూర్తులతో అనుబంధం పెరుగుతూ వచ్చింది. అలాగే చంద్రబాబు ప్రభావం కూడా పెరిగింది.. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తితో ఆయన సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకోగలిగాడు’’ అని ఆ నివేదిక పేర్కొంది.

హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టీస్‌ బీఎస్‌ఏ స్వామి సహచర న్యాయమూర్తులకు రాసిన బహిరంగ లేఖ (2001–2003)లో ఇలా అన్నారు. ‘బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రధాన న్యాయమూర్తులతో ముఖ్యమంత్రి చాలా సన్నిహితంగా ఉండేవారనేది అందరికీ తెలి సిన విషయమే. తన 29 మంది ఎంపీల వల్లే కేంద్రప్రభుత్వం అధికారంలో ఉందని, కేంద్రప్రభుత్వం ఏది చేయాలో, ఏది చేయకూడదో కూడా తానే నిర్దేశించగలనని  ముఖ్యమంత్రి  న్యాయమూర్తులతో తొలి పరిచయంలోనే చెప్పేవారు. జస్టిస్‌ ఎన్వీ రమణను తన మనిషిగా సీఎం పరిచయం చేసేవారు. చీఫ్‌ జస్టిస్‌కు ఏం కావాలన్నా రమణకు చెప్పవచ్చని సీఎం చెప్పేవారు. చీఫ్‌ జస్టిస్‌ తిరుపతిని సందర్శించినట్లయితే, జడ్జి ఆయనతో పాటు ఉండేవారు’ అని ఆలేఖ పేర్కొంది. 

అన్నట్టు, ఒక కీలకమైన హత్యకు సంబంధించిన కేసులో సెషన్స్‌ కోర్టు ముద్దాయిలకు వివిధ సెక్షన్ల కింద ఖరారు చేసి తీర్పు చెప్పగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెంచి 17.8.2012న ఆ కేసును రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుని కాస్తా సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచి కొట్టేసింది. హైకోర్టు తీర్పుని కాస్తా కొట్టివేస్తూ సుప్రసిద్ధ సుప్రీం న్యాయమూర్తులు పినాకీ చంద్రఘోష్, ఆర్‌.ఎఫ్‌. నారీమన్‌ హైకోర్టు తీర్పుని ‘ఆమోద యోగ్యం కాని, వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్‌) తీర్పుగా ప్రకటించా రని’ జ్యుడీషియల్‌ అకాడమీ మాజీ డైరెక్టర్‌ మంగారి రాజేందర్‌ ఒక పత్రికలో వెల్లడించారు. ఇంతకూ ఆ ‘పర్వర్స్‌’ తీర్పుని వెలువరించి సుప్రీం తీవ్ర విమర్శకు, అభిశంసనకు గురైన ఆ తెలుగు న్యాయ మూర్తులు ఎవరై ఉంటారో చెప్పగలిగిందెవరు?

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

>
మరిన్ని వార్తలు