పాడి రైతుకు సిరులు కురిపించే అమూల్‌ ఒప్పందం

13 Dec, 2020 04:32 IST|Sakshi

సందర్భం

గుజరాత్‌లోని కైరా జిల్లాలో పాల రైతులు దళారీల నుండి దోపిడికి గురవుతున్న నేపథ్యంలో 1942లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సలహాతో స్వాతంత్య్ర సమర యోధుడు,  రైతు ఉద్యమ నేత త్రిభువన్‌ దాస్‌ కిషీ భాయ్‌ పటేల్‌ నేతృత్వంలో 1946 డిసెంబర్‌ 14న కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని నెలకొల్పారు. అంతక్రితం పాల్సన్‌ డైరీ రైతుల నుంచి తక్కువ ధరకు పాలు సేకరించి బొంబాయి మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మి లాభాలు గడిం చేది. రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దాన్ని ఎదుర్కొనడానికి ఆవిర్భవించిన సంఘమే అనంత రకాలంలో అమూల్‌గా రూపాంతరం చెందింది.

అమెరికాలో డైరీ ఇంజనీరింగ్‌ చేసి స్వదేశానికి వచ్చిన డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌ త్రిభువన్‌ దాస్‌ పటేల్‌ ప్రోత్సాహంతో పాడి రైతులకు బాసటగా నిలబడ్డారు. వీరిద్దరి నేతృత్వంలో ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌(అమూల్‌) ఆవిర్భవించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అనేక అవా ర్డులు సాధించింది. పాల సేకరణలో ప్రపంచంలోనే అమూల్‌ 8 వ స్థానంలో నిలిచింది. అమూల్‌  ఒక బ్రాండ్‌ కాదు... ఒక ఉద్యమానికి ప్రతీక. పాడి రైతుకు మంచి ధర ఇచ్చి పాలు కొనుగోలు చేయడం, తనకు వచ్చే ఆదా యంలో కొంత మొత్తాన్ని బోనస్‌ రూపంలో ఏటా రైతులకు ఇవ్వడం ఆ సంస్థ విశిష్టత. కురియన్‌ 1921 నవంబర్‌ 26 న జన్మించి 2012 సెప్టెంబర్‌ 9న 91వ సంవత్సరంలో మరణించే వరకూ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆయన సేవాతత్పరతకు, అంకితభావానికి గుర్తిం పుగా 1965లో పద్మశ్రీ, 1989లో వరల్డ్‌ ఫుడ్‌   ప్రైజ్, 1996లో పద్మ భూషణ్, 1999లో పద్మ విభూషణ్, అవార్డులు లభించాయి. కురియన్‌ నిరంతర కృషి కారణంగానే పాల ఉత్పత్తులలో మన దేశం ప్రపంచంలో ప్రథమ స్థానానికి ఎగబాకింది.

2006 నుంచి 2011 వరకూ అలహాబాద్‌ విశ్వ విద్యాలయానికి మొదటి ఛాన్సలర్‌గా కురియన్‌ సేవలందించారు. 30  విశిష్ట సంస్థలను స్థాపించి వాటిని రైతుల ద్వారా నిర్వహింపచేస్తూ, ఆ సంస్థ లను నిపుణులతో అనుసంధానం చేశారు. గుజరాత్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ కు వ్యవస్థాపకులుగా వ్యవహరించారు. 1965లో నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి కురియన్‌ను  నేష నల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు వ్యవస్థాపక చైర్మన్‌గా నియమించారు. కేరళలో క్రిస్టియన్‌ కుటుంబంలో పుట్టి మిల్క్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండి యాగా, శ్వేత విప్లవ పితామహుడుగా ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. పాడి పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచశ్రేణి సంస్థలతో మనం పోటీ పడేవిధంగా తీర్చిదిద్దిన ఘనత కురియన్‌దే. రైతు లకు మంచి ధర ఇచ్చి పాలు సేకరించడం, వాటిని వినియోగదారులకు వీలైనంత తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా అమూల్‌ కృషి చేస్తోంది. 1948 జూన్‌లో కేవలం రెండు గ్రామాలనుంచి రెండు వందల యాభై లీటర్ల పాలు సేకరించిన అమూల్‌ నేడు గుజరాత్‌లో 36 లక్షల మంది రైతుల నుంచి సేకరించే స్థాయికి ఎదిగింది.
 
పాడి రైతులకు వరం
ఇలాంటి మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్ర పాడి రైతులకు వర మని చెప్పాలి. ఈ ఒప్పందంతో ఇకపై దోపి డీకి గురయ్యే పరిస్థితి రైతుకు ఎదురుకాదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాడి రైతుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ చర్య అన్ని రాష్ట్రాలకూ ఆదర్శనీయం.
పశుసంపదలో మన రాష్ట్ర వాటా 8.4 శాతం. పాల ఉత్పత్తిలో 7.6 శాతం. ఇక్కడ సుమారు 60 లక్షల గేదెలు, 40 లక్షల ఆవులద్వారా రోజూ 412 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతు న్నాయి. ప్రతి రోజు హెరిటేజ్‌ లాంటి వివిధ పాల కంపెనీలు 69 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. 123 లక్షల లీటర్లు స్వీయ వినియోగానికి కేటా యిస్తుండగా 219 లక్షల లీటర్లు అసంఘటిత విభా గంలో సేకరిస్తున్నారు. అమూల్‌ ప్రవేశంతో పాల ఉత్పత్తులపై ఆధారపడి ఉన్న 27 లక్షల మంది మహిళల జీవితాల్లో సంతోషం పెల్లుబుకుతుంది. పాడి రైతుకు ప్రతి లీటర్‌ పాల అమ్మకంలో అద నంగా రూ. 5 నుంచి రూ. 7 వరకూ లబ్ధి చేకూరు తుంది. ఇది మహా విప్లవం అనుకోవచ్చు. ఇంత వరకూ జరిగిన ఆర్ధిక దోపిడీ దీంతో ఆగుతుంది. ప్రస్తుతం పాల సేకరణ ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభం కాగా త్వరలో ఇది అన్ని జిల్లాలకూ విస్తరించి కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పులకు  దోహదపడుతుంది. అమూల్‌ తో ఒప్పందం చరిత్రాత్మకమైన నిర్ణయం. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపే నిర్ణయం. దోపిడీ వ్యవస్థను అరికట్టే నిర్ణయం. పాల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం చేరుకోవడానికి దోహదపడే నిర్ణయం.

ఆవు పాలను గేదె పాలలో కలిపి అధిక ధర లకు అమ్మి వివిధ పాలసేకరణ కంపెనీలు వేలాది కోట్ల రూపాయలు గడించాయి. వాటి లక్ష్యం రైతుల నుండి వీలైనంత తక్కువ ధరకు పాలు సేకరించడం వినియోగదారులకు వీలైనంత  ఎక్కువ ధరకు అమ్మి అత్యధిక లాభాలు గడించడం. అమూల్‌ రాకతో వీరి దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లీటర్‌కు  అదనంగా  ఇస్తున్న నాలుగు రూపాయలతో పాల రైతులు మంచి ధర పొందటానికి వీలు కలుగుతుంది. ప్రపంచంలో 264 మిలియన్ల ఆవులు, గేదెల ద్వారా దాదాపు 600 మిలియన్‌ టన్నుల పాల ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ తలసరి పాల ఉత్పత్తి సంవత్సరానికి ఒక ఆవుకు  2200 లీటర్లుగా ఉంది. మన దేశం 146 మిలియన్‌ టన్నుల పాల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఉండగా అమెరికా 94 మిలియన్‌ టన్నులతో రెండో స్థానం, 45 మిలియన్‌ టన్నులతో చైనా మూడో స్థానంలో ఉన్నాయి. తదుపరి స్థానాల్లో పాకిస్తాన్, బ్రెజిల్, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, టర్కీలున్నాయి. దేశంలో మనది మూడో స్థానం. అమూల్‌తో చెలిమివల్ల మొదటి స్థానానికి చేరడానికి ఎంతో కాలం పట్టదు.

వ్యాసకర్త చైర్మన్,
మద్య విమోచన ప్రచార కమిటీ,
వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
మొబైల్‌: 99499 30670

మరిన్ని వార్తలు