కరోనా ఉన్నా తల్లిపాలు అమృతమే

4 Aug, 2020 01:19 IST|Sakshi

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా కలకలమే. చికిత్సలేని, నివారించేందుకు టీకా కూడా లభ్యం కాని పరిస్థితుల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయడం ఎలా అన్నది అందరిలోనూ మెదులుతున్న సందేహం. కోవిడ్‌–19 కారక కరోనా వైరస్‌ ఆనుపానులపై మనకు తెలి సింది కొంత, తెలియంది కొండంత. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా, తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1–7) సందర్భంగా చాలామందిలో కలిగే అనుమానాలను పరిశీ లిద్దాం. ఈ వ్యాధి తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుందా? తల్లి వ్యాధి బారిన పడితే బిడ్డకు పాలు పట్టవచ్చా? అన్ని రకాల శాస్త్ర విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరు వాత తేలిందేమిటంటే, కరోనా సోకినప్పటికీ తల్లిపాలు అమృతమంత స్వచ్ఛమే! పైగా పుట్టిన బిడ్డతో అను బంధం పెంచుకునేందుకు తల్లికీ, తల్లి స్పర్శతో బిడ్డకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి.

ఒకవేళ తల్లి కోవిడ్‌ బారిన పడ్డా, లేదా ఆ లక్షణాలు ఉన్నా పాలు పట్టడం ఆపాల్సిన అవసరం లేదని సైన్స్‌ చెబుతోంది. కాకపోతే ముఖానికి మాస్కు తొడుక్కోవడం, చేతులు తరచూ సబ్బుతో లేదా ఆల్కహాల్‌ ఆధారిత ద్రావ ణంతో కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించి బిడ్డను ముట్టుకోవచ్చు. వ్యాధి కారణంగా తల్లి బలహీనంగా ఉంటే శుభ్రం చేసిన స్పూన్‌ లేదా కప్‌ ద్వారా తల్లిపాలు అందివ్వవచ్చు. ఇది కూడా సాధ్యం కాదనుకుంటే సరి పోయే కల్చర్‌ ఉన్న దాతల పాలు కూడా పట్టవచ్చు. రొమ్ముపాలు పట్టేందుకు ఉపయోగించే, పాలు నిల్వచేసే పాత్రలను కోవిడ్‌–19 సంబంధిత శుద్ధీకరణ పద్ధతులు ఉపయోగించిన తరువాత మాత్రమే వాడటం, శభ్రం చేయడం చేయాలి. ఒకవేళ బిడ్డ వ్యాధి బారిన పడినా స్తన్యం మాత్రం నిలపకూడదని సైన్స్‌ చెబుతోంది. తల్లి పాలు బిడ్డ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయనీ, తల్లిలోని యాంటీబాడీలు బిడ్డకు అందుతా యనీ, తద్వారా బిడ్డ ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కో గలదన్నదీ మనకు తెలిసిన విషయమే.

కోవిడ్‌–19 ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంది. ఈ మహమ్మారి ప్రభావం పసిపిల్లల పోష ణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పేద, మధ్యాదాయ దేశాల్లో ఐదేళ్లలోపు పిల్లలు తీవ్రమైన కుపోషణకు గురవుతున్నారు. కోవిడ్‌–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది పిల్లలు పోషకాహార లేమికి గురికానున్నారు. వీరిలో సగం మంది దక్షిణాసియా ప్రాంతంలో ఉన్నారు. భారత్‌ విషయానికి వస్తే పిల్లల పోషకాహారానికి సంబంధించిన పలు సూచీల్లో గుణాత్మక మార్పు, వృద్ధి కనిపిస్తున్నప్పటికీ సుమారు రెండు కోట్ల మంది ఐదేళ్ల వయసులోపు పిల్లలు తక్కువ కాలంలో  తీవ్ర పోషకాహార లోపానికి గురికాగా, మరో నాలుగు కోట్ల మందికి తగినన్ని పోషకాలు అంద డం లేదు. అంతేకాకుండా 14 –19 ఏళ్ల మధ్య వయసు యువతుల్లో సగం మంది రక్తహీనతతో బాధ పడుతు న్నారు. కరోనావల్ల జరిగే నష్టం కంటే, పోషకాహార లోపం వల్ల పిల్లలకు దీర్ఘకాలంలో జరిగే నష్టమే ఎక్కు వగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. 

పోషకాహార లోపం నిశ్శబ్దంగా మనిషిని చంపే స్తుంది. తగినంత పోషహాకారం తీసుకోకపోతే లేదా తీసు కున్న ఆహారం ద్వారా విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు, శక్తి తగినంత శరీరానికి వంటబట్టక పోతే పోషకాల లోపం తలెత్తుతుంది. చిన్నప్పుడు అతి సారం లేదా ప్రేవుల్లో సూక్ష్మక్రిములు చేరినా శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. భారత్‌లో ఐదేళ్లలోపు వయసున్న పిల్లల మరణాల్లో మూడింట రెండు వంతులకు కుపోషణే కారణం. వీటివల్ల భౌతికంగా, మానసికంగానూ ఎదుగుదల సరిగా లేకుండాపోతుంది. దీని ప్రభావం కాస్తా విద్యాభ్యాసం, మేధ, చివరకు పెరిగి పెద్దయ్యాక ఆదాయ ఉత్పత్తిపై కూడా పడుతుంది.

పుట్టిన బిడ్డ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే తొలి రెండేళ్లు అత్యంత కీలకం. పుట్టిన గంట లోపు తల్లి పాలు అందించడం మొదలుకొని, నిర్ణీత కాలం వరకూ తల్లిపాలు మాత్రమే అందించి ఆ తరువాత దశలవారీగా ఇతర ఆహారం అందివ్వడం ద్వారా ఐదేళ్లలోపే మరణి స్తున్న పిల్లల్లో 20 శాతం మందిని కాపాడుకోవచ్చు. దుర దృష్టవశాత్తూ భారతదేశంలో పుట్టిన గంట లోపు బిడ్డకు తల్లిపాలు అందివ్వడం లేదు. కనీసం 57 శాతం మంది పిల్లలు ఈ భాగ్యానికి నోచుకోవడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. తొలినాళ్లలో తల్లిపాలు మాత్రమే అందు కునే పిల్లలకు అతిసారం, నిమోనియా వంటివి సోకే అవకాశాలు తక్కువ. ఆరు నెలల తరువాత తల్లిపాలతో పాటు ఇతర ఆహారం కూడా ఇవ్వడం వల్ల పిల్లలు దృఢంగానే కాకుండా వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరుగుతారు. రెండేళ్ల వరకూ బిడ్డకు అవసరమైన పోష కాల్లో అత్యధికం తల్లిపాల ద్వారానే అందుతాయన్నది మరచిపోకూడదు. 

కోవిడ్‌–19 మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరు ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కుపోషణ సమస్యను ఎదుర్కొనేందుకు యూనిసెఫ్‌ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. పసిపిల్లల పోషణావసరాలను తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని యూనిసెఫ్‌ అన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. సురక్షితమైన, చౌకైన ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు యత్నిస్తోంది. తల్లి, పిల్లల సంరక్షణ, తల్లిపాల ప్రాము ఖ్యతను చాటడం, పసిపిల్లల ఆహార ఉత్పత్తుల మార్కె టింగ్‌ సక్రమంగా జరిగేలా చూడటం చేస్తోంది. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగని పిల్లలను ముందుగానే గుర్తించి చికిత్స కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అత్య వసర పరిస్థితుల్లో పిల్లలకు పోషకాహారం అందించేం దుకు పాఠశాలలు, అంగన్‌ వాడీలు మూతకు గురైన ఈ తరుణంలో వారి ఇళ్లకే ఆహారం అందించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పోషణ్‌’ కార్యక్రమానికి యూనిసెఫ్‌ సాంకేతిక సాయం అందివ్వడం, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని అధికారులకు శిక్షణ ఇవ్వడం చేస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సాయంతో తెలంగాణలో ఐదేళ్లలోపు వయసున్న, కుపోషణతో బాధపడుతున్న పిల్ల లకు తగిన ఆహారం అందించే ప్రయత్నం చేస్తోంది.

వ్యాసకర్త హైదరాబాద్‌ యూనిసెఫ్‌
కార్యాలయ ముఖ్యాధికారి 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా