అంతరాల తొలగింపే... అసలు లక్ష్యం

19 Aug, 2021 00:04 IST|Sakshi

విశ్లేషణ

సంపన్న దేశాల్లో రైతాంగ వ్యవసాయాన్ని పారిశ్రామిక వ్యవసాయం విధ్వంసం చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు వ్యవసాయాన్ని తీవ్ర దుఃస్థితిలోకి నెట్టాయి. ఆ చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని దేశీయ సంస్కరణలను తిరగ రాసుకోవలసిన అవసరం ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరుగుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. ‘సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడానికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచించాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కన్నా మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’ అంటూ నాటి సంస్కరణల్లో ప్రధానభూమిక పోషించిన మన్మోహన్‌ సింగ్‌ చేసిన తాజా ప్రకటన సంస్కరణల సమర్థకులకు కనువిప్పు. 

మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల 30వ వార్షికోత్సవ సంబ రాలను జరుపుకుంటూ ఆహా ఓహో అంటూ సంస్కరణల సమర్థకులు చంకలు గుద్దుకుంటున్న వేళ, నాటి సంస్కరణల ప్రధాన కర్త తదనం తరం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్‌ తాజా ప్రకటనలో నాటి సంస్కరణల పట్ల ఆనందంతో గంతులేయాల్సిన సమయం కాదనేశారు. ’సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడా నికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచిం చాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కంటే మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’

వాతావరణ మార్పుపై అంతర్‌ ప్రభుత్వాల ప్యానెల్‌ రూపొం దించిన ఆరవ అంచనా నివేదిక తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించిన అంతర్జాతీయ అధ్యయనం  చేసిన ఒక ప్రకటన మానవజాతి మొత్తా నికి ప్రమాద సంకేతాలను పంపించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియో గ్యుటెరెస్‌ స్పష్టంగా ఈ అంశంపై మాట్లా డుతూ, ’మనముందున్న సాక్ష్యాధారాలను తోసిపుచ్చలేం. గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలు మన భూ ఖండాన్ని ఆక్రమించేస్తున్నాయి. దీంతో వందల కోట్ల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి’ అని ప్రకటిం చారు. అయితే జీడీపీని మాత్రమే అభివృద్ధికి కొలమానంగా భావి స్తున్న నయా ఉదారవాద ఆర్థశాస్త్రం నేపథ్యంలో మన భూ ఖండం వాస్తవంగానే మండిపోతోందని గుర్తించడంలో ఈ నివేదిక విఫల మైంది. లేదా, ప్రపంచ జనాభాలో 1 శాతం సగం ప్రపంచం వెలువ రించే ఉద్గారాలకు రెండు రెట్లకు పైగా ఎలా వెలువరిస్తోందన్న వాస్త వాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు? 

మరొక 20 సంవత్సరాల్లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 సెంటీగ్రేడ్‌ డిగ్రీల మేరకు పెరగనుండటాన్ని ఎవరూ కాదనలేరని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇప్పటికే 1.1 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. మరొక 0.4 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగేందుకు ఇంకెన్ని సంవత్స రాల సమయం పడుతుందో నాకు తెలీదు. కాకుంటే, పారిశ్రామిక అభివృద్ధి ప్రారంభ సంవత్సరాల్లో మాదిరే ప్రపంచ వాతావరణం వేడెక్కుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక వృద్ధి నమూనాను రూపొందిం చిన మార్గం మౌలికంగానే లోపభూయిష్టంగా ఉందని తెలుపుతుంది.

ప్రపంచ ఆర్థిక వేదికపై ఇంటర్నేషనల్‌ చారిటీ ఆక్స్‌ఫామ్‌ వరుసగా నివేదించిన అసమానతలపై నివేదిక మరొక అంతర్జాతీయ అధ్యయనంగా మనముందుకొచ్చింది. సంపన్నులు మరింత సంప న్నులెలా అవుతున్నారో, పేదలు మరింత నిరుపేదలుగా ఎలా మారి పోతున్నారో ఈ నివేదికలు స్పష్టంగా వివరించాయి. మన సంస్కర ణలపై పునరాలోచన తక్షణం అవసరమనేందుకు ఇదొక బలమైన సూచికగా కనబడుతుంది. భారత్‌లో ఒక శాతం మంది చేతుల్లో ఉన్న సంపద, 73 శాతం జనాభా సంపద కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందన్న వాస్తవం ఒక్కటే... అసమానతలను తీవ్రంగా పెంచివేయ డంలో ఆర్థిక సరళీకరణ పాత్రను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే అంత రిక్ష యాత్ర చేసిన జెఫ్‌ బెజోస్‌ రోజుకు 8 బిలియన్‌ డాలర్లను సంపాదిస్తూ కూడా అమెరికాలో స్టెనోగ్రాఫర్‌ చెల్లించే పన్ను కంటే తక్కువ పన్నును చెల్లిస్తున్నాడు. సంపన్నులు అపారమైన సంపదను పెంచుకోవడంలో ప్రపంచ ఆర్థిక సరళీకరణల నమూనా ఎలా తోడ్ప డుతుందో ఇది స్పష్టంగా తెలుపుతుంది. భారత్‌లో కూడా ఈజీ మనీ, ఆర్థిక ఉద్దీపనలు స్టాక్‌ మార్కెట్‌లోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటున్నాయంటే ఆశ్చర్యపో వలసింది లేదు.
అసమానత్వమే చెడు ఆర్థికవ్యవస్థకు సంకేతం. పబ్లిక్‌ సిటిజన్‌ సలహా బృందం మనకు చెప్పినట్లుగా అమెరికాలోని బడా టెక్‌ కంపెనీల సీఈఓల సామూహిక సంపద 2021లో 651 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తాన్ని ఉపయోగించి ఉంటే ప్రపంచ క్షుద్బాధను నిర్మూలించవచ్చు. మలేరియాని మటుమాయం చేయ వచ్చు. ప్రపంచం మొత్తానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ షాట్లను వేసి ఉండవచ్చు. అమెరికాలోనే ఇళ్లు లేని నిరాశ్రయుల సమస్యకు ముగింపు పలక వచ్చు. అప్పటికీ ఈ బిలియనర్ల వద్ద ఎంతో డబ్బు మిగిలే ఉంటుంది.

భారత్‌లో ఒక శాతం సంపన్నుల వద్ద పోగుపడిన భారీ సంప దలో అతి చిన్న భాగాన్ని ఖర్చు చేయచేయగలిగితే మన దేశ దారి ద్య్రాన్ని నిర్మూలించడానికి, దేశీయ ఆకలి చరిత్రను తుడిచిపెట్టడానికి సరిపోతుంది. ఆర్థికవేత్త సుర్జిత్‌ భల్లా చెప్పినట్లుగా భారత్‌లో ఒక సంవ త్సరం దారిద్య్రాన్ని పూర్తిగా తొలగించాలంటే 48 వేల కోట్ల రూపా యలు కేటాయిస్తే చాలు. 2020 ప్రపంచ క్షుద్బాధా సూచిలో 107 దేశాల జాబితాలో భారత్‌ 94వ ర్యాంకులో ఉండటానికి మరో కారణం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అది కూడా మన ఆహార ధాన్యాల నిల్వలు పలు సంవత్సరాల పాటు దేశ అవసరాలకు సరిపోయేంత స్థాయిలో పోగు పడివుండటాన్ని ప్రత్యేకించి పరిశీలించాల్సి ఉంది. వ్యవసాయ దుస్థితి కొనసాగింపు కారణంగానే ఢిల్లీ చుట్టుపట్ల రైతుల తీవ్ర నిరసన చోటుచేసుకుంది. అందుకే మరింత కఠిన సంస్కరణలు చేపట్టడం కాదు. మానవీయ రూపంలో సంస్కరణలను తీసుకు రావటం ఇప్పుడెంతో అవసరం. ముఖ్యంగా ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వ్యత్యాసాల తగ్గింపు అవసరాలను తీర్చగల సంస్కరణలు కావాలిప్పుడు.

ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితం అనేది ఆరోగ్యకరమైన పర్యావరణంతోపాటు పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2020 పర్యావరణ పనితీరు సూచీ ప్రకారం 180 దేశాల జాబితాలో భారత్‌ 168వ స్థానంలోకి పడిపోయింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజారోగ్య పరిరక్షణ, సహజవనరుల పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపుపై విశేషంగా కృషి చేసిన దేశాలు అత్యధిక ర్యాంకులను సాధించాయని ఈ సూచి తేల్చి చెప్పింది. అయితే సంపన్న దేశాలు ఈ సామాజిక, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించాయని చెప్పలేము. ఎందు కంటే పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటినుంచి 63 శాతం కాలుష్య ఉద్గారాలను 90 కంపెనీలు మాత్రమే సామూహికంగా విడు దల చేశాయి. అంటే భారత ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు మరింత నిలకడైన, సమీకృత మార్గంపై కృషి చేయాల్సి ఉందని ఈ వాస్తవం స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంస్కరణల అవసరం గురించి గుండెలు బాదుకుంటూ శోకన్నాలు పెడుతున్న వారికి సంస్కరణలు అంటే ప్రైవేటీకరణ అని మాత్రమే అర్థం కావడంతో దేశం మొత్తంగా ఐఎమ్‌ ఎఫ్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ ఉచ్చులో చిక్కుకుపోయింది. దీనికి బదులుగా, మధ్య, దిగువ తరగతుల్లోని మెజారిటీ జనాభా మరిం తగా సంపాదించేలా మన విధానాలను మార్చాలి. అప్పుడు మాత్రమే భారీ ఎత్తున గ్రామీణ డిమాండును సృష్టించవచ్చు. 


’వాషింగ్టన్‌ సమ్మతి’ అనే స్పష్టమైన డిజైన్‌ను దాటి ముందుకెళ్లేం దుకు ఒక చారిత్రక అవకాశాన్ని భారతీయ విధాన నిర్ణేతలు కోల్పో యారు. అలాగే వ్యవసాయాన్ని రెండో అభివృద్ధి చోదకశక్తిగా పరిగ ణించే తరహా దేశీయ ఆర్థిక సంస్కరణల నమూనాను చేపట్టే అవకాశం కూడా వీరు చేజార్చుకున్నారు. వ్యవసాయం నుంచి రైతాంగాన్ని పక్కకు నెట్టేయడానికి బదులుగా, వ్యవసాయాన్ని ఆర్థికవృద్ధి శక్తికేంద్రంగా మార్చడంపై మనం ఇకనైనా దృష్టి పెట్టాలి. ఈ కీలక మార్పు ఇప్పటికీ సాధ్యమే. సంపన్న దేశాల్లో వ్యవ సాయ రంగాన్ని విధ్వంసం చేసిన పారిశ్రామిక వ్యవసాయం గుణ పాఠాలను, ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు భారీ ఎత్తున సృష్టించిన వ్యవసాయ దుస్థితి నేర్పుతున్న పాఠాలను దృష్టిలో ఉంచు కుని ఆహార వ్యవసాయ వ్యవస్థను సమర్థంగా నిర్వహించగలిగిన స్థితిలోకి రైతులను తీసుకురావాలి. వీరందరికీ నిర్దిష్టధరపై హామీ ఇస్తూ స్థిర ఆదాయాన్ని అందుకునేలా సంస్కరణలను మార్చాల్సి ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరు గుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. 


దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు 

మరిన్ని వార్తలు