ఒక వినూత్న కార్యక్రమం

4 Apr, 2022 01:03 IST|Sakshi

సందర్భం

మన దేశంలో ఫోర్త్‌ ఎస్టేట్‌ మీడియా! దీనికున్న బలం గురించీ, అది చూపిన, చూపిస్తున్న ప్రభావం గురించీ అందరికీ తెలి సిందే. కానీ ఈ దేశంలోని దళితులు, అంటరాని కులా లుగా భావించే జన సమూహాలకు అందులో ఎంత భాగస్వామ్యం ఉంది? ఇదే ప్రశ్న 1996లో కాన్షీరాం వేసినప్పుడు... దానికి సమాధానం దొరక లేదు. ఇది నాడు, నేడు దేశవ్యాప్తంగా ఉన్న పరి స్థితి. కానీ తెలంగాణ దీనికి భిన్నం. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... మార్చి 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ మీడియా అకా డమీ, ఎస్సీ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్వహిం చిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులకు ఊహిం చలేనంత స్పందన వచ్చింది. బహుశా దేశంలోనే 16 వందల మందికి పైగా దళిత జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఉండటం గుర్తిం చాల్సిన ముఖ్యాంశం. మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ చొరవ వల్లనే ఇది సాధ్యమైంది.

నిజంగానే ఇంత మంది జర్నలిస్టులు పేపర్, టీవీ, డిజిటల్‌ మీడియాల నుండి వచ్చారా అంటే...  వచ్చారు! వందల సంఖ్యలో శిక్షణా తరగ తులకు హాజరు కావడమే దీనికి నిదర్శనం. ఇది పెద్ద విప్లవంగానే చెప్పాలి. తెలంగాణ... దళిత చైతన్యానికి ఎత్తిన పతాక వంటిది. మొదటగా 1888లో ‘విఠల్‌ విధ్వంసక్‌’ అనే పేపర్‌ దళితుల కోసం ఏర్పాటయింది. దీన్ని ఏర్పాటు చేసింది అంబేడ్కర్‌కు స్ఫూర్తినిచ్చినవారిలో ఒకరైన గోపాల్‌ బాబా వాలంగ్‌ కర్‌. ఆటు ఆంధ్ర ఏరియా నుండి కుసుమ ధర్మన్న లాంటి వాళ్లు ఏర్పాటు చేసినవి కొన్ని పత్రికలు ఉన్నాయి. ఈ చైతన్య ప్రవాహం తెలంగాణలో ఆంధ్రమహాసభ ఏర్పడేంత వరకు ఉన్నది. ఆ తర్వాత వచ్చిన పలు రకాల ఉద్యమాలు, వాటి ప్రభావాలు యావత్‌ తెలం గాణపై ఉన్నాయి. ఆ తర్వాత ఈ పరంపర కాస్త ఆగిపోయింది. మళ్లీ ఉమ్మడి రా్రçష్టంలో కంచిక చెర్ల కోటేశు హత్యోదంతం, కారంచేడు, నీరుకొండ ఘటనలు కొత్త తరం దళితులను సరికొత్త ఎజెండాతో కార్యోన్ముఖులను చేశాయి.

మీడియాలో 1985ల నాటికి పేరు పొందిన దళిత జర్నలిస్టులు లేరు. కానీ 1996ల తర్వాత దళి తులు పేపర్‌ మీడియాలోకి ఒకరిద్దరు రావడం షురూ అయింది. ఆ తర్వాత 2000 సంవత్సర ఆరంభంలో తెలుగు నాట ప్రయివేటు ఛానళ్లు వచ్చాయి. అందులో ఇప్పటి ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తెలంగాణలోనే సుపరిచిత రిపోర్టర్‌గా ఎదిగారు. ఆ తర్వాత జై తెలంగాణ ఛానల్‌కు ఎడి టర్‌ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభా వంతో చాలామంది సొంత పేపర్లు ఏర్పాటు చేసు కున్నారు. పలు మీడియా సంస్థల్లో కొంత మంది దళితులకు అవకాశం దొరికింది. 2014 తర్వాత డిజిటల్‌ మీడియాతో పాటు, చిన్న పేపర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇందులో బీసీలు, దళితులే పెద్ద భాగం. వీరికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా భరోసానిస్తోంది.

దళిత జర్నలిస్టులను గుర్తించి... వారి కోసం శిక్షణ ఇవ్వడమంటే గత చైతన్యానికి మరింత పదును పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికేనని చెప్పొచ్చు. ఈ చైతన్య ఒరవడి మరింత ముందుకు సాగాలంటే కేసీఆర్‌ ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళిత బంధు’తో పాటు సబ్‌ ప్లాన్‌ నిధులలో జర్నలి స్టులకు కొంత శాతం ఇచ్చి, ఆర్థిక స్వయం వృద్ధి సాధించేందుకు చేయూతనిస్తే వారు బాగుపడటమే కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పించిన వారవుతారు.

అస్కాని మారుతీ సాగర్‌
వ్యాసకర్త టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి
మొబైల్‌ : 90107 56666

మరిన్ని వార్తలు