సామరస్యతే మన సంస్కృతి కావాలి...

1 Dec, 2020 01:03 IST|Sakshi

సందర్భం

ఐదువందల ఏళ్ల మహోజ్వల చరిత్ర కలిగివున్న హైదరా బాద్‌ భారత స్వాతంత్య్ర కాలం నాటికే దేశంలోని ఐదు మహా నగరాల్లో ఒకటి. వివిధ భాషలకు, మతాలకు, సంస్కృతులకు కేంద్రం. మత సామరస్యానికి ప్రతీక. హైద రాబాదు కేంద్రంగా తెలం గాణ నేలిన నైజాం నవాబులు కాకతీయ రాజుల వ్యవసాయ నమూనాకు పొడిగింపుగా చెరువులు, కుంటలు, గొలుసు చెరువులతో వ్యవసాయం సాగిం చారు. నైజాం పాలన చివరి రోజుల్లో సంభవించిన రజాకారు దురంతాలను వదిలిపెడితే వారి పాలన ఏ ఇతర రాజుల పాలనకూ తీసిపోదు. ముస్లిం రాజుల పాలనలో కట్టబడిన గోల్కొండ ఖిల్లా, చార్మి నార్, మక్కామసీదు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సాలా ర్‌జంగ్‌ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్‌ బండ్, ఇంకా అనేక చెరువులు, కుంటలు తెలంగాణ చారిత్రక వైభవానికి చిహ్నాలు. వందలేండ్లుగా హైదరా బాద్‌ ప్రజలు హిందూ ముస్లిం భాయీ భాయీ అన్న ట్టుగా సహజీవనం సాగిస్తున్నారు.

స్వాతంత్య్రానంతరం వలస పాలకుల చేతుల్లోకి పాలన పోయిన తర్వాత హైదరాబాధలు మొదల య్యాయి. కుంటలు, చెరువులు ఆక్రమణకు గురై అక్రమ కట్టడాలతో డ్రైనేజీ వ్యవస్థ  దెబ్బతింది. వాతా వరణ కాలుష్యం పెరిగింది. జనాభా పెరుగుదలకు తగినట్టుగా నీటి వనరులు కల్పించకపోవడంవల్ల తాగునీటి కొరత ఏర్పడింది. ఈ అన్ని కారణాలవల్ల సమతుల వాతావరణంలో ఉండే నగర ఉష్ణోగ్రత పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. వలసలు పెరిగాయి. 

వలస పాలకుల పాలనలో ముఖ్యమంత్రిని మార్చాల నుకున్నప్పుడల్లా హైదరాబాద్‌ మత కలహాలకు వేది కగా మారింది. కర్ఫ్యూలు, 144 సెక్షన్‌లతో ప్రజలు నానా ఇబ్బందుల్లో పడేవారు. అభివృద్ధి కుంటుపడి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు కూడా రాని పరి స్థితి. నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నీ దోపిడీకి గురై తెలంగాణ ప్రజలు పరాయీకరణ మాయలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో టీఆర్‌ఎస్‌ ఏర్ప డింది. తెలంగాణను సాధించడానికి 13 ఏళ్లు కేసీఆర్‌ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేసింది.

2014లో అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్‌ హైద రాబాధను, తెలంగాణ బాధను అర్థం చేసుకుంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సమస్యలతో పాటు హైదరాబాద్‌ సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చుగానీ వాటి పరిష్కా రానికి పథకాలు రచింపబడుతున్నాయి. రాష్ట్రాన్ని వేధి స్తున్న తాగునీటి సమస్య, సాగునీటి సమస్య తీర్చ డానికి, సగం జనాభాకుపైగా బతికే వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి అనేక పథకాల వల్ల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా పయనం కొన సాగుతోంది.  హైదరా బాద్‌ ఐటీ, ఫార్మా హబ్‌గానే కాకుండా, విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టడా నికి అనువైన స్థలంగా భావింపబడుతోంది. ఏ పరిశ్రమలైనా సక్రమంగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్‌ సరఫరా అవసరం. 

స్వాతంత్య్రానంతరం తెలంగాణలో పెద్ద సమస్యగా ఉన్న విద్యుత్‌ కొరతను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీర్చడం జరిగింది. ఒకప్పుడు దక్షిణాది వాళ్లందరూ మదరాసీలుగానే పిలవబడితే ఇప్పుడు హైదరాబాద్‌ మహానగరంతో, రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రపంచ పటంలో స్థానం సంపాదిం చుకుంది. తెలంగాణ భాషకు గౌరవం పెరిగింది. లౌకికవాదిగా అన్ని మతాలకు సమాన గౌరవమిస్తూ, మత సామరస్యాన్ని కాపాడటంలో కేసీఆర్‌ దేశంలోనే ముందు వరుసలో ఉన్నాడు. సంక్రాంతి, దసరా, బతుకమ్మ లాంటి హిందువుల పండుగలకెంత ప్రాధా న్యమిస్తాడో రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్, గుడ్‌ ఫ్రైడేలకు అంతే ప్రాధాన్యతనిస్తాడు. 

ఇవేవీ ప్రస్తావించకుండా బీజేపీ నాయకులు వర్షాలొస్తే హైదరాబాద్‌ చెరువవుతుందనీ, కరోనాను ఎదుర్కోలేదనీ, కుటుంబ పాలననీ, వరదసాయం రైతులకు అందలేదనీ అరిగిపోయిన రికార్డులతో ప్రచారం చేస్తునారు. వర్షాలను కానీ, వరదలను కానీ, కరోనాను కానీ ఎవరూ ఆపలేరు. ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొన్నాయన్నదే ప్రశ్న. ఈ అన్ని విషయాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది.  తెలంగాణ అభివృద్ధి ఇలాగే జరగాలన్నా, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నా, మత సామరస్యాన్ని కాపాడుకోవాలన్నా టీఆర్‌ఎస్‌ పాలన ఒక అనివార్యం.
వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, ప్రముఖ రచయిత

మొబైల్‌ : 91829 18567

మరిన్ని వార్తలు