Good Governance Day 2022: కలుపుకొని పోవడమే సుపరిపాలన

25 Dec, 2022 01:02 IST|Sakshi

ఈ రోజు క్రిస్మస్‌ – యేసు క్రీస్తు పుట్టిన రోజు. ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం అనే ఆయన బోధనలు మాన వాళికి జీవనాడి లాంటివి. ఈ సందర్భంగా దేశ ప్రజలంద రికీ... ముఖ్యంగా క్రైస్తవ పౌరు లకు నా క్రిస్మస్‌ శుభాకాంక్షలు. మన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా 1924లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇదే రోజున జన్మించడం యాదృచ్ఛికం! ఆయన శాంతి, సహ జీవనం, కరుణ, అందరికీ గౌరవం, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు. కవి, రచయిత, పాత్రికేయుడు, రాజ నీతిజ్ఞుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, దార్శనికుడుగా ప్రసిద్ధులు.  

వాజ్‌పేయి 1932లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1947లో ప్రచారక్‌ అయ్యారు. 1951లో భారతీయ జనసంఘ్‌లో సభ్యత్వం పొందడం ద్వారా అధికారి కంగా రాజకీయాల్లో చేరారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆలోచనల ద్వారా ఆయన ఎంతో స్ఫూర్తి పొందారు.

1957లో తొలిసారిగా లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌ నుంచి ఎన్నికై... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా పార్ల మెంట్‌లో ఆయన చేసిన చర్చోపచర్చలకు ముగ్ధులై వాజ్‌పేయి  తన స్థానాన్ని ‘ఒక రోజు’ ఆక్రమిస్తారని అంచనా వేశారు.

1980లో ఆయన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు.1977లో జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, వివిధ ముఖ్యమైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల అధిపతిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి తన అత్యుత్తమ సేవలను అందించారు.

ఆయన ‘నేషన్‌ ఫస్ట్‌’ అనే విశ్వాసానికి ముగ్ధుడై, అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని ఐక్య రాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించవలసిందిగా కోరారు. దౌత్య విషయాలపై ఆయన సాధికారత అద్భుతమైనది. 

1996లో ఆయన  బీజేపీ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. అతి కొద్దిరోజులే ఆయన ప్రభుత్వం ఉంది. తరువాత 1998లో మళ్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పోఖ్రాన్‌ వద్ద భారత్‌ రెండో దఫా అణుపరీక్షలను నిర్వహించింది. ఒకవైపు దేశ భద్రతకు కావలసిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆయన చూశారు. లాహోర్‌ బస్సు యాత్ర చేపట్టడం, ఆగ్రా శిఖరాగ్ర సమావేశానికి పర్వేజ్‌ ముషారఫ్‌ను భారత్‌కు ఆహ్వానించడం వంటివి ఆయన సాహసోపేత విధానంలో కొన్ని మెరుపులు. తర్వాత కార్గిల్‌ యుద్ధంలో ఆయన నాయకత్వంలో పాక్‌పై విజయం సాధించడం ముదావహం.

ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతులను ఉన్నతీకరించడానికి కృషి చేశారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సరళీకరణ స్ఫూర్తిని ముందుకు తీసుకు పోయి, మరిన్ని భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడానికి ఏకంగా ప్రత్యేక ‘పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ’ను సృష్టించారు. 6–14 ఏళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడానికి ‘సర్వశిక్షా అభియాన్‌’ను ప్రారంభిం చడం చారిత్రక నిర్ణయం. దేశంలో నదులను అను సంధానించాలనేది ఆయన చిరకాల వాంఛ. ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్ట్, ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన’ ద్వారా రహదారుల నిర్మాణానికి గొప్ప ఊపునిచ్చారు.

అనేక దశాబ్దాలుగా పార్టీలో, పార్లమెంట్‌లో, అలాగే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సహాధ్యాయిగా ఉన్న నాకు... ఆయన ఒక నిష్ణాతుడైన రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ, అంకితభావం ఉన్న నాయకు డిగా తెలుసు. పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంత రాయం కలిగించే ప్రయత్నానికి ఎప్పుడూ ఆయన మద్దతు ఇవ్వలేదు. లాల్‌ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేస్తూ బిహార్‌లో అరెస్టు అయినప్పుడు నేను పార్ల మెంటు సభ్యుడిగా ఉన్నాను. ఆ సంద ర్భంగా వారం రోజులకు పైగా పార్లమెంట్‌ కార్య కలాపాలకు అంతరాయం ఏర్ప డింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమా వేశంలో వాజ్‌పేయి మాట్లాడుతూ... ‘పార్ల మెంటు చర్చోప చర్చలకు వేదిక. మనం చర్చకు అనుమతించాలి. మన రాజకీయ పోరాటం పార్లమెంటు వెలుపల జర గాలి...’ అన్నారు.

వాజ్‌పేయి దార్శనికతను అందిపుచ్చు కుని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ వెనుకబడి ఉండకూడదు అన్న ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కల త్వరగా సాకారం అవ్వ డానికి సుపరిపాలన అందిస్తున్నారు. జన్‌ధన్‌–ఆధార్‌– మొబైల్‌ అనేవి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చాయి.  వాజ్‌పేయి జయంతిని ‘జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా, ప్రజలు, నాయకులు, అధికారులు...  దేశం పట్ల భక్తినీ, సమాజం పట్ల గౌరవాన్నీ కలిగి ఉండాలి. బలమైన, ఆరోగ్యకర మైన, అందరినీ కలుపుకొని పోయే దేశ నిర్మాణమే వాజ్‌పేయికి నిజమైన నివాళి. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పరిపాలనతో మాత్రమే భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్ద గలుగుతాం!


బండారు దత్తాత్రేయ 
వ్యాసకర్త హరియాణా గవర్నర్‌
(నేడు జాతీయ సుపరిపాలనా దినోత్సవం) 

మరిన్ని వార్తలు