సంఖ్యతోపాటు బాధ్యతలూ పెరగాలి

9 Apr, 2021 01:14 IST|Sakshi

సందర్భం

పోలీస్‌ అంటే మగ వారి ఉద్యోగం అని భారత్‌లో చాలామంది భావన. హిమాచల్‌ ప్రదేశ్‌ ఏర్పాటు గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా మా రాష్ట్ర మహిళా పోలీస్‌ అధికారుల భాగ స్వామ్యం పోలీస్‌శాఖలో ఎంతుందో చెప్పదల్చుకున్నా. 1973లో   అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం ముగ్గురు మహిళలను కారుణ్య నియామకం కింద కానిస్టేబుళ్లుగా చేర్చాము. 1975లో తొలిసారిగా 28 మంది మహిళా కానిస్టేబుళ్లను భర్తీ చేశాం. ప్రస్తుతం 15 మంది ఐపీఎస్, 8 మంది హెచ్‌పీఎస్‌ అధికారుణులు సహా 2,352 మంది నాన్‌గెజిటెడ్‌ అధికారిణులు పనిచేస్తున్నారు.

సంఖ్య పెరుగుతున్నా క్షేత్రస్థాయిలో కీలక విధుల్లో ప్రాధాన్యత ఉండటం లేదు. లింగ వివక్ష, మౌలిక వసతుల లేమి వీటికి కారణాలు. ఈ రోజు రాష్ట్ర పోలీస్‌శాఖలో 13 శాతానికి మహిళల సంఖ్య చేరింది. పది శాతానికి మించి మహిళా పోలీస్‌ సిబ్బంది ఉన్న ఏడు రాష్ట్రాలైన బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళ నాడు, ఉత్తరాఖండ్‌ సరసన చేరింది.

మహిళా సిబ్బంది 33 శాతం ఉండాలని 2009లో కేంద్ర హోంశాఖ లక్ష్య నిర్దేశం చేసింది. దీన్ని హిమాచల్‌ వీలైనంత త్వరగా చేరుతుందన్న ఆశాభావం ఉంది. కానిస్టేబుల్‌ స్థాయి నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లను రాష్ట్రం అమలు చేయడం దీనికి దోహదపడుతుందని  భావిస్తున్నాను. కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోస్టుల భర్తీలో 25 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం ప్రకటించారు. మహిళలు, చిన్నారులపై నేరాల పరిశోధనలో మహిళా అధికారులు ప్రముఖ పాత్ర పోషించగల్గుతారు. లైంగికదాడుల కేసులో బాధితులతో మాట్లాడేందుకు మహిళా అధికారులు ఉండాలని ఐపీసీ, పోక్సో చట్టాలు కూడా చెబుతున్నాయి. కోవిడ్‌ పరిస్థితుల్లోనూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా అద్భుతంగా సేవలందించారు. హిమాచల్‌లో మహిళల సంఖ్య పెర గడం వారి శరీర దారుఢ్యత అనుమానాలను నివృత్తి చేయగల్గింది. మహిళా సాధికారత విషయంలోనూ ఇది ఒక శక్తిమంతమైన సందే శాన్ని పంపగల్గింది. మూడో అంశం, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మహిళలను ప్రి–జడ్జి చేశారని, అవి తప్పని నిరూపితం అయినట్టు తేలింది.

అయితే శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, నేర పరిశోధనలో మహిళా సిబ్బంది ఇంకా సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితే ఉంది. వారి సంఖ్య పెరుగుదలకు అను గుణంగా మౌలిక వసతులు పెరగడం లేదు. సరైన టాయిలెట్లు లేకపోవడంతో కొందరు మహిళా సిబ్బంది విధులకు వచ్చే ముందు నుంచే మంచినీళ్లు తాగడం మానేస్తున్న పరిస్థి తులు ఉంటున్నాయి. ట్రాఫిక్‌ విధులు సైతం కనీసం నీటిని కూడా తాగకుండానే నిర్వర్తిస్తు న్నారు. చిన్నచిన్న పిల్లలు ఉన్న తల్లులు తమ చిన్నారులను ఇండ్లలోనే వదిలి విధులకు వస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. రుతుక్రమ సమయంలో, ఇతర సందర్భాల్లోనూ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు పురుష సహ ఉద్యోగుల నుంచి వివక్షను ఎదుర్కొనక తప్పని పరిస్థితి. వీటన్నింటినీ ఉత్తమ శిక్షణ ద్వారా మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. శిక్షణ పద్ధతులు సైతం పాత కాలపు మగ ఆధిపత్య ధోరణులతో కూడి ఉన్నాయి. జెండర్‌ సెన్సిటివ్‌గా వాటిని కాలానుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది. 

‘సరైన సమయం వస్తే ఈ భూమి మీద ఏ శక్తి కూడా ఒక ఆలోచనను నిలువరించలేదు’ అన్నారు విక్టర్‌ హ్యూగో. మూస ధోరణులు వీడి మహిళలకు నామమాత్రపు విధులు కాకుండా, కీలక బాధ్యతలు అప్పగించాల్సిన ఆవశ్యకత ఉంది. అలా చేయకపోతే పోలీస్‌శాఖలో వారి సంఖ్య మాత్రమే పెరుగుతుంది, వారి బాధ్య తలు కావు.


వ్యాసకర్త: సంజయ్‌ కుందు
హిమాచల్‌ప్రదేశ్‌ డీజీపీ

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు