‘జై భీమ్‌’ సినిమాలో చూపింది సత్యమేనా?

7 Dec, 2021 13:15 IST|Sakshi

జైభీమ్‌ సినిమా కలిగించిన సంచలనం సరే.. కానీ  ఒక నిర్మాతగా తనకున్న స్వేచ్చని హీరో సూర్య దుర్వినియోగ పరచారు. డీఎంకే పార్టీ మద్దతు దారుడు, జైభీమ్‌ నిర్మాత, హీరో సూర్య అగ్ని(వన్ని) కులక్షత్రియుల భుజంపై గన్‌ పెట్టి, హిందూ మతంపై ఎక్కుపెట్టిన, మతపర వ్యాపారాత్మకమైన మూలకాన్ని నింపిన తూటాను పేల్చాడు. విలన్‌ పాత్రధారుడైన పోలీస్‌ అధికారి ఇంట్లో ఒక సన్నివేశంలో అగ్ని(వన్ని)కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను ప్రత్యేకించి కనిపించేటట్లు పెట్టడం సదుద్దేశం ఎలా అవుతుంది? (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!)

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో వహ్నికుల క్షత్రియులుగానూ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో అగ్నికుల క్షత్రియులుగానూ జీవో నంబర్‌ 297/తేదీ.13–06–1921 అనుసరించి అధికారికంగా ధ్రువీకరించబడుతున్న అగ్ని, వన్ని కులక్షత్రియులు, పవిత్రమైనదిగా ఆరాధించే తమ జాతి  లోగోను ప్రతినాయకుడి ఇంట్లో పెట్టడం ద్వారా జాతి వివక్షదారులు వన్నియర్స్‌ అన్న అవాస్తవాన్ని చిత్రీకరించారు. ఈ అగ్ని, వన్ని కులక్షత్రియుల అగ్నికుండం లోగో ఉన్న క్యాలండర్‌ ప్రతినాయకుడి ఇంట్లోకి గాల్లో కొట్టుకు వచ్చి రాలేదు అన్నది వాస్తవం. ఇది తప్పు అని గొడవ చేస్తే, ఆ సన్నివేశంలో అగ్ని(వన్ని) కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను తొలగించి, జై భీమ్‌ సినిమాలో నిజ జీవితంలో గిరిజన రాజన్నను కొట్టి చంపిన పోలీస్‌ అధికారి పేరు వాస్తవానికి ఆంథోనిరాజు.  కానీ, జై భీమ్‌ సినిమాలో రాజన్నను కొట్టి చంపిన పోలీస్‌ అధికారి పేరుని గురుమూర్తిగా మార్చారు. (చదవండి: జైభీమ్‌.. నాటి పోరాటం గుర్తొచ్చింది!)

యధార్థ చరిత్ర అని చెప్పిన జై భీమ్‌ సినిమాలో హీరో తదితర  కొన్ని ముఖ్యమైన పాత్రలకు నిజ జీవితంలోని పేర్లే పెట్టారు. కానీ, విలన్‌ పాత్రధారి పేరుని మాత్రం హిందూ పేరుగా మార్చి పెట్టారు. సినిమా కలెక్షన్స్‌ పెంచుకోవడానికి, పూర్తి వ్యాపారాత్మక కోణంలో ఆలోచించి సినిమా టైటిల్‌ను జైభీమ్‌ అని పెట్టిన చిత్ర నిర్మాణ బృందం, అదే  వ్యాపారాత్మక కోణంలో ప్రతి నాయకుడిని హిందువుగా చూపించాలన్న అనైతిక చర్యకు పాల్పడింది. ఒక పవర్‌ఫుల్‌ సందేశాన్ని అందించే అవకాశాన్ని చిత్ర నిర్మాణ బృందం ముఖ్యంగా నిర్మాత, హీరో సూర్య  స్వార్థానికి వాడుకోవడం సమర్థనీయం కాదు. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...)

– చింతా శ్రీకృష్ణ బాబు
వ్యవస్థాపక అధ్యక్షులు 
దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ 

మరిన్ని వార్తలు