పెట్టుబడుల స్వర్గానికి స్వాగతం

26 May, 2022 13:00 IST|Sakshi

అమెరికా, భారత్‌ సంబంధాల్లో వాణిజ్య పరమైన బంధాలు కీలకమైనవి. అమెరికా, భారతీయ సంస్థలు హైదరాబాద్‌లో ఔషధ, అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి రంగాల్లో సన్నిహితంగా పనిచేస్తున్నాయి. నిజానికి 2014 నుంచి తెలంగాణలో అమెరికా కంపెనీలు 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో అమెరికా మదుపులను మేం ప్రోత్సహిస్తూనే, అమెరికాలో భారత పెట్టుబడుల పొత్తులకు కూడా ఎదురుచూస్తున్నాం. అందుచేత ఈ సంవత్సరం ‘సెలెక్ట్‌ యూఎస్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు’ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను.

‘సెలెక్ట్‌ యూఎస్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌’ అమెరికాలో జరిగే ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌. ప్రపంచంలో అతిపెద్ద మదుపు మార్కెట్‌లో అవకాశాల కోసం ఇది వేలాది మదుపుదారులను ప్రపంచ మంతటి నుంచి ఆకర్షిస్తుంటుంది. అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన సెలెక్ట్‌ యూఎస్‌ఏ ఆఫీసు నిర్వహించే ఈ సదస్సు... అమెరికాలో అపారమైన మదుపు అవకాశాల గురించి తెలుసుకోవడానికి ఉప యోగపడుతుంది. ఈ సంవత్సరం భారత్‌లోని అమెరికన్‌ ఎంబసీ... జూన్‌ 26 నుంచి 29 వరకు వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న సెలెక్ట్‌ యూఎస్‌ఏ సదస్సుకు భారీ భారతీయ వాణిజ్య ప్రతినిధుల బృందం హాజరయ్యేలా చూస్తోంది.

యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులున్న మార్కెట్‌. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లేదా ఒడిశాలో కంపెనీ ఉండి... అంత ర్జాతీయంగా ఎదగాలని చూస్తున్నట్లయితే, అమెరి కాలో మీకు అవకాశాలకు కొదవే లేదు. ఏటా 20 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తినీ, 32 కోట్ల మంది ప్రజానీకాన్నీ కలిగి ఉన్న అమెరికా, మీకు ఇతరులతో పోల్చలేని వైవిధ్యభరితమైన అవకాశాలను అంది స్తుంది. అద్భుతమైన న్యాయపాలన, మేధా సంపత్తి హక్కుల పరిరక్షణ, అధునాతనమైన టెక్నాలజీ వంటి అనేక పెట్టుబడి అనుకూల పరిస్థితులు భారత్‌ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లను ఇప్పటికే ఆకర్షించాయి. 2020లో అమెరికాలో భారతీయ పెట్టుబడులు 12.7 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఆరోగ్య సంర క్షణ, ఔషధాలు, టెక్నాలజీ వంటి రంగాల్లో అతిపెద్ద భారతీయ కంపెనీలు అమెరికాలో పెట్టుబడి పెట్టాయి. 

2011 నుంచి ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో భారత్‌ నుంచి 400 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నిర్వహించనున్న సదస్సు... దాదాపు 80 గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వచ్చే పెట్టుబడి దారులకు, సంస్థల ప్రతినిధులకు అనేక అవకాశాలను అందిస్తుంది. 

ఈడీఓలను, సర్వీస్‌ ప్రొవైడర్లను, ఇండస్ట్రీ నిపుణులను, అంతర్జాతీయ టెక్‌ స్టార్టప్‌లను కలుసు కుని వారి అనుభవాలు, ముందు  ముందు వచ్చే అవకాశాల గురించి చర్చించవచ్చు. అలాగే అమెరికా లోని 50 రాష్ట్రాలు, ప్రాదేశిక ప్రాంతాల నెట్‌వర్క్‌. 80కి పైగా కంపెనీలు, మార్కెట్లు, స్పీకర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారితో... ఒక్కొక్కరితో కానీ లేదా గ్రూప్‌లతో కానీ జరిపే సమావేశాలు మీకు పెట్టుబడి ఒప్పందాలను కుదిర్చిపెడతాయి.

100కి పైగా సెషన్లలో పాలసీ, పరిశ్రమల నిపుణుల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వ్యాప్తంగా పరిశ్రమల భాగస్వాములతో విలువైన భాగస్వామ్యం ఏర్పర్చుకునే అవకాశాలను ఈ సదస్సు అందిస్తుంది.

ఈ సదస్సు గురించి మరింత సమాచారానికి, రిజిస్ట్రేషన్‌ వివరాలకు, selectusasummit.usని చూడండి. సదస్సు గురించి మరింత సమాచారం, రిజిస్టర్‌ ఎలా చేయాలి వంటి వాటిపై సందేహాలను Andrew.Edlefsen@trade.govకి పంపించవచ్చు.


- జోయెల్‌ రీఫ్‌మన్‌ 
యూఎస్‌ కాన్సుల్‌ జనరల్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు