జలవివాదాల పరిష్కారానికి ఇదే మార్గం!

7 Sep, 2021 01:03 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాల సమస్య కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. గత అనుభవాల రీత్యా రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ సమస్య పరిష్కారం అంత సులువు కాదు కాబట్టి అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారానికి ప్రపంచస్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జలసూత్రమే శరణ్యమనిపిస్తోంది. ఏ దేశంలోనైనా ఎగువన ఉన్న రాష్ట్రానికే నదీజలాలను ముందుగా వినియోగించుకునే సర్వహక్కు ఉంటుందని, దిగువన ఉన్న రాష్ట్రాలు ఆ తరువాతనే నదీజలాలను వినియోగించుకునే హక్కు ఉంటుందన్న వాదనను ‘హెల్సెంకీ’ ప్రపంచ మహాసభ తిరస్కరించింది. సమానస్థాయిలో నదీజలాలను ముందు తాగునీటికీ, సాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, వాడుకోవాలని ‘హెల్సెంకీ’ మహాసభ 1966లో ఏకగ్రీవంగా తీర్మానించింది.

రాజ్యాంగానికి, దేశ ఫెడరల్‌ స్వభావానికి పరమ విరుద్ధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, పరిశ్రమల్ని ‘చాప చుట్టేసి’ భారీ స్థాయిలో ప్రైవేట్‌ గుత్తాధిపతులకు, పాలకులు ధారా దత్తం చేయడానికి కేంద్రపాలకులు నిర్ణయించేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారం కూడా జటిలమవు తోంది! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అర్ధాంతరంగా చీలగొట్టి తమాషా చూస్తున్న నిన్నటి కాంగ్రెస్, నేటి బీజేపీ పాలకులు సరికొత్త విభజన నాటకం ఆడుతూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే విభజిత రాష్ట్ర ప్రయోజనాలకు ఉద్దేశించిన కేంద్ర ఒప్పందాలకు విరుద్ధంగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల మధ్య కృష్ణ, గోదావరి నదీజలాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల వివాదాల సమస్య కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. గత అనుభవాల రీత్యా రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ సమస్య పరిష్కారం అంత సులువు కాదు కాబట్టి అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారానికి ప్రపంచస్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జల సూత్రమే శరణ్యమనిపిస్తోంది. పైగా ఇప్పటిదాకా జల వివాదాల పరి ష్కారానికి స్వతంత్ర శక్తులుగా వ్యవహరిస్తున్న ప్రత్యేక రివర్‌బోర్టులు కూడా కేంద్రం అధీనంలోనే జారుకునే ప్రమాదం ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌ 14 నుంచీ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న మేజర్, మధ్య రకం సాగునీటి ప్రాజెక్టులన్నీ కేంద్రం అధీనంలోకి జారుకోనున్నా యంటూ కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కృష్ణానదిపైన ఆధా రపడిన వివిధ స్థాయి ప్రాజెక్టులు 36 కాగా, గోదావరి నదీ జలాలపై ఆధారపడిన రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒడిశాలతో కలిపి 21 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ప్రాజెక్టులతోపాటు వాటికి సంబం ధించిన అనుబంధ విభాగాలన్నీ కూడా (బ్యారేజ్‌లు, డ్యామ్‌లు, రిజ ర్వాయర్లు, తదితర నిర్మాణ భాగాలు సహా) ఇకపై కేంద్ర సంస్థల పరిధిలోనే జారుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను నిష్పాక్షి కంగా ఉంచే పేరిట ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు రెండు రివర్‌బోర్డులలోనూ ప్రధాన పదవులలో ఉండరు! ఇక కృష్ణానదీ జల వ్యవస్థ కిందకు ఏపీ, తెలంగాణలు రెండింటి పరిధిలోకి వచ్చే ప్రాజె క్టులు శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, శ్రీశైలం కుడికాల్వ, కాగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు, టైల్‌పాండ్, తుంగభద్ర ప్రాజెక్టు, భైరవాని తిప్ప, రాజోలిబండ డైవర్షన్‌ పథకం, కె.సి. కెనాల్‌ ప్రాజెక్టు, గాజులదిన్నె. కాగా ఇంతవరకు కేంద్రం రెండు రాష్ట్రాలలోనూ ఇంకా అనుమతించని ప్రాజెక్టులు– తెలుగు గంగ, టి.జి.సి.హెడ్‌ వర్క్స్, వెలి గొండ ప్రాజెక్టు, దాని హెడ్‌ రెగ్యులేటర్‌ టన్నెల్, తదితర భాగాలు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, పంప్‌హౌస్, మచ్చుమర్రి లిఫ్ట్‌ ఇరి గేషన్‌ పథకం, గాలేరు–నగరి సుజల స్రవంతి, దాని హెడ్‌వర్క్స్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, మునిమేరు ప్రాజెక్టు పునర్నిర్మాణ పథకం. ఇక గోదావరి నదిపై తల పెట్టిన ఆంధ్ర–తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించిన పథకాలు ఏవంటే... పెదవేగి (గుమ్మడిపల్లి) శ్రీ వై.వి. రామకృష్ణ (సూరెం పాలెం) రిజర్వాయర్‌ పథకం, ముసురుమిల్లి రిజర్వాయర్, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు, కాటన్‌ బ్యారేజి, చాగల్‌నాడు ఎత్తి పోతల పథకం, భూపతి పాలెం రిజర్వాయర్, తదితరాలు, కాగా, గోదావరిపై కేంద్రం అనుమతించని ప్రాజెక్టులు. పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగే షన్‌ పథకం, పురుషోత్తపట్నం, ఎత్తిపోతల పథకం, (ఇదికూడా పోలవరం భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత నిలిచి పోతుంది.) చింతలపూడి ఎత్తి పోతల పథకం వెంకట నగరం. కృష్ణా– గోదావరి నదీ జలాల పంపిణీ వివాదంలో కేంద్రం విధానాలు మరిన్ని తగాదాలకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ కాబట్టి అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారా నికి ప్రపంచ స్థాయిలో రూపొందించిన ‘హెల్సెంకీ’ జలసూత్రమే శరణ్యమనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ ఆశపెట్టుకున్న బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రతిపాదనలు, తెలంగాణ ఆశపెట్టుకున్న బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ప్రతిపాదనలు గానీ ఆచరణలో అక్కరకు రానందున, హేతుబద్ధమైన అంతర్జాతీయ జలవివాదాల పరిష్కారాలకు మూలమైన వివాదరహితమైన ‘హెల్సెంకీ’ నదీజలాల పంపిణీ వ్యవస్థే భారతదేశానికి శరణ్యమని అనిపిస్తోంది. ఏ దేశంలోనైనా ఎగువన ఉన్న రాష్ట్రానికే నదీజలాలను ముందుగా వినియోగించుకునే సర్వహక్కు ఉంటుందని, దిగువన ఉన్న రాష్ట్రాలు ఆ తరువాతనే నదీజలాలను వినియోగించుకునే హక్కు ఉంటుందన్న వాదనను ‘హెల్సెంకీ’ ప్రపంచ మహాసభ తిర స్కరించింది. సమానస్థాయిలో నదీజలాలను ముందు తాగునీటికీ, సాగు నీటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి, వాడుకోవాలని ‘హెల్సెంకీ’ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అందుకే బచావత్‌ ట్రిబ్యునల్‌ కాలపరిమితి 2000–2001 సంవత్సరంతో ముగియనుం డగా, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి కృష్ణా జలాల్లో అదనపు నీటి సంపద సముద్రం పాలుకాకుండా వాడుకోవచ్చుగానీ ఆ నీటిపైన తన హక్కును మాత్రం చాటుకోకూడదని ఆదేశించి పోయింది. 

కానీ ఆ స్థితిలో ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన వెలగబెడుతూ వచ్చిన నాటి కాంగ్రెస్, టీడీపీ పాలకులు (ఎన్టీఆర్, వై.ఎస్‌. రాజ శేఖరరెడ్డి, నేటి వైఎస్సార్‌సీపీ సార«థి జగన్‌మోహన్‌రెడ్డి మినహా) బచావత్‌ సూచించినట్టు నదీ జలసంపద అనవసరంగా సముద్రం పాలు కాకుండా ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలన్న ప్రతిపాదనను పెడ చెవిన పెట్టిన ఫలితంగా, కనీసం చెక్‌డ్యామ్‌ను కూడా సకాలంలో నిర్మించుకోకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు. ముందస్తుగా నిర్దిష్టమైన ఒప్పందాలు రాష్ట్రాల మధ్య లేకుండా భవిష్యత్తులో వినియోగం పేరిట నదీ జలరాశిని దొంగచాటుగా రిజర్వు చేయడానికి ప్రయత్నిం చడం సాధ్యపడని విషయమని ప్రసిద్ధ ఇరిగేషన్‌ నిపుణుడు లిప్పర్‌ చెప్పాడు! కనుకనే ‘హెల్సెంకీ’ నిబంధనలు నదీ జలరాశి వాడకంలో హేతుబద్ధ వినియోగానికి మాత్రమే కట్టుబడి ఉండాలని రాష్ట్రాలను, దేశాలను శాసించవలసి వచ్చిందని గుర్తించాలి! 
జలరాశి ‘ముందస్తు దొంగవాడకం’ సూత్రాన్ని అనుమతించిన అమెరికా సైనికాధికారి హెర్మాన్‌ సూత్రం చెల్లనేరదని కూడా హెల్సెంకీ నిబంధనలు స్పష్టం చేశాయి. అమెరికా ‘హెర్మాన్‌’ దొంగవాడకం సూత్రాన్ని ఏనాడో ఒక కేసులో కలకత్తా హైకోర్టు (1906–07) కొట్టే సింది! ఉభయ రాష్ట్రాల వాడకానికి సరిపడా నీళ్లు నదిలో లేనప్పుడు నదీ జలరాశిని సమంగా సంబంధిత రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంటుంది. చివరికి నైలునదీ జలాల వివాదంలో కూడా సూడాన్, ఈజిప్టులు, అమెరికాలోని రాష్ట్రాలూ, హెల్సెంకీ అంతర్జా తీయ నిబంధనలనే పాటించాల్సి వచ్చింది! కృష్ణా–గోదావరి జల నిధుల వాడక సమస్యలను పరిష్కరించడానికి రివర్‌ ర్యాలీ వ్యవస్థ ఉన్నా తాత్సారం జరగడానికి కారణం... ప్రజలకు దూరమైన పాల కులు, వారి స్వప్రయోజనాలేనని మరవరాదు. ఈ రకమైన వారస త్వానికి, ఎన్టీఆర్, వైఎస్సార్‌ ఉమ్మడి ఏపీ పగ్గాలు చేపట్టిన తరు వాతనే గండిపడింది. 

ఈ అనుభవాలన్నింటినీ గుణపాఠాలుగా భావించి ఏపీ సీఎం స్థానంలో ఉండి, వైఎస్సార్‌ అనుభవచ్ఛాయల నుంచి దూసుకువచ్చి నవరత్నాలు పేర్చడమే కాకుండా, అంతకుమించిన ప్రజాసంక్షేమ పథకాలతో, కేంద్ర నాయకత్వాలు సమగ్ర ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి తలపెడు తున్న ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి, యువనేత వైఎస్‌ జగన్‌. అతను మానవ, మానవేతర ప్రకృ తులు కల్పించిన సవాళ్లను ఎదుర్కొంటూ మాట తప్పకుండా, మడమ తిప్పకుండానే’ దూసుకుపోతున్నాడు. గనుకనే 6 కోట్లమంది ప్రజలు ‘కోలాహల నాయకా శెభాషురే’ అని తనని దీవిస్తున్నారు!

-ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు