స్త్రీవాద విమర్శపై ఉపన్యాస పరంపర

17 Feb, 2022 14:11 IST|Sakshi

సాహిత్య విమర్శ రంగంలో పని చేస్తున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక కలిసి  ‘స్త్రీవాద సిద్ధాంతం – సాహిత్య విమర్శ’ అనే అంశం మీద అంతర్జాల ప్రసంగ పరంపరను నిర్వహించడానికి పూనుకున్నాయి. సాహిత్య అన్వయానికి సంబంధించిన అంశాలతో ఈ ఉపన్యాస పరంపరను రూపొందించాం.

అంతర్జాతీయంగా ఆలోచించటం, దేశీయ, సామాజిక, రాజకీ యార్థిక పరిణామాల సంబంధంలో స్త్రీల చరిత్ర నడిచిన దారులను తెలుసుకొనటం; ప్రాంతీయంగా స్త్రీల జీవితానికి సంబంధించి తెలుగు సాహిత్యం నిర్మించి ప్రచారం చేసిన భావజాలాన్ని నిర్ధారించటం, సమాంతరంగా  సాహిత్య రంగంలో అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక సంస్కృతిని నిరూపించటం లక్ష్యంగా ఈ ప్రసంగ విషయాలు రూపొందాయి. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది)

మొదటి నాలుగు ఉపోద్ఘాత ప్రాయమైనవి. తరువాతి 19 మానవ హక్కుల ఉద్యమ నేపథ్యంలో స్త్రీల హక్కుల ప్రశ్నను లేవనెత్తటం దగ్గర ప్రారంభించి ప్రపంచమంతటా స్త్రీలు వివక్షకు గురికావటాన్ని నిరసిస్తూ, కారణాలను అన్వేషిస్తూ, పరిష్కారాలు కోరుకొంటూ స్త్రీలు అనేక స్థాయులలో చేసిన యుద్ధాల, సిద్ధాంతాల అవగాహన కోసం ఉద్దేశిం చినవి. 24వ అంశం నుండి ఆ తరువాతవి అన్నీ భారతదేశ సందర్భం నుండి, తెలుగు సాహిత్య ప్రత్యేకత నుండి స్త్రీల అనుభవాన్ని, స్త్రీవాద భావనలను పరిశీలించేవి.  (క్లిక్: ఆ నిషేధం చదువును దూరం చేస్తుంది!)

స్త్రీవాద సిద్దాంతంలో సాహిత్య విమర్శలో అభిరుచి, అభినివేశం ఉన్న వాళ్ళందరూ ఈ ఫిబ్రవరి 20 నుండి ప్రతి ఆదివారం ఉదయం 11.00 లకు ప్రారంభమై 1.30 వరకు జరిగే ఈ వారం వారం అంతర్జాల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. సామాజిక మాధ్యమాలలో జూమ్‌ లింక్‌ వివరాలు ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తాము. సాహిత్య విమర్శకు, ప్రత్యేకించి స్త్రీవాద విమర్శకు సంబంధించి జరిగే సంభాషణలో భాగస్వాములు కావలసిందిగా విజ్ఞప్తి. 
– ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాసా వేదిక 

మరిన్ని వార్తలు