ఏపీలో చదువుల విప్లవం.. విద్యా విధానంలో పెనుమార్పులు

23 Jul, 2021 14:18 IST|Sakshi

ఇన్‌బాక్స్‌

పేద పిల్లల చదువుల విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాంది పలికింది అనడంలో అతిశయోక్తి లేదు. గత రెండేళ్లుగా అనేకమైన మార్పులకు శ్రీకారం చుట్టి, శిథి లావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా కార్పొరేట్‌ స్కూల్స్‌ స్థాయికి తెచ్చారు. అంతే కాకుండా జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మంచి ఆహారాన్ని రుచికరంగా అందిస్తూ, పరిపుష్టి గల పిల్లలుగా తయారు చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు దుస్తులు, షూ, బ్యాగు, బెల్టు అన్నీ కూడా నాణ్యమైనవి అందిస్తున్నారు. భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రాల్లో కేరళ, ఢిల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంటుంది.


పేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినీ విద్యా ర్థులు ఎంత చదువుకున్నా ఇంగ్లిష్‌ రాకపోవడం వలన పోటీ పరీక్షల్లో వెనుకబడి పోతున్నారు. దీన్ని గుర్తించిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కేజీ నుండి పీజీ వరకు ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేసింది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ నేత కామరాజ్‌ నాడార్‌కు దేశ ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ, కేవలం ఇంగ్లిష్‌ రాకపోవడం వలన ఆ అవకాశం తృటిలో తప్పిపోయింది. ఎంతో ప్రతిభ, వాగ్దాటి ఉండి కూడా కేవలం ఇంగ్లిష్‌ రాకపోవడం వల్ల ప్రధాని పదవి కోల్పోయారు. 


అదే విధంగా ఎంతో మంది యువతీ యువకులు ఎంతో ప్రతిభ ఉండి కూడా కేవలం ఇంగ్లిష్‌ రాక అనేక ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇట్లాంటి పరిస్థితిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేయడాన్ని మెజారిటీ ప్రజలు ఆమోదించారు. ఈ విధానాన్ని రానున్న 15–20 ఏళ్ల పాటు అవలంబించి నట్లయితే విద్యా విధానంలో పెనుమార్పులు జరిగి, ఆంధ్ర ప్రదేశ్‌ యువతీ యువకులు ప్రపంచంతో పోటీ పడతారు. 

– నాగెండ్ల సుమతి రత్నం
దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు