Rishi Sunak Larry The Cat: డౌనింగ్‌ స్ట్రీట్‌ మార్జాల మిత్రుడు

25 Sep, 2023 03:22 IST|Sakshi
ప్రస్తుత బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌తో ‘ల్యారీ’ 

కామెంట్‌

నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ‘ల్యారీ’ ఎందుకు కనిపించడు అని బ్రిటన్‌ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహూతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కొనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దానిని ‘సివిల్‌ సర్వెంట్‌’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరున్‌ పార్లమెంటులో ప్రకటించారు.

ప్రస్తుతం చీఫ్‌ మౌజర్‌ హోదాలో ఉన్న ఆ సివిల్‌ సర్వెంట్‌ పేరే ‘ల్యారీ’.  2011 నుంచి ల్యారీ బ్రిటన్‌ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్‌ కామెరున్, థెరెసా మే, బోరిస్‌ జాన్సన్, లిజ్‌ ట్రుస్, రుషి సునాక్‌... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్‌ స్ట్రీట్‌ నుంచి కదలించగలవు. 

పెంపుడు కుక్కలపై మక్కువ కలిగిన వారిగా బ్రిటిషర్‌లు లోక విదితం అయినప్పటికీ, వారి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రాముఖ్యం పొందే చతుష్పాదం మాత్రం మార్జాలమే. పిల్లిది అక్కడ ‘చీఫ్‌ మౌజర్‌’ హోదా. చీఫ్‌ మౌజర్‌ ప్రధాన విధి డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఒక్క ఎలుకైనా లేకుండా చూడటం. డౌనింగ్‌ స్ట్రీట్‌లోనే ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయాలు ఉంటాయి. అవడానికి అది మామూలు మార్జాలమే కానీ, దానిని ‘సివిల్‌ సర్వెంట్‌’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరున్‌ పార్లమెంటులో ప్రకటించారు.

ప్రస్తుతం చీఫ్‌ మౌజర్‌ హోదాలో ఉన్న ఆ సివిల్‌ సర్వెంట్‌ పేరు ‘ల్యారీ’. ‘బ్యాటర్‌సీ డాగ్స్‌ అండ్‌ క్యాట్స్‌ హోమ్‌’ నుంచి తప్పించి, దానిని అక్కడికి తెప్పించారు. 2011 నుంచి ల్యారీ బ్రిటన్‌ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్‌ కామెరున్, థెరెసా మే, బోరిస్‌ జాన్సన్, లిజ్‌ ట్రుస్, రుషి సునాక్‌... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్‌ స్ట్రీట్‌ నుంచి కదలించగలవు. 

జీవిత చరిత్రల రచనలో ప్రావీణ్యం కలిగిన నా మేనకోడలు నారాయణీ బసు బ్రిటిష్‌ ప్రభుత్వ అధికారిక మార్జాలాల జీవిత చరిత్రను సంక్షిప్తంగా సంకలన పరిచారు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి కాలం నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ మార్జాల జీవిత చరిత్రతో సంకలనం మొదలౌతుంది. ఆ కాలపు రాజనీతిజ్ఞుడు, క్యాథలిక్‌ బిషప్‌ అయిన లార్డ్‌ ఛాన్స్‌లర్‌... థామస్‌ వోల్సే దగ్గర ఆ మార్జాలం ఉండేది.

1929కి ముందే బ్రిటిష్‌ ప్రభుత్వం అధికారికంగా పిల్లి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. పిల్లి పోషణ, పాలన కోసం రోజుకు ఒక పెన్నీ కేటాయించినట్లు అప్పటి బడ్జెట్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాటి నుంచి పిల్లి ఖర్చు క్రమంగా పెరుగుతూ వచ్చి 21వ శతాబ్దానికి ‘చీఫ్‌ మౌజర్‌’ బ్రిటిష్‌ ఖజానాకు పెట్టిస్తున్న ఖర్చు 100 పౌండ్లకు చేరుకుంది. 

డౌనింగ్‌ స్ట్రీట్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ల్యారీ విధులు ఇలా ఉన్నాయి: ఇంటికి వచ్చే అతిథులను పలకరించడం, భద్రతకు ఉద్దేశించిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేయడం, కునుకు తీయడానికి పురాతన ఫర్నిచర్‌ ఏ మాత్రం నాణ్యతను కలిగి ఉన్నదో పరీక్షించడం. అలాగే, భవంతిలో ఎలుకలు చేరకుండా ఉండేందుకు పరిష్కారం ఆలోచించడం కూడా చేస్తోందనీ, ఆ పరిష్కారం ఇంకా వ్యూహాత్మక ప్రణాళిక దశలోనే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిందని కూడా వెబ్‌సైట్‌లో ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ల్యారీ తన బాధ్యతల కంటే కూడా ప్రధాని కార్యాలయ అవసరాలను చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతుంది. 

నారాయణి పరిశోధనను బట్టి కామెరున్‌ దగ్గర తన తర్వాత వచ్చిన ప్రధానుల కంటే కూడా ల్యారీ గురించి చెప్పడానికే ఎక్కువ సమాచారం ఉంది. ఆ పిల్లి గురించి సునాక్‌ అభిప్రాయాన్ని నారాయణి ప్రస్తావించలేదు. కనుక ల్యారీని అర్థం చేసుకోవాలంటే మనం కామెరున్‌ మీద ఆధారపడాలి. ఆయన చెబుతున్న దానిని బట్టి ల్యారీ పురుషుల సమక్షంలో కాస్త బెరుకుగా ఉంటాడు. అయితే అందుకు బరాక్‌ ఒబామా మినహా యింపు. ‘‘తమాషా ఏంటంటే ఒబామాను ల్యారీ ఇష్టపడతాడు. ఒబామా అతడికి మృదువైన చిన్న తాటింపు వంటి స్పర్శను ఇస్తాడు. దాంతో ల్యారీ ఒబామా దగ్గర సౌఖ్యంగా ఉంటాడు. 

అయితే ల్యారీ ప్రధానమంత్రుల సతీమణులను కలవరపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యారీ ఒంటి వెంట్రుకలు తన భర్త సూట్‌లపై కనిపించడంతో సమంతా కామెరున్‌ ల్యారీని ప్రధాని నివాసంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. అంతెందుకు, పక్కనే ఉండే విదేశాంగశాఖ కార్యాలయంలోకి ల్యారీని ప్రవేశించనివ్వకుండా క్యాట్‌–ప్రూఫ్‌ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్‌ దానిని కిందికి తీసుకెళ్లండి అని కోరారు. అయితే హేగ్‌కి ల్యారీ పట్ల కొంత ఆపేక్ష ఉండేదట.

కఠోర వాస్తవం ఏంటంటే ల్యారీకి ఉన్న ప్రజాదరణ కారణంగా తరచూ ప్రధాన మంత్రి కంటే కూడా ఎక్కువగా ల్యారీకి భద్రతా బలగం అవసరం అయ్యేది. కామెరాన్‌ దంపతులు ఆ పిల్లిని ఇష్ట పడటం లేదని కథలు వ్యాప్తి చెందడం ప్రారంభవమడంతో ల్యారీ, తను ‘పర్‌–ఫెక్ట్‌లీ వెల్‌’  అని ప్రధాని కామెరున్‌ తప్పనిసరై ట్వీట్‌ చేయవలసి వచ్చింది. ఆ ట్వీట్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి భరోసాను ఇచ్చింది.  

నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ల్యారీ ఎందుకు కనిపించడు అని బ్రిటన్‌ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహుతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రవేశ ద్వారం వద్ద ట్రంప్‌తో కలిసి థెరెసా మే, ఆమె భర్త ఫొటోలు దిగుతున్నప్పుడు ల్యారీ వారి వెనుక కిటికీ అంచుపై నిలబడి ప్రతి ఫొటోలోనూ కనిపించింది.

తర్వాత వర్షం నుంచి తలదాచుకోడానికి సాయుధుల కనురెప్పల కాపలాలో ఉన్న ట్రంప్‌ క్యాడిలాక్‌ కారు కింద దూరిన ల్యారీని ఎంత నచ్చచెప్పీ బయటకు రప్పించలేక పోయారు. బి.బి.సి.కి చెందిన జోన్‌ సోపెల్‌ ఆ ఘటనను... ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌: ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనకారులు డొనాల్డ్‌ ట్రంప్‌ వాహన శ్రేణిని నిలువరించడంలో విఫలమయ్యారు. కానీ 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ పిల్లి ఆ పని చేయగలిగింది’’... అని ట్వీట్‌ చేశారు. 

కొంతకాలంగా ల్యారీపై మునుపెన్నడూ లేని విధంగా తరచూ  విమర్శలు వినవస్తున్నాయి. ల్యారీ స్వభావం, పనితీరు చుట్టూ కేంద్రీకృతం అయిన విమర్శలవి. వేటాడి చంపే క్రూర స్వభావం ల్యారీలో విస్పష్టంగా లోపించడాన్ని డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికారులు గమనించారు. ‘‘ఎలుకల్ని వేటాడడం కన్నా ఎక్కువ సమయం ల్యారీ నిద్రలోనే గడుపుతున్నాడు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు.

అయితే నేను విన్నదేమంటే సునాక్‌ అతడిని విధుల నుంచి విరమింపజేసే ప్రమాదం లేదని. ఏ విధంగా చూసినా కూడా సునాక్‌ దంపతులకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చేవాళ్ల మెప్పు పొందే వరకైనా ల్యారీ అక్కడ ఉంటాడు. ల్యారీ మాంసం కూరను ఇష్టపడతాడా లేక పప్పూ, అన్నం అంటాడా అనేది బహుశా అప్పుడు మనం తెలుసుకోవచ్చు.

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

మరిన్ని వార్తలు