అతి అణచివేతతో తిరుగుబాటు తీవ్రం

9 Jul, 2021 01:12 IST|Sakshi

ఆదివాసీల ఆత్మీయనేస్తం ఫాదర్‌ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చనిపోవడం పలువుర్ని చలింపజేసింది. ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభివర్ణిస్తున్నారు. ఈ మర ణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అసమ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ‘ఉపా’ చట్టం ఒక అస్త్రం కావడం దారుణం, అమానుషం.

విచారణే మొదలు కాని కేసులో, న్యాయ ప్రక్రియే మరణశిక్ష అయింది. ఆధారాల్లేని అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ హక్కుల కార్యకర్త... వృద్ధాప్యానికి, వ్యాధులకు, కడకు బెయిల్‌ నిరాకరణకు బలై నిర్బంధంలోనే అసహజ మరణం పొందారు. దీనికి బాధ్యులె వరు? నేరుగా జవాబు రాకపోగా... లోపభూయిష్టమైన మన నేర– న్యాయ నిర్వహణ (క్రిమినల్‌ జస్టిస్‌) ప్రక్రియపైనే ఇది సందేహాలను రేకెత్తిస్తోంది. నిర్హేతుక నిబంధనలున్న ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)’ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. రాజ్యం–పోలీసు అపవిత్ర బంధం ఎల్లలు దాటి, ‘అసమ్మతి’ని అణచివేస్తున్న దాష్టీ కాన్ని ఎత్తిచూపుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాదని వక్రగతిన సాగే చట్టం అమలును ఉపేక్షిస్తున్న న్యాయవ్యవస్థ దౌర్బల్యాన్ని తెరకెక్కి స్తోంది. ఇదిక్కడితో ఆగకూడదు. జరిగే దురాగతాలకు బాధ్యులెవరో తేలాలి. అందుకు, పౌరసమాజం చేతనతో, ఈ అరిష్టాలకు మూలాలు వెతికి పట్టుకోవాల్సిన, అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదివా సీల ఆత్మీయనేస్తం ఫాదర్‌ స్టాన్‌స్వామి (84) నిర్బంధంలో చని పోవడం పలువుర్ని చలింపజేసింది. వృద్ధాప్యం, పార్కిన్‌సన్‌ వ్యాధి, కోవిడ్‌ అనంతర సమస్యలు.... పలుమార్లు బెయిల్‌ కోరి నిరాకరణకు గురైన దురవస్థ! ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభి వర్ణిస్తున్నారు. ఈ మరణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ (ఈయూ) ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. దేశంలోని పది రాజకీయ (వి)పక్షాలు, బాధ్యులపై చర్య తీసుకోవాలని, భీమా–కోరేగావ్‌ నింది తులతో పాటు రాజకీయ కారణాలతో నిర్బంధంలో ఉన్న వారందరినీ బెయిల్‌పై విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇదే కేసు సహ నిందితులు జైళ్లోనే ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఇంతటి స్పంద నలు రేకెత్తించిన ఈ ఘటనను కేవలం ఒక హక్కుల కార్యకర్త మరణంగానే చూడకూడదు. ప్రజావిశ్వాసం కోల్పోతూ... రాజకీయ, పాలన, న్యాయ వ్యవస్థలు రోజురోజుకూ క్షయమవుతున్న దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా చూడాలి.

సంబంధం లేని కేసులో....
కోరేగావ్‌ తానెప్పుడూ వెళ్లలేదని, తనకీ కేసుతో సంబంధమే లేదని రోమన్‌ కాథలిక్‌ పూజారి స్టాన్‌ స్వామీ మొదట్నుంచీ చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐజీ) పథకం ప్రకారం తనను ఇరికించిన తీరుకు ఆశ్చర్యపోలేదు. అరెస్టుకు ముందు విడుదల చేసిన వీడియో కథనం ప్రకారం, ఆయనకీ విషయంలో స్పష్టత ఉంది. ‘ప్రశ్నించిన వారి గొంతు దేశమంతటా నొక్కుతున్నారు. నాకొక్కడికే జరుగుతు న్నది కాదిది. సంతోషం, ఈ ప్రక్రియలో నేను భాగమయ్యాను. ఎందు కంటే, నేను మౌన ప్రేక్షకుడిని కాదు. ఈ ఆటలో భాగమైన వాణ్ణే! ... తగు మూల్యం చెల్లించడానికి నేను సిద్ధమే!’ అన్నారు ధీమాగా! కానీ, ప్రాణాలనే ఇచ్చి మూల్యం చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. 2018 జనవరి 1 భీమా–కోరేగావ్‌ అల్లర్ల వెనుక మావోయిస్టులున్నారని, వారిని హింసకు ప్రేరేపించిన ప్రసంగాలు 2017 డిసెంబరు 31 ఎల్గార్‌ పరిషత్‌ సమావేశంలో జరిగాయనేది కేసు. మరికొందరు ఒకరితో ఒకరు మాటాడుకుంటూ కుట్రపన్నారనేది ఆరోపణ. విప్లవకవి, హక్కుల యోధుడు వరవరరావుతో పాటు మొత్తం 17 మంది కవులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, ఇతర మేధావుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. నిషేధిత మావోయిస్టులతో చేతులు కలిపి, ప్రభు త్వాన్ని కూల్చే విశాల కుట్ర పన్నారనేది ప్రధాన అభియోగం. ‘మావో యిస్టు సిద్దాంతాలను నేను ఒప్పుకోను, వ్యతిరేకిస్తాను’ అని బహి రంగంగా ప్రకటించే వ్యక్తికి, వారితో ‘కుట్ర’ సంబంధాలు అంట గట్టడంలోనే అభియోగమెంత బలహీనమో తేలిపోయింది. బెయిల్‌ వినతి వచ్చినపుడు, నమ్మదగ్గ సాక్ష్యాలను బట్టే న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగ పత్రాన్ని ఖరారు చేసి విచారణ ప్రారంభించలేదు. ఇక స్వామిపై వచ్చిన అభియోగాలకు ఆధారమని, ఆయన ల్యాప్‌టాప్‌లోని పత్రా లను చూపిస్తున్నారు. మరో నిందితుడు సురేంద్ర గాడ్లింగ్‌ కంప్యూటర్‌ రెండేళ్లుగా దురుపయోగమౌతోందని, ‘మాల్‌వేర్‌’ ద్వారా అందులోకి డాక్యుమెంట్లు పంపేందుకు గల ఆస్కారాన్ని అమెరికాకు చెందిన డిజి టల్‌ ఫోరెన్సిక్‌  సంస్థ నిరూపించింది. అదే, స్టాన్‌స్వామీ ల్యాప్‌టాప్‌ తోనూ జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే, అరెస్టుకు ముందు రెండు సార్లు ఆయన గదిలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్, మొబైల్‌ తది తరాల్ని దర్యాప్తు బృందం స్వాధీనపరచుకుంది. నిర్దిష్ట ఆరోపణ లున్నా, దీనిపై విచారణే జరుగలేదు, ఇది నమ్మదగ్గ సాక్ష్యం కాదు.

ఇంతటి కాఠిన్యం యాధృచ్ఛికమా?
న్యాయ కస్టడీలో, మొదట చికిత్సకు నిరాకరించినా, ‘వారిచ్చే చిన్న మాత్రల కన్నా, నా వ్యాధి తీవ్రతే హెచ్చుగా ఉంది, ఏమో నేను చచ్చి పోతానేమో?’ అని ఒక దశలో సందేహించిన స్వామీ, చివరకు ఆస్పత్రిలో చేరడానికి అంగీకరించారు. మూడు దశాబ్దాలకు పైగా జార్ఖండ్‌లోని ఆదివాసీల హక్కుల కోసం స్టాన్‌స్వామి పోరాడు తున్నారు. గిరిజనుల అటవీ–భూమి హక్కుల కోసం, యువత అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ‘బగీచా’ను స్థాపించారు. 3000 మంది యువకులను మావోయిస్టులుగా ముద్రవేసి, అక్ర మంగా జైళ్లలో కుక్కడాన్ని నిరసిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు. అరెస్టయిన 97 శాతం మందికి మావోయిస్టులతో ఏ సంబంధం లేదని, 96 శాతం యువత కుటుంబ నెలసరి ఆధాయం రూ. 5 వేల లోపని నిర్ధారించారు. నిష్కారణంగా జైళ్లో మగ్గి, విలువైన జీవిత కాలాన్ని, కొన్నిసార్లు జీవితాల్ని కోల్పోతున్నారని స్వామి తరచూ బాధపడేవారు. ఈ సుదీర్ఘ పోరాట క్రమమే పాలకులకు, వారితో అంటకాగుతున్న కార్పొరేట్‌ శక్తులకు కంటగింపైంది. యథే చ్చగా సహజవనరుల్ని, ప్రకృతి సంపదను కొల్లగొట్టే తమకు... పోరా టాలు అవరోధంగా, స్వామీ ఒక అడ్డంకిగా కనిపించారు. కుంటి జిల్లా ‘ముండే’ ఆదివాసీల భూహక్కుల కోసం సాగిన ‘పథల్‌ గాడీ’ ఉద్య మాన్ని అణచివేసేందుకు, 20 మందిపై రాజద్రోహం కేసు పెట్టారు. అందులో స్టాన్‌స్వామీ ఒకరు. రాజ్యాంగ రక్షణకు, దానికి లోబడి శాంతియుతంగా పోరాడుతున్న వ్యక్తిని వ్యవస్థ హతమార్చింది. పరి వర్తన కేంద్రాలు, సంస్కరణాలయాలు అని చెప్పుకునే మన జైళ్లలో... ఇంతటి కాఠిన్యం బయటి వారూహించరు. 84 ఏళ్ల వయసులో, పార్కిన్‌సన్‌ వ్యాధివల్ల ‘గ్లాసు పట్టుకొని నీళ్లు తాగలేకపోతున్నాను స్ట్రానో, సిప్పరో ఇప్పించండి’ అంటే, మూడు వారాలు జాప్యం చేసిన కర్కశత్వం చరిత్రలో నిలుస్తుంది. ప్రత్యేక కోర్టు జడ్జి బెయిల్‌ నిరా కరిస్తూ, ‘స్వామి వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సమాజ ఉమ్మడి ప్రయోజనాలే ప్రాధాన్యమైనవి’ అన్నారు నిష్కర్షగా! ఈ నెల 6న ముంబాయి హైకోర్టు ముందు బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఉన్నపుడు... ఒకరోజు ముందు, 5ననే స్టాన్, ఏ బెయిలూ అవసరం లేని లోకాలకు వెళ్లి పోయారు.

2016–19 నాలుగేళ్లలో 2.2 శాతం కేసుల్లోనే నేర నిరూపణ జరిగి శిక్షలు పడ్డాయి. అందుకే, ‘ఉపా’ చట్టం పాలకుల చేతిలో దురుప యోగమౌతోంది. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అస మ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ఇదొక అస్త్రం. అరెస్టు చేయడం, బెయిల్‌ నిరాకరించడం, గిట్టని వారిని పాలకులు కోరుకున్నంత కాలం నిర్బంధంలోనే ఉంచడం రివాజ యింది. గొంతెత్తే ఇతరులకు, ఇది ముందస్తు హెచ్చరికగానూ పని కొస్తోంది. ఇదివరకటి నల్లచట్టాలు ‘టాడా’ ‘పోటా’ల దారిలోనే ‘ఉపా’ కూడా అటకెక్కాల్సిన సమయం వచ్చింది. అణచివేత ఎంత అధికంగా ఉంటే, అనులోమ నిష్పత్తిలోనే తిరుగుబాటు తీవ్రత ఉంటుందని రాజ్యం గ్రహించాలి.

దిలీప్‌ రెడ్డి
ఈమెయిల్‌ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు