శ్రమ విలువ తెలుసు కాబట్టే...

27 Apr, 2022 12:06 IST|Sakshi

జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ముఖచిత్రమే మారిపోయింది. పేదవాడి అవసరాలను తీర్చడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనువుగా పెట్టుబడి రాయితీలు ఇవ్వడం, ‘రైతు భరోసా’ కేంద్రాల ద్వారా నాణ్య మైన విత్తనాలు, ఎరువులు అందించడం, మెట్ట ప్రాంతాలలో ఉచిత బోర్లు వేసే ‘జలకళ‘ కార్య క్రమాలను చేపట్టడం; ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించడం, డ్వాక్రా రుణాలు ఇవ్వడం; పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి ‘చేయూత’ అందించడం; ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఏ సీజన్లో నష్టాన్ని అదే సీజన్లో చెల్లించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం, రోజు వారీ పనులు చేసుకునే వారికి ‘ఆసరా’ ఇస్తూ నిత్యం పేదవాడి చేతిలో డబ్బు ఉండేలా చూసి ఉత్పత్తి రంగం దెబ్బతినకుండా చూడడం వంటి జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలు పేదలకు, మహిళలకు, మైనారి టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి.

శ్రమైక జీవులైన వెనుకబడిన 139 కులాల వారిని 58 కార్పొరేషన్ల ద్వారా ఆదుకునే ప్రయత్నం మామూలు విషయం కాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 760 మందిని... అంటే ఐదేళ్లలో దాదాపు 2,000 మందికి పైగా ఈ కులాలకు చెందిన వారిని నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు.

శ్రమజీవుల కోసం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే 35 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి, అందరికీ గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చ పూనుకోవడం. ఇది ఒక విప్లవాత్మకమైన చర్య. అంతేకాకుండా విద్యాల యాలను, వైద్యశాలలను ఆధునికీకరించడం ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం పేదవాడికి అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడానికి పాలనా వికేంద్రీకరణకు వీలు కల్పించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. 

అన్ని మతాల వారినీ సమానంగా గౌరవించడంలో భాగంగా  మసీదులు, మదరసాలు, దేవాలయాలు, చర్చిల... నిర్మాణాలు, పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం అందించడం, ఆయా ప్రార్థనా మందిరాల్లో పనిచేసే మత పెద్దలుగా లేదా పూజారులుగా ఉన్నవారికి జీతాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించడం జగన్‌ ప్రభుత్వ చలవే. ఇవన్నీ చూసినప్పుడు పేదవాని శ్రమను గుర్తించిన వాడుగా జగన్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనిపిస్తుంది. ప్రతిపక్షం ప్రభుత్వ ప్రతిష్ఠను పలుచన చేయడా నికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు పోతున్నారు జగన్‌.

– కె.వి. రమణ
బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు