5జీ టెక్నాలజీ గొప్పదే కానీ...

29 Sep, 2022 10:42 IST|Sakshi

అక్టోబర్‌ 1 నుండి 5జీ టెక్నాలజీ వాణిజ్య సేవలను భారత్‌లో అధికారికంగా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అసలు ఈ 5జీ టెక్నా లజీ అంటే ఏమిటో, దానివల్ల సామాన్య ప్రజలకు, ఇతరులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.        

నిజానికి టెలికాం రంగంలో ఇంత త్వరితగతిన వచ్చినన్ని సాంకేతిక మార్పులు మరే ఇతర రంగంలో రాలేదు. 1980లలో 1జీ టెక్నాలజీ ద్వారా అనలాగ్‌ వాయిస్‌ కాల్స్‌ మాట్లాడుకునే సౌకర్యం వస్తే, 1990 నాటికి 2జీ టెక్నాలజీ ద్వారా డిజిటల్‌ వాయిస్, ఎస్‌ఎంఎస్‌ ఇచ్చుకునే సదుపాయం వచ్చింది. 2000 నాటికి 3జీ సాంకేతి కత ద్వారా మొబైల్‌లో డేటా వాడు కునే సౌకర్యం కల్పించారు. 2010 నాటికి 4జీ ద్వారా మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు 5జీ ద్వారా మొబైల్‌లోనే హై స్పీడ్‌ నెట్‌వర్క్‌ కల్పిస్తున్నారు. ఎక్కువ స్పీడ్‌ కలిగిన నెట్‌వర్క్‌ కావాలంటే భూగర్భ కేబుల్‌ ద్వారా వేసిన బ్రాడ్‌ బ్యాండ్, లేక ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్‌ తీసుకోవాలని అనుకునే దశ నుండి, మొబైల్‌లోనే రియల్‌ టైమ్‌ వేగంతో బ్రాడ్‌ బ్యాండ్‌ వాడుకునే వెసులుబాటు 5జీ ద్వారా కలుగు తుంది.  

5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్, ఐటీ, వాతావరణ, అంతరిక్ష రంగా లలో పెను మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల్లో 5జీ అమలు ద్వారా లోడ్‌ నియంత్రణ నెట్‌వర్క్‌ గణనీయంగా మెరుగవుతుంది. వర్చ్యువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ సౌకర్యం వల్ల... విద్యారంగం, వైద్య సేవలు ప్రపంచ స్థాయికి చేరు తాయని భావిస్తున్నారు. మిషన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ద్వారా యంత్ర పరికరాల రిపేరు, యంత్రాలను నడపటం మొబైల్‌ ద్వారానే చేయగలం. మరింత అధునాతన వీడియో కాన్ఫ రెన్స్‌ సౌకర్యం ఏర్పడుతుంది. ఐటీ లేదా పెద్దపెద్ద కంపె నీలలో హై స్పీడ్‌ నెట్‌వర్క్‌ వినియోగం ద్వారా పెను మార్పులు వస్తాయి.

5జీ టెక్నాలజీ నిరంతరం రావడానికి ఎక్కువ టవర్లు అవసరం వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ. 4జీతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించదు. అందుకే ఎక్కువ టవర్లు, డబ్బు అవసరం. ఇప్పుడు వాడు తున్న మొబైల్స్‌ బదులుగా 5జీ టెక్నాలజీ మొబైల్స్‌ వాడాల్సి ఉంటుంది. హాకర్లు సైబర్‌ నేరాలకు మరింత ఎక్కువగా పాల్పడే అవ కాశం ఎక్కువ. వర్షం వచ్చినా 5జీ నెట్‌వర్క్‌ సరిగా పనిచేయదు. కేవలం వినోదం, గేమింగ్, డేటా వినియోగం పెంచుకోవడంపై ప్రయివేట్‌ టెలికాం కంపె నీలు దృష్టి పెడతాయి కనుక యువత చెడిపోయే ప్రమాదం ఎక్కువ. ప్రయివేట్‌ టెలికాం కంపెనీలతో పాటు 5జీ టెక్నా లజీని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు కూడా ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవల అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మురాల తారానాథ్‌
వ్యాసకర్త టెలికామ్‌ రంగ విశ్లేషకులు
మొబైల్‌: 94405 24222

మరిన్ని వార్తలు