వర్ణమాల నేర్పడం ఓ ప్రయోగం!

31 Dec, 2022 00:51 IST|Sakshi

చిన్నమెదళ్ళపై ఒక పెద్ద ప్రయోగమే వర్ణమాల! దగ్గర దగ్గర పోలికలు గల అక్షరాలు ఉండడం వల్ల అభ్యసన క్రమంలో గుర్తించటం... కొందరికి కష్టంగానూ, మరికొందరికి ఇష్టంగానూ, ఇంకొం దరికి గందరగోళంగానూ ఉంటుంది. నేర్చుకోవ డానికి కొందరికి 6 మాసాలు పడితే మరి కొందరికి ఒక ఏడాది కాలం పడుతుంది. ఇంకొం దరికైతే అది ఒక సాహసం లాంటిది. అక్షరాలను గుర్తుపట్టలేక పాఠశాలకు ఎగనామం పెట్టే విద్యా ర్థులు కూడా ఉంటారు, ఉన్నారు కూడా.

ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో నమోదు అయిన విద్యార్థి ఏయే అంశాలు పూర్తిస్థాయిలో నేర్చుకున్నాడు, ఆ విద్యార్థి రెండవ తరగతికి అర్హుడా, కాదా అనేది ఆ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడి సలహాతో పని లేదా? ఒక ఏడాది కాలంలో ఒకటవ తరగతిలో విద్యార్థి నేర్చుకోవలసిన అంశాలు... వర్ణ మాల, ఒత్తులు, గుణింతాలు, పాఠ్య పుస్తకంలోని సంసిద్ధత పాఠాలు 7, నేర్చు కోవలసిన పాఠాలు 25. 

ఇది సులభమా? ఇదికాక విదేశీ బాష (ఆంగ్లం) నేర్పడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు, మూడవ తర గతి వచ్చేసరికి పరిసరాల విజ్ఞానం నేర్పడం... పై తరగతుల్లో  హిందీ నేర్పడం... ఇవన్నీ కూడా ఉపాధ్యా యుడికి ఒక ప్రయోగం లాంటివే. ఉపాధ్యాయులకు ఏపీఈపీ, డీపీఈపీ, సీఎల్‌ఐపీ, సీఎల్‌ఏపీ, క్యూఐపీ, ఎన్‌ఐఎస్‌టీఏ, ఎఫ్‌ఎల్‌ఎన్‌ లాంటి శిక్షణలు ఎన్ని ఇచ్చినా నేషనల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌) వంటివాటిల్లో వెల్లడైనట్లు... భాష సామర్థ్యాలలో ఎందుకు విద్యార్థులు వెనుకబడ్డారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

విద్యార్థులు నేర్చుకోవలసిన అంశాలను పూర్తి స్థాయిలలో నేర్చు కోకుండా ‘నో డిటెన్షన్‌ పాలసీ’ (ఎన్‌డీపీ) ఒక అవరోధంగా మారింది. ఎన్‌డీపీ ఉద్దేశం 1 నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ పై తర గతులకు ప్రమోట్‌ చేయడమే. విద్యార్థికి భాషా సామర్థ్యాలైన ఎల్‌ఎస్‌ ఆర్‌డబ్ల్యూపై అవగాహన ఉన్నదా లేదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇందు మూలంగా విద్యార్థులకు నష్టం జరుగు తోంది. అసలు ఎన్‌డీపీ ఉద్దేశమే అక్షరాస్యత శాతం పెంచడం.

1వ తరగతి పూర్తి స్థాయిలో అభ్యసనం జరిగిన తరువాతే, రెండవ తరగతికి, అలాగే 8వ తరగతి వరకు ప్రమోట్‌ చెయ్యాలి. ఈ విధంగా చేయడం వలన పై తరగతుల విద్యను సులభంగా నేర్చుకోగులుగు తారు. అభ్యసనం సులభంగా ఉంటుంది. నేర్చుకోవడంలో తృప్తి, ఆనందం లభిస్తుంది. అభ్యసనంలో మెళకువలు తెలుస్తాయి. అప్పుడు ప్రతి అంశం సులువు అనిపిస్తుంది.

మన తెలుగు వర్ణమాలతో పోల్చుకున్నప్పుడు ఆంగ్ల అక్షరములు నేర్చుకోవడం సులువు. మన తెలుగు వర్ణమాలలో ఉన్న ఒకే పోలికలతో ఉన్న అక్షరాలూ, ఒకే శబ్దంతో ఉన్న అక్షరాలూ, భిన్న శబ్దాలతో ఉన్న అక్షరాలూ పిల్లలు అర్థం చేసుకోడానికి ఇబ్బందిగా ఉంటాయి. లక్ష్య సాధనలో విద్యార్థి స్థాయికెళ్లి ఆలోచన చేస్తే, ఇది ఒక ప్రయోగం లాంటిది. పౌరులకు నాణ్యమైన విద్య అందించకపోతే, సమాజం మను గడ దిగజారి పోతుంది.

ఉన్నత ప్రమాణాలతో వైద్యవిద్య, నేర్చుకొన్న వైద్యుడు రోగులను ఆరోగ్య వంతులుగా మారుస్తాడు. అలాగే ఒక ఇంజనీర్‌ అనేకమైన అద్భు తమైన కళాఖండాలను నిర్మిస్తాడు. ఉన్నత విద్యావంతుల మూలంగా నూతన పురోగతి సాధిస్తాం. శాస్త్ర వేత్తలూ, మేధావులూ, నాయకులను తయారు చేయగల సామర్థ్యం ఒక విద్యకు మాత్రమే ఉన్నది. అందుకే ప్రాథమిక స్థాయి విద్యను పటిష్టం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఉపాధ్యాయడికి నేర్పవలసిన బాధ్యత ఎంతైతే ఉన్నదో విద్యార్థికి కూడ నేర్చుకోవలసిన బాధ్యత కూడా అంతే ఉన్నది.

పాఠశాలలు నిర్మించి వాటి నిర్వహించడానికీ, ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికీ ప్రభు త్వాలు చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. విద్యార్థి సర్వతోముఖా భివృద్ధికి తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఒక్కొక విద్యార్థిపై రూ. 1,50,000గా తేలింది. విద్యపై చేస్తున్న ఖర్చునూ, విద్యా ప్రమాణాలనూ దృష్టిలో పెట్టుకుని సమాజం, తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలో తమ వంతు పాత్రను బాధ్యతతో నిర్వహించాలి. పిల్లలు నేర్చుకోవడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనందరిదీ!

ఉయ్యాల ప్రసాదరావు 
వ్యాసకర్త సీనియర్‌ ఉపాధ్యాయుడు
మొబైల్‌ : 80082 87954 

మరిన్ని వార్తలు