మూడు రాజధానుల ‘చారిత్రక’ నిర్ణయం

11 Aug, 2020 04:26 IST|Sakshi

సందర్భం 

రాజధానికి ఒక ఠీవి ఉండాలి. ఒక ఘన చరిత్ర ఉండాలి. ఇతర రాష్ట్రాలు, దేశాల పెట్టుబడుల్ని ఆకర్షిం చేట్లుండాలి. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఆదాయాన్ని అందించే దిగా ఉండాలి. ఆంధ్రప్రదే శ్‌లో ఇప్పటికి ఆ స్థాయి ఒక్క విశాఖకు మాత్రమే ఉంది. నిజమే, ఒకప్పుడు 1937 నాటి శ్రీబాగ్‌ ఒడం బడిక మేరకు ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలోని 140 మంది తెలుగు జిల్లాల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్రా నికి కర్నూలులో లెజిస్లేటివ్‌–కమ్‌–ఎగ్జిక్యూటివ్‌ పాలన విభాగాల రాజధాని, గుంటూరులో జ్యుడీషి యల్‌ పాలనా విభాగ రాజధాని నెలకొల్పాలని నిర్ణ యించారు. అట్లా రెండు వికేంద్రీకరణలతో కూడిన రాజధానులు ఏర్పరుచుకోవడం 1953లోనే జరి గింది. కానీ ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పరుచుకోవడంతో బాటు విజయవాడ–గుంటూరులను కేంద్రీకృత రాజ ధానిగా చేసుకోవాలని లోలోపల ఆకాంక్ష గల ఆనాటి మధ్యాంధ్ర నాయకులు, ముఖ్యంగా కృష్ణా– గుంటూరు నాయకులు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ (43 మంది శాసనసభ్యులు), కమ్యూనిస్ట్‌(20 మంది శాసన సభ్యులు) నాయకులు రాజధానిని కర్నూలు నుండి మార్చాలని పట్టుబట్టారు. రాజధానిగా కర్నూలు పుట్టి రెండు నెలలు కూడా గడవకముందే (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌; దానికి హైదరాబాద్‌ రాజ ధాని అనే ఆలోచన లేశమంతైనా రూపుదిద్దుకోక ముందే) కర్నూలులోని శాసనసభలో ‘రాజధాని విషయంగా’ పలు దఫాలుగా చర్చలు జరిగాయి. దానిపై నవంబర్‌ 30, 1953న తుది నిర్ణయం తీసు కునేట్లు ఆమోదం అయ్యింది. కానీ మూడు ఓట్ల తేడాతో వీరి ప్రయత్నం విఫలమైంది. అనగా విజయ వాడ–గుంటూరులను రాజధానిగా చేసుకోవాలనే వీరి ఆకాంక్ష ఆకాంక్షగానే మిగిలిపోయింది.

అటు గ్రేటర్‌ రాయలసీమ ప్రాంత సభ్యుల్లో కొందరు కర్నూలులోనే రాజధాని శాశ్వతంగా ఉండా లని కోరగా, కొందరు విశాఖనూ, మరికొందరు విజయవాడ–గుంటూరులను కోరుతూనే అప్పటికి ఏ రూపూలేని విశాలాంధ్ర ఏర్పడితే హైదరాబాద్‌నే రాజధానిగా ఏర్పరుచుకోవాలని సీమేతర నాయకుల తోబాటు కోరడం జరిగింది. ఏప్రిల్‌ 1, 1956 వరకు మాత్రమే కర్నూలులో రాజధాని కొనసాగాలనీ, ఆ తరువాత పలు సౌకర్యాల దృష్ట్యా విశాఖపట్టణాన్ని శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేయాలని మెజారిటీ సభ్యులు నవంబర్‌ 30, 1953 నాటి సమావేశంలో నిర్ణయించారు– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని రాజ ధానిగా హైదరాబాద్‌ ఆలోచనలకు మూడేండ్ల ముందుగానే. ఈ నిర్ణయానికి అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు పడ్డాయి. 20 మంది (కమ్యూనిస్టులు) తటస్థంగా ఉన్నారు. అనగా శ్రీబాగ్‌ ఒప్పందానికి భిన్నంగా రాజధాని అయిన కర్నూ లును తాత్కాలిక రాజధానిగా నిర్ణయించడం, విశా ఖకు తరలించడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే శ్రీబాగ్‌ ద్వారా పొందిన రాజధానిని కోల్పోయామనే బాధ గ్రేటర్‌ సీమవాసుల్లో 1953 నుండీ కొనసాగు తూనే ఉంది. పైగా సభ నిర్ణయం వల్ల విశాఖ ప్రాంతీ యులకు కూడా రాజధాని వచ్చేసిందన్నట్లు ఆశ కలిగింది. కానీ, వీరి ఆశ కూడా అడియాసగానే మిగిలిపోయింది.

అంటే, కర్నూలు, విజయవాడ–గుంటూరు, విశాఖపట్నం ప్రాంతీయుల ముగ్గురిలోనూ తమ తమ ప్రాంతాల్లో రాజధాని ఏర్పడాలనే ఆకాంక్ష దీర్ఘకాలంగా నెలకొని ఉంది. కనీసం రాజధాని పాలనా విభాగాలు మూడింటిలో ఒక్కటైనా తమ ప్రాంతంలో ఏర్పాటు కావాలన్న కోరిక బలంగా ఉంది. ఈ మూడు ప్రాంతీయుల ఆకాంక్షల చారిత్రక నేపథ్యంపై అవగాహన ఉన్నందువల్లే నేటి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమరావ తిలో లెజిస్లేచర్‌ విభాగాన్ని ఏర్పరచడానికి గత అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇలా చేస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా ఊతం ఇస్తాయని ఆయన భావించారు. కాబట్టి, ఉత్తరాంధ్ర ఈస్ట్‌ పాకిస్తాన్‌ కాదు; గ్రేటర్‌ రాయలసీమ వెస్ట్‌ పాకిస్తాన్‌ కాదు; రెండూ మనవే. అవి కూడా తమ ఆకాంక్షల్నీ, అభివృద్ధినీ సాధించుకోవాలని ఆశి స్తాయి. కాబట్టి అమరావతి ప్రాంతీయుల్లో మిస్‌గైడ్‌ కాబడినవారు ఆలోచిస్తారని ఆశిద్దాము. రాజధాని మార్చకూడదని వాదించేవాళ్లు– 1937 నాటి శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని త్యాగం చేసిన సీమవారు, 1953 నాటి శాసనసభ నిర్ణయం ప్రకారం విశాఖను రాజధానిగా పొంది కోల్పోయిన ఉత్తరాంధ్ర వాళ్లు నేటి మూడు రాజధానుల నిర్ణ యానికి ఎక్కువ సర్దుకుపోతున్నారో, అమరావతి వాసులు ఎక్కువ సర్దుకుపోతున్నారో ఆలోచించాలి.

వ్యాసకర్త రిటైర్డ్‌ ప్రొఫెసర్, చరిత్ర శాఖ,
ఎస్వీయూ, తిరుపతి ‘ 98495 84324
|డాక్టర్‌ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి

>
మరిన్ని వార్తలు