తండ్రి సంకల్పం... తనయుడి సాకారం

29 Jun, 2021 00:00 IST|Sakshi

సందర్భం

సంకల్పశుద్ధికి చిత్తశుద్ధి తోడయితే ఎంతటి కష్టసాధ్యమైన పనైనా సాకారం అవుతుందని చెప్పడానికి ఓ ఉదాహరణ ‘పోలవరం’ బహుళా ర్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం ముగింపు దశకు చేరడం. ప్రపంచం లోనే అతిపెద్ద స్పిల్‌వేతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఫలాలు అనతి కాలంలోనే ప్రజలకు అందను న్నాయి. గోదావరి డెల్టాకు తొలిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్రక్రియకు జూన్‌ 11న అంకురార్పణ జరిగింది. అప్పర్‌ కాఫర్‌ డ్యావ్‌ు పూర్తి చేసి స్పిల్‌వే మీదుగా నీరు విడుదల కాబోతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్రోచ్‌ చానల్‌ ద్వారా స్పిల్‌వేకు మళ్లించే పనులు ముమ్మరమయ్యాయి. గోదావరి నీటిని అప్రోచ్‌ కెనాల్‌కు విడుదల చేయడం వల్ల ఆ నీరు స్పిల్‌వే, రివర్‌స్లూయిజ్‌ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి చేరి అక్కడి నుంచి సెంట్రల్‌ డెల్టాతోపాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే ఇది పోలవరం అందించే తొలిఫలితం అవుతుంది.

‘పోలవరం’కు ఎదురైన అడ్డంకులు బహుశా భారత దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకూ ఎదురు కాలేదనడం అతి శయోక్తి కాదు. వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలు కాకుండా వాటిని గరిష్ఠంగా ఉపయోగించుకోవడా నికి పోలవరం ప్రాజెక్టును నిర్మించాలన్న ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడినప్పుడే తెరపైకి వచ్చింది. అయితే, రాష్ట్రం ఏర్పడిన 2 దశాబ్దాల తర్వాత 1979లో నాటి ముఖ్య మంత్రి టి.అంజయ్య పునాదిరాయి వేశారు. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదంటే పరిపాలన ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, 2004లో వైఎస్‌ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సాగునీటి ప్రాజెక్టులను కట్టా లని జలయజ్ఞం అనే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. 2005లో పోలవరం నిర్మాణానికి చొరవ తీసుకొన్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టు కడితే ఆ ఘనత రాజశేఖరరెడ్డికి చెందుతుందనే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులు పన్ని పలు ఆటంకాలు సృష్టించారు. తమ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులతో న్యాయస్థానంలో కేసులు వేయించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలకు పార్టీ పరంగా లేఖలు రాసి రెచ్చగొట్టారు. వైఎస్‌ ఉక్కు సంకల్పం ముందు ఎవరి కుయుక్తులు పనిచేయలేదు. ఆయన అధికా రంలో ఉన్న కాలంలోనే 2005–2009 మధ్యకాలంలో కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు 90 శాతం పూర్తి చేశారు.

2018 నాటికే పోలవరం పూర్తి కావల్సి ఉంది. కానీ, ఆలస్యం కావడానికి కారణం చంద్రబాబు చూపిన ఉదా సీనతతోపాటు, జరిగిన అవినీతి. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి నివేదికలు పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ‘పోలవరంను చంద్రబాబు ఒక ఏటీఎంగా మార్చారు’ అని ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోల వరం నిర్వాసితుల సమస్యను నిర్లక్ష్యం చేసింది. 2013 భూసేకరణ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించింది.

2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి రాష్ట్ర చరిత్రను తిరగరాయడానికి దోహదం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం పనుల్లో పారదర్శకత తెచ్చారు. కేంద్రానికి సంపూర్ణ నమ్మకం కలిగించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు సెటిల్‌మెంట్‌ కల్పించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ మేఘా ఇంజనీరింగ్‌కు లక్ష్యాలు నిర్దే శించారు. ఫలితంగానే ఈ రెండేళ్లల్లో నిర్మాణపు పనులు పరుగులు తీయడమేకాక, ఈ సీజన్‌లోనే వరదను మళ్లించ డానికి అనుగుణంగా అప్రోచ్‌ చానెల్, స్పిల్‌వే గేట్ల ఏర్పాటు, స్పిల్‌ చానెల్, పైలెట్‌ చానెల్‌ దాదాపు పూర్తయ్యాయి. గోదా వరికి అప్రోచ్‌ చానెల్‌ ప్రారంభయ్యే చోట తాత్కాలికంగా ఉన్న బండ్‌ను తొలగించడంతో గోదావరి ప్రవాహాన్ని కుడి వైపునకు పంపించి నదినే 6.6 కిలోమీటర్ల మేర మళ్లించారు. భారీ వరదలు వచ్చినపుడు రేడియల్‌ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇలా స్పిల్‌వే నుంచి స్పిల్‌ చానెల్‌లోకి విడుదల చేసిన నీరు పైలెట్‌ చానెల్‌ ద్వారా తిరిగి గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తుంది.

దేశంలో రెండో పెద్ద నది అయిన గోదావరికి వరదలు వస్తే 35 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి నదిని 6.6 కిలోమీటర్లు మళ్లించడం సామాన్యం కాదు. అదొక ఇంజినీరింగ్‌ అద్భుతం. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్టు పూర్తయిన తరువాత కూడా అలాగే కొనసాగు తుంది. నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) ఉంటాయి. అందులో గ్యాప్‌2గా పిలిచే ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కవ్‌ు ర్యాక్‌ ఫిల్‌ డ్యాం) అతి పెద్దది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునే విధంగా దీనిని నిర్మిస్తున్నారు.

గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి అవసరమైన పనులు రికార్డ్‌ సమయంలో జరిగాయి. ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్‌వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్‌ చానెల్‌ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వే శారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో కోటి 54 లక్షల 88 వేల ఘనపు మీటర్ల మట్టి త్రవ్వకం పనుల్లో ఇప్పటికి 1 కోటి 4 లక్షల 88 వేల ఘనపు మీటర్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రేయింబవళ్లు యంత్రాంగం పని చేయడం విశేషం. ఈ క్రమంలో ఇరిగేషన్‌ శాఖామా త్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమకూర్చిన ప్రోత్సాహం అద్భుతం. మొత్తం మట్టి పని 5 కోట్ల 92 లక్షల పనికి గాను 5 కోట్ల 24 లక్షల ఘనపు మీటర్ల మేర పూర్తయ్యింది. మొత్తం సిసి బ్లాకులు (స్పిల్‌వే) 17 లక్షల ఘనపు మీటర్లు కాగా 15.17 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయ్యింది. ఇందులో స్పిల్‌వే కీలకమైనది. 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని నియం త్రించి గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తుంది. ప్రపం చంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్‌ స్పిల్‌వేగా చైనా లోని త్రిగాడ్జెస్‌ జలాశయానికి పేరుంది. ఇప్పుడు దాని కంటే పోలవరం జలాశయం సామర్థ్యం 3 లక్షల క్యూసె క్కులు అధికం. ఇంతపెద్ద వరద నీటిని తట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఇందు కోసం 15.17 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనులు చేశారు. గేట్లను హైడ్రాలిక్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. అందులో భాగంగా 22 పవర్‌ ప్యాక్‌లను 44 గేట్లకు అమర్చారు. 28 రేడియల్‌ గేట్లను హైడ్రాలిక్‌ పద్ధతిలో ఈ సీజన్‌లో వరద వచ్చినా విడుదల చేసే విధంగా 28 గేట్లను ఎత్తి ఉంచారు. వైఎస్‌ చొరవ వల్లనే నాడు పోలవరం అడుగులు ముందుకుపడ్డాయి. రెండేళ్లల్లో  జగన్‌ కృషితో దశాబ్దాల కల సాకారం కానుంది. చరిత్రలో ఓ తండ్రి మొదలుపెట్టిన ప్రాజెక్టును కుమారుడు పూర్తి చేయడం ఇదే మొదలు.       


డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
వ్యాసకర్త కేంద్ర మాజీమంత్రి
 

మరిన్ని వార్తలు