Ravuri Bharadwaja: సమాజాన్ని చదివిన రచయిత

5 Jul, 2021 08:12 IST|Sakshi

రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలన చిత్ర పరిశ్రమను వస్తువుగా చేసు కొని వెలువడిన పాకుడురాళ్లు నవల. 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవ లలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మ కథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథా నికలు రచించారు. జీవన సమరం మరో ప్రముఖ రచన.

ఒక బీద కుటుంబంలో జన్మిం చిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయి వరకే చదువుకు న్నారు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన ప్పుడు వ్యవ సాయ కూలీల కఠిన మైన జీవన పరిస్థితులను గమనించే వాడు. అప్పటి పల్లె ప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచ నలు, కోపాలు, తాపాలను తర్వాతి కాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించ డానికి ఉపయోగించు కున్నాడు. 

నేల విడిచి సాము చేయ కుండా, వాస్తవిక జీవితాల ఆధా రంగా రచనలు చేయటం ద్వారా పాఠకులకు స్ఫూర్తిని కలిగించే రచ నలు ఉత్తమమైనవని ఆయన భావించారు  నిజాన్ని నిజంగా నిజాయితీగా చెబుతున్నప్పుడు ఏ రచనకైనా పేరు వస్తుందని నమ్మి ఇతరులకు చెప్పారు. నేటి ధన స్వామ్య వ్యవస్థ యొక్క క్షీణ సాంస్కృతిక విలువల ప్రతిబింబౖ మెన సినీ వ్యవస్థలోని బీభత్సాన్ని పాకుడు రాళ్ళు నవలలో బట్ట బయలు చేశారు. తద్వారా మొత్తంగా నేటి సామాజిక వ్యవ స్థపై ఆయనకు గల ఏవగింపును వ్యక్తీకరించారు.

వీరి సాహిత్య జీవితం నుండి నేటి తరం రచ యితలు నేర్చు కోవల సినవి చాలా ఉన్నాయి. పట్టుదలతో, స్వయం కృషితో, విస్తృత అధ్యయ నంతో బడి చదువుల జ్ఞానం కంటే చాలా ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించ వచ్చు అని రావూరి రుజువు పరి చారు. 1927 జూలై 5న జన్మించిన వీరు 2013 అక్టోబర్‌ 18న గతిం చారు. భారతీయ జ్ఞాన పీఠం తన 48వ పురస్కారాన్ని రావూరి భర ద్వాజకు ఇవ్వటం ఆనంద దాయకం. 
– డా. జొన్నకూటి 
ప్రమోద్‌ కుమార్‌
పైడిమెట్ట, 94908 33108
(నేడు రావూరి భరద్వాజ జయంతి)

మరిన్ని వార్తలు