కారుణ్య బడ్జెట్‌

5 Feb, 2023 04:19 IST|Sakshi

అభిప్రాయం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్‌ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. ఆర్థిక ఉత్పాతాలకు లోనయ్యే ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం అనేక చర్య లను ప్రతిపాదించింది. కళాకారులకూ, హస్తకళాకారులకూ నిపుణతలు నేర్పించే పీఎం – వికాస్‌ వంటి పలు పథకాలను పేర్కొని తీరాలి. ఇవి 2047 నాటికి వికాస్‌ భారత్‌ లక్ష్యసాధనకు పునాది వేస్తాయి.

2023–24 కేంద్ర బడ్జెట్‌ దాని ఆదర్శాలకు సంబంధించి సాహసో పేతమైనదే, కానీ దాని గణన విధానంలో సాంప్రదాయికమైనది. దాని వ్యూహాల్లో ఆశావహమైనది, అయినప్పటికీ అది వాస్తవంలో బలమైన పునాదిని కలిగిఉంది. ఇది ప్రపంచ సూక్ష్మ ఆర్థిక ముఖ చిత్రం చుట్టూ ఉన్న అనిశ్చితత్వాలను విజయవంతంగా సంగ్రహించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమృత్‌ కాల్‌ వైపు గమనం సాగిస్తున్నందున దానికి అవసరమైన దృఢత్వాన్ని పెంపొందించి, వృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్‌ మ్యాప్‌ని అందించింది.

సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్‌ (ప్రతి ఒక్కరితో, అందరి అభి వృద్ధి కోసం) అనే పంక్తులను అనుసరించిన ఈ బడ్జెట్‌ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. సమాజంలోని అన్ని వర్గా లకూ ఇది ఏదో ఒక అవకాశాన్ని ప్రతిపాదించింది. బడ్జెట్‌ అనే ఈ డాక్యుమెంట్‌ 2047లో భారత్‌ ఆకాంక్షిస్తున్న తరహా సమాజం గురించి ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరు స్తోంది. ఇండియా ఎట్‌ 100 (వందేళ్ల భారత్‌) సమగ్రత, సంపద్వంతం అనే స్తంభాలపై నిలబడుతుంది. అప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి మన యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలతో పాటు దేశంలోని పౌరులందరికీ చెందుతాయి. సమీకృత అభివృద్ధి, చివరి మైలురాయిని కూడా చేరుకోవడం అనే రెండు తొలి ప్రాధాన్యాల ద్వారా ఈ దార్శనికత ప్రతిఫలిస్తుంది. ఆర్థిక ఉత్పాతాలకు సులభంగా లోనయ్యే దుర్బలమైన ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం; సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారసంస్థల సాధికారత కోసం తాజా బడ్జెట్‌ చర్య లను ప్రతిపాదించింది.

సాంకేతికతను, ఆర్థికాన్ని సమ్మిళితం చేయడం ద్వారా వ్యక్తులకు, స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడంపై తాజా బడ్జెట్‌ గట్టిగా దృష్టి పెట్టింది. మన యువతకు సాధికారత కల్పిస్తూ, అమృత్‌ పీఢీ (బంగారు తరం) తన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంలో సహాయం చేసేందుకు తగిన విధానాలను అది రూపొందించింది. యువతకు, మహిళలకు, హస్తకళాకారులకు, స్వయం సహాయక బృందాలకు విస్తృతంగా ఉద్యోగాల కల్పన కోసం తగిన నైపుణ్యాల ప్రాధాన్యతపై అది దృష్టి పెట్టింది. సాంప్రదాయిక కళాకారులకు, హస్తకళా కారులకు నిపుణతలు నేర్పించడం కోసం ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్‌ సమ్మాన్‌ (పీఎమ్‌–వికాస్‌) వంటి పథకాలను ప్రత్యేకంగా పేర్కొ నాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయాధారిత అగ్రిస్టార్టప్‌లను ప్రోత్స హించడానికి అగ్రికల్చర్‌ ఆక్సిలేటర్‌ ఫండ్‌ కల్పన, ‘దేఖో అప్నా దేశ్‌ ఇనిషి యేటివ్‌’ కింద పర్యాటక రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు, పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించడానికీ బడ్జెట్‌ ప్రాధాన్యం ఇచ్చింది.

2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 ద్వారా, అమృత్‌ పీఢీ కార్యక్రమం ద్వారా యువశక్తికి, ఆధునిక నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకం కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి అంశాల్లో యువతకు నైపుణ్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ ద్వారా ఉపకార వేతనాలు కూడా అందిస్తోంది. ఇలా రూపొందిన నిపుణ కార్మిక శక్తి నుండి పర్యాటక రంగం ప్రయోజనం పొందుతుంది. ఇక యువ పారిశ్రామికవేత్తలయితే ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ప్రతిపాదిత ‘యూనిటీ మాల్స్‌’ గుండా మార్కెటింగ్‌ మద్దతు కూడా పొందుతారు. బాహ్య ఎదురుగాలులను తట్టుకునేందుకుగాను బడ్జెట్‌ ఆశిస్తున్న శక్తి గుణకాల్లో ఇవి ఓ భాగం.

అనిశ్చితమైన బాహ్య వాతావరణం ద్వారా ఎదురయ్యే సవాళ్లను బడ్జెట్‌ గుర్తించడమే కాదు, వృద్ధి పెంపుదలలో దేశీయ చోదకశక్తులు ఎంత కీలకమో ఎత్తి చూపుతోంది. ప్రపంచ
వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్‌ ఆర్థిక ప్రమా దాల నుంచి బయటపడటమే కాకుండా, 2023లో 7 శాతం, 2024 ఆర్థిక సంవత్సరంలో 6.6 లేదా 6.8 శాతం వృద్ధి రేటు అంచనాను నిలబెట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను నడిపించింది. 

అంతర్జాతీయ ఉపద్రవాల నేపథ్యంలో కూడా, ఇప్పటికీ దృఢంగా ఉంటూ, దూసుకెళుతున్న దేశీయ చోదక శక్తుల ద్వారా ఆర్థిక వృద్ధి సాగుతోంది. కోవిడ్‌ అనంతర కాలంలో ప్రైవేట్‌ విని యోగం పెరగడం కూడా దీనికి తోడయింది. బహుముఖంగా సాగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వల్ల కాంట్రాక్ట్‌ ఇన్సెంటివ్‌ సర్వీసు లపై వ్యక్తులు ఖర్చుపెట్టడం సాధ్యమైంది. ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం, అధిక స్థాయిలో మూలధన వ్యయం (33 శాతం పెరుగుదలతో 10 లక్షల కోట్లకు పెరిగింది) పెరగడం, కార్పొరేట్ల ఆదాయ, వ్యయ సమాచార నివేదికలు బలపడటం వంటివి వీటిలో కొన్ని. దీనికి అనుగుణంగా వ్యవసాయం, టూరిజం, మౌలిక వ్యవస్థాపన వంటి వాణిజ్యేతర రంగాలపై బడ్జెట్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా పర్యా వరణం, గ్రీన్‌ ఎకానమీ వంటి క్రాస్‌ కటింగ్‌ థీమ్‌లు (ప్రధాన లక్ష్యంపై గురి తప్పకుండానే అనుబంధ అంశా లపై దృష్టి పెట్టడం) కూడా బడ్జెట్‌ లోకి వచ్చాయి. ప్రభుత్వ విధాన రోడ్‌ మ్యాప్‌లో సుస్థిరాభివృద్ధికి కేంద్ర స్థానం.

అదేవిధంగా ‘పంచామృత్‌’ (అయిదు ప్రతి జ్ఞలు), ‘మిషన్‌ లైఫ్‌’ (పర్యావరణ అనుకూల జీవన శైలి), నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్, (రూ.19,700 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు), కాలం చెల్లిన వాహనాల తొలగింపు విధానం, చెత్త నుంచి సంపదను సృష్టించే 500 వందలకు పైగా  నూతన ప్లాంట్‌లను నెలకొల్పే గోవర్ధన్‌ స్కీమ్‌ (10,000 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు), తీరప్రాంత నివాసాల రక్షణ కోసం మడ అడవుల పెంపకం, ప్రత్యక్ష ఆదాయ పథకం వంటి వాటి గురించి 2023–24 బడ్జెట్‌లో నొక్కి చెప్పడమైనది.

సొంత చొరవ, కార్యకలాపాల ద్వారా నీతి ఆయోగ్‌ లక్ష్యాల సాధన కోసం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌ గణనీయ స్థాయిలో మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. స్టేట్‌ సపోర్ట్‌ మిషన్‌ ద్వారా నీతి ఆయోగ్‌ మరింత నిర్మాణాత్మక, సంస్థాగత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలతో తాను వ్యవహరించే తీరును మరింత మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. మరోవైపున నీతి ఆయోగ్‌ నేతృత్వంలోని ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌ (ఆకాంక్ష జిల్లాలు) ప్రోగ్రామ్‌ విజయం గురించి, ఇటీవలే ప్రారంభించిన ఆస్పి రేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రామ్‌లలోని సామర్థ్యం గురించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నొక్కి చెప్పారు. ఈ పరివర్తనా కార్య క్రమం ద్వారా నీతి ఆయోగ్‌ దేశవ్యాప్తంగా 500 బ్లాక్‌ల లోని(సమితులలోని) పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడానికి పాలనను మెరుగుపర్చ డంపై కూడా దృష్టి పెడుతుంది. ఇవి, మరికొన్ని కార్యకలాపాలు... 2047 నాటికి వికాస్‌ భారత్‌ (అభివృద్ధి చెందిన భారత్‌) లక్ష్యసాధన వైపుగా... మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలతో సహకా రాత్మక చర్యకు పునాది  వేస్తాయి.  

సుమన్‌ బెరీ
వ్యాసకర్త నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌

మరిన్ని వార్తలు