మహిళాభివృద్ధికి చేయూత

18 Mar, 2023 00:46 IST|Sakshi

డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌

బొంత అర్జునరావు

బాపట్ల అర్బన్‌: వైఎస్సార్‌ ఆసరా పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ బొంత అర్జునరావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం డీపీఎం, ఏపీఎం, సీసీ, వీఓలతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి రెండు విడతలుగా నగదు చెల్లించడం జరిగిందన్నారు. మూడవ విడత నగదు జమ చేసే కార్యక్రమం ఈనెల 25న జరుగుతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీఓఏలు గడప గడపకూ తిరిగి వైఎస్సార్‌ ఆసరా పథకం గురించి అవగాహన కల్పించడంతోపాటు స్వయం సహాయక సంఘాలు వివరాలను గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. రెండు విడతలుగా ఎంత నగదు లబ్ధిదారులకు జమ అయింది, మూడవ విడతలో ఎంత నగదు వచ్చేది వివరాలు సిద్ధం చేయాలన్నారు. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులపాటు వీవోఏ, సీసీ, ఏపీఎంలు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వైఎస్సార్‌ ఆసరా పథకం గురించి తెలియ జేయడంతోపాటు ఆయా సంఘాలకు ఇప్పటి వరకు ఎంత నగదు వచ్చింది.. మూడవ విడతలో ఎంత నగదు వచ్చేది తెలియ జేయాలన్నారు. ఈనెల 25వ తేదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్సార్‌ ఆసరా మూడవ విడత నగదు జమ చేయడం జరుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు