శోభకృత్‌లో రాష్ట్రం మరింత శోభాయమానం

23 Mar, 2023 01:36 IST|Sakshi
గుంటూరులో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల, డొక్కా తదితరులు

పట్నంబజారు: శోభకృత్‌ నామ సంవత్సరంలో పేరుకు తగ్గట్టుగానే రాష్ట్రాన్ని మరింత సమగ్రాభివృద్ధితో శోభాయమానంగా, సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలని అందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తగినంత శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బృందావన్‌గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కార్యాలయంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ నోరి నరసింహమూర్తి చేసిన పంచాంగ శ్రవణం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా, నిరంతరాయంగా అమలు జరగాలని, పేదరిక నిర్మూలనకు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ వసంత ఆగమనంతో శోభకృత్‌ సకల శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకలలో డెప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్‌ సజీల, మిర్చియార్డు చైర్మన్‌ మద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బత్తుల దేవానంద్‌, గీతా మందిరం చైర్మన్‌ వెలుగూరి రత్నప్రసాద్‌, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌, కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటకృష్ణ, పార్టీ నేతలు బందా రవీంద్రనాథ్‌, గులాం రసూల్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు వినోద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు